
జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లేదు : తమ్మినేని
గాంధారి: జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌ల విభజన శాస్త్రీయంగా జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఫలితంగా అన్ని జిల్లాలలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొ న్నారు. ‘సామాజిక న్యాయం -తెలంగాణ సమగ్రాభివృద్ధి’పేరుతో తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర సోమవారం 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కామారెడ్డి జిల్లా గాంధారిలో కేక్ కట్ చేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ-హబ్‌ల వల్ల కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరుతోందన్నారు. వీటి వల్ల సామా న్యులకు ప్రయోజనం లేద న్నారు.
రూ.లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. వాటిని విడతల వారీగా మాఫీ చేస్తున్నారని, దీంతో ఆ డబ్బు వడ్డీలకే సరిపోతోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 700 కోట్లు విడుదలైనా.. రైతులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు. పాఠశాలల్లో 13వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రూ. 350 కోట్లు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులున్నాయని, వ్యవస్థ ఇలా ఉంటే ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ప్రజ ల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు. ఉపా ధ్యాయ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు.