ఇలా చేశారంటే ఇక మీ కెరీర్ రాకెట్‌ స్పీడే.. దూసుకుపోతుందంతే..! | Harikrishnan Nair Suggestions Students To Improve Career Skills | Sakshi
Sakshi News home page

Career Skills: ఇలా చేశారంటే ఇక మీ కెరీర్ రాకెట్‌ స్పీడే.. దూసుకుపోతుందంతే..!

Published Sun, Feb 19 2023 12:01 PM | Last Updated on Sun, Feb 19 2023 1:22 PM

Harikrishnan Nair Suggestions Students To Improve Career Skills - Sakshi

ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఒక లెక్క ఉంటుంది..  4 సంవత్సరాల ప్రిపరేషన్, పరీక్షల తర్వాత, వారు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి  కెరీర్‌ను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతారు. జాబ్‌ మార్కెట్‌ను ఛేదించే సామర్థ్యం తమకు ఉందని నమ్ముతారు. కానీ ప్రస్తుత వాతావరణంలో ’ఫ్రెషర్‌’  లేబుల్‌  చాలా మంది  గ్రాడ్యుయేట్‌లకు అడ్డంకి మారుతోంది.

ఫ్రెషర్స్‌ వర్సెస్‌ ఎక్స్‌పీరియన్స్‌
సాధారణంగా సంస్థల యాజమాన్యాలు అప్పటికే నిరూపితమైన ట్రాక్‌ రికార్డ్‌లు కలిగిన సిబ్బందిని కోరుకుంటాయి. ఎందుకంటే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఫ్రెషర్‌ల వల్ల అయ్యే  తక్కువ నియామక ఖర్చుల కన్నా ఎక్కువ ఉంటాయి. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్‌లు తరగతి గదిలో సంస్థాగత గత విధులు నేర్చుకోలేరు. అది  అనుభవం నుంచి మాత్రమే వస్తుంది.

అందుకే గ్రాడ్యుయేట్‌లు కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మొదటి ఉద్యోగాలను పొందడం కష్టంగా భావించడంలో ఆశ్చర్యం లేదు. గ్లోబల్‌ అస్థిరత  అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో పోస్ట్‌–పాండమిక్‌ జాబ్‌ మార్కెట్‌ లో కష్టతరమైన పరిస్థితులను ఫ్రెషర్లు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు తమ ఆఫర్‌ లెటర్‌లను రద్దు చేస్తున్నాయి లేదా కొత్త, మరింత కఠినమైన నియామక పద్ధతుల నేపథ్యంలో తమ రిక్రూట్‌మెంట్‌ను ఆలస్యం చేస్తున్నాయి, దీనివల్ల వీరు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు.

నైపుణ్యమే.. విజయం..
ఫ్రెషర్లు కెరీర్‌ వేటలో ఉన్నప్పుడే మరింత ఎక్కువ నైపుణ్యత సాధించి, పోటీని దూరం చేయవచ్చు, ఆకర్షణీయమైన సామర్ధ్యాల పోర్ట్‌ఫోలియోను రూపొందించడం ద్వారా అడ్డంకులను దాటవేయవచ్చు. గ్రేట్‌ లెర్నింగ్‌ అనే సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. కెరీర్‌ ప్రారంభంలో నైపుణ్యం పెంచుకోవడంలో వ్యయ ప్రయాసలను పెట్టుబడి పెట్టే వారు తోటివారి కంటే రెండింతలు ఎక్కువ సంపాదిస్తారు. ఎక్కువ ఇంక్రిమెంట్‌లను పొందుతారు. మిగతా వారి కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్య్రం పొందుతారు. ఆధునిక జాబ్‌ మార్కెట్‌ నైపుణ్యం రీస్కిల్లింగ్‌ను చాలా ముఖ్యంగా పరిగణిస్తుంది.

ఎంపిక జాగ్రత్త..
వ్యక్తిగత సామర్ధ్యాల గురించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత దేనిని ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం  ఫైనాన్స్‌  టెక్నాలజీ  పరిశ్రమలు అధిక జీతాలను అందించేవిగా పరిగణించబడుతున్నాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో, ముఖ్యంగా డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్‌  టెక్నాలజీ హాటెస్ట్‌ సెక్టార్‌లలో ఒకటిగా ఉద్భవించింది.

గత 2022లో, డేటా సైన్స్‌లో నైపుణ్యాలను పెంపొందించడం వల్ల 2040 నాటికి వారి జీతం 57.9 ఎల్‌పిఎకి.. నైపుణ్యం లేని వారి తోటివారి కంటే 3 రెట్లకు చేరుకునే అవకాశం ఉందని గ్రేట్‌ లెర్నింగ్‌ అధ్యయనం వెల్లడించింది. అదేవిధంగా, 2022లో నైపుణ్యం పెంచుకునే మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌ 10 సంవత్సరాల వ్యవధిలో వారి తోటివారి కంటే 100 శాతం ఎక్కువ సంపాదిస్తారు. అలాగే ఆధునిక–యుగపు నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిపుణుడు  తోటివారి కంటే 4రెట్ల వరకు సంపాదించగలరు. నైపుణ్యం లేని ఒక ప్రొఫెషనల్‌ వారి పదవీ విరమణ కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు కోసం 60 సంవత్సరాల ఆగాల్సి వస్తే... నైపుణ్యం కలిగిన నిపుణులు 50 సంవత్సరాల వయస్సులోపే వారి పదవీ విరమణ నిధిని కూడబెట్టుకుంటారు.

పేపర్‌ పులి కావద్దు...
కేవలం కాగితంపై స్కిల్స్‌ థృవీకరణ పొందడం కంటే వాస్తవిక సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సమయం, డబ్బుపై సాధ్యమైనంత ఎక్కువ రాబడిని సాధించడానికి,  పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అందించే ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం చాలా అవసరం.  ఈ ప్రయాణంలో  ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఇది  సహాయపడుతుంది. నియామక కంపెనీలతో అనేక అప్‌స్కిల్లింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు  కనెక్షన్‌లను కలిగి ఉన్నాయి.

నెట్‌వర్క్‌ పెంచుకోండి..
సామాజిక  వృత్తిపరమైన పరిచయాలను పెంచుకోవడం అవసరం. ఇది అప్‌స్కిల్లింగ్‌లో తరచుగా చాలా మంది పట్టించుకోని అంశం. పరిశ్రమ డొమైన్‌లో అభ్యర్థి తమ నైపుణ్యం  సెట్‌లను అప్‌డేట్‌ చేసిన తర్వాత, తదుపరి దశలో  తోటి అభ్యాసకుల ద్వారా పరిశ్రమతో కనెక్ట్‌ అవ్వడం అలాగే ఉపాధి–కేంద్రీకృత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లను తరచుగా పరిశీలించాలి. అలాగే  సృజనాత్మకతను,  వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడే సోషల్‌ నెట్‌వర్క్‌ను రూపొందించుకోవాలి.

ఒకే రకపు ఆలోచన కలిగిన నిపుణులతో పరస్పర చర్చలు చేయాలి. నైపుణ్యాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోకపోవచ్చు; వాటిని ప్రదర్శించాలి  ఎందుకు మీరు అర్హత పొందారో  చూపించాలి: అందుబాటులో ఉన్న టూల్స్‌ ను నేర్చుకోవడం ద్వారా వాటి ప్రయోజనాన్ని పొందాలి. గ్రూపులు ఫోరమ్‌లలో చేరాలి. అలాగే వివిధ ఈవెంట్‌లలో పాల్గొనాలి.  సుస్థిరమైన సభ్యుల గ్లోబల్‌ నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ కావాలి. పరిశ్రమకు సంబంధించిన ప్రోగ్రామ్‌లు, హ్యాకథాన్‌లు సమ్మిట్‌ల వంటి లైవ్‌ ప్రాజెక్ట్‌లలో పాల్గొనడం ద్వారా నెట్‌వర్కింగ్‌ను బలోపేతం చేసుకోవాలి.

పోర్ట్‌ఫోలియో... ఓ గుర్తింపు.
పోర్ట్‌ఫోలియో అనేది మీ గుర్తింపు,  మీరు వ్యక్తిగతంగా కాబోయే యజమానిని కలిసే ముందు అది మీ గురించి చెబుతుంది. అలాగే, ఆధునిక, సమకాలీనమైన మీ ప్రతిభ సామర్థ్యాలపై అంతర్గత వీక్షణను అందించగల  నిర్దిష్ట డాక్యుమెంటు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ అనుభవాలను వివరించాలి. మీ విజయాలను ప్రదర్శించడానికి వెనుకాడకండి. ప్రాజెక్ట్‌లలో మీరు చూపించిన డైరెక్ట్‌ రిజల్టులను హైలైట్‌ చేయండి, పురోగతి  భావాన్ని, విజయం సాధించాలనే ఆరాటాన్ని ప్రదర్శించండి. మీరు ఎంచుకున్న నైపుణ్యాలతో సివిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి.


హరికృష్ణన్‌ నాయర్, కో ఫౌండర్, గ్రేట్‌ లెర్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement