పోలీస్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్స్) | AP State Level Police Recruitment Board | Sakshi
Sakshi News home page

పోలీస్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్స్)

Published Mon, Aug 29 2016 12:55 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

పోలీస్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్స్) - Sakshi

పోలీస్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్స్)

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. 494 పోలీస్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్ వివరాలు..
 
 అర్హతలు
  వయసు:  2016, జూలై 1 నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (1994 జూలై 2 - 1998 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి).
 
  బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
 
 హోంగార్డులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసులకు అనుగుణంగా నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
 
విద్యార్హతలు: 2016, జూలై 1 నాటికి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్/కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్/మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషనల్ (ఐటీఐ) సర్టిఫికెట్ కలిగి ఉండాలి (లేదా) ఎంపీసీ విభాగంలో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి (లేదా) ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్/ఎలక్ట్రికల్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్) లో వొకేషనల్ ఇంటర్ చదివి ఉండాలి.
 
 శారీరక ప్రమాణాలు
 పురుషులు: కనీసం 162 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 84 సెం.మీ ఉండాలి (కనీసం 4 సెం.మీ పెరగాలి).
 
  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరిలకు చెందిన ఎస్టీ, ఆదివాసీ తెగల అభ్యర్థులు కనీసం 160 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ కనీసం 80 సెం.మీ ఉండాలి (కనీసం 3 సెం.మీ పెరగాలి).
 
 మహిళలు: కనీసం 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. బరువు కనీసం 40 కిలోలుండాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలకు చెందిన ఎస్టీ, ఆదివాసీ అభ్యర్థులు కనీసం 150 సెం.మీ ఎత్తు, 38 కిలోల బరువు ఉండాలి.
 
 ఎంపిక విధానం

 కమ్యూనికేషన్ పోలీస్ కానిస్టేబుల్ భర్తీలో ఎలాంటి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించరు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుంటూరు/ విజయవాడలో సర్టిఫికెట్ల పరిశీలన, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహిస్తారు. ఇందులో అర్హులైన వారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహిస్తారు. పీఈటీలో భాగంగా 1600 మీటర్ల పరుగు (1 మైలు) పందెంలో అర్హత సాధించాలి. దీన్ని పురుష అభ్యర్థులు 10 నిమిషాల లోపు; మహిళా అభ్యర్థులు 12 నిమిషాల 30 సెకన్ల లోపు పూర్తిచేయాలి. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఫైనల్ రాత పరీక్ష ఉంటుంది. మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఒకవేళ అర్హులైన మహిళా అభ్యర్థులు అందుబాటులో లేకుంటే వారికి రిజర్వ్ చేసిన ఖాళీల్లో అర్హులైన పురుష అభ్యర్థులను నియమిస్తారు.
 
 రాత పరీక్ష
 ఆబ్జెక్టివ్ విధానంలో రెండు వందల మార్కులకు టెక్నికల్ పేపర్ ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇందులో కనీస అర్హత మార్కులు నిర్దేశించారు. ఓసీ అభ్యర్థులు 40 శాతం; బీసీ అభ్యర్థులు 35 శాతం; ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు 30 శాతం కనీస మార్కులు పొందాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది.
 
 పరీక్ష సిలబస్
 ఈ పరీక్షలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో, కంప్యూటర్ బేసిక్స్, టెలిఫోన్ సిస్టమ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
  ఎలక్ట్రికల్ విభాగం నుంచి కండక్టర్స్ అనువర్తనాలు, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కార్బన్, కిర్కాఫ్ లా, ఓమ్స్ లా, వీటీవీఎం, యూనివర్సల్ మీటర్,  ఓమ్ మీటర్, అమ్మీటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ ఇండ్యూస్డ్ వోల్టేజ్, కరెంట్, ఫారడేస్ ప్రిన్సిపల్, లెన్సెస్ లా ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్, ఏసీ జనరేటర్స్, ఫ్లెమింగ్ నియమం, యావరేజ్ ఆర్‌ఎంఎస్ వ్యాల్యూస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 
ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో విభాగానికి సంబంధించి ఇండక్టెన్స్ ఇన్ ట్యూన్డ్ సర్క్యూట్ అప్లికేషన్స్, కాయిల్ కాన్సెప్ట్ ఆఫ్ రీయాక్టెన్స్, పవర్ ఫ్యాక్టర్, ఇండక్టెన్స్ అండ్ కో ఎఫిషియెంట్ ఆఫ్ కప్లింగ్, సిరీస్, పారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్, వివిధ రకాల కెపాసిటర్లు వాటి అనువర్తనాలు, బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ రెజోనెన్స్ సర్క్యూట్, పారలల్ ఎల్‌సీ సర్క్యూట్, యాంటీ రెజోనెన్స్ సర్క్యూట్, పీఎన్‌పీ అండ్ ఎన్‌పీఎన్ ట్రాన్‌సిస్టర్స్ అండ్ డైనమిక్ కర్వ్స్, ఎఫ్‌ఈటీ ట్రాన్‌సిస్టర్స్, ఆఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫయర్ సర్క్యూట్, బ్రిడ్జ్ రెక్టిఫయర్స్, ఫిల్టర్ల ఉపయోగాలు, బ్యాండ్ విడ్త్, డిటెక్టర్స్, ఆంఫ్లిఫికేషన్స్, పుష్‌ఫుల్ వోల్టేజ్ ఆంఫ్లిఫయర్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

కంప్యూటర్స్ బేసిక్స్‌కు సంబంధించి ఎంఎస్ ఆఫీస్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, మదర్ బోర్డ్, ఇతర ఉపకరణాలు, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, నెట్‌వర్కింగ్ అండ్ లాన్ తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
 
 టెలిఫోన్ సిస్టమ్‌కు సంబంధించి బేసిక్స్ ఆఫ్ పీఎస్‌టీఎన్ టెలిఫోన్ నెట్‌వర్క్, టెలిఫోన్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఈపీఏబీఎక్స్, ఎఫ్‌ఏఎక్స్, ఇంటర్నెట్ టెలిఫోనీ, జీఎస్‌ఎం, సీడీఎంఏ ఫోన్ సిస్టమ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 
 దరఖాస్తు విధానం
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా నిర్ణీత ఫీజు రూ.300 (ఎస్సీ/ఎస్టీలకు రూ.150) ఏపీ ఆన్‌లైన్ (లేదా) మీ సేవా కేంద్రాల్లో (లేదా) టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల్లో చెల్లించి పేమెంట్ రసీదు పొందాలి. దాని ఆధారంగా రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి వెబ్‌సైట్: (http://recruitment.appolice.gov.in)
 
 ముఖ్య తేదీలు
 ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2016, సెప్టెంబర్ 7- 2016, అక్టోబర్ 1 వరకు.
  ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్  టెస్ట్:  2016 అక్టోబర్ మొదటి వారంలో
  రాత పరీక్ష: నవంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement