
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఇప్పుడు ఇద్దరు గ్రాడ్యువేట్లు ఉన్నారు కాబట్టి. రీసెంట్‌గా అరవింద్ స్వామి తనయుడు గ్రాడ్యువేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అధీరా కూడా గ్రాడ్యువేట్ అయ్యారు. గ్రాడ్యువేషన్ కూడా గోల్డ్ మెడల్ అందుకుని మరీ కంప్లీట్ చేశారు. ఈ ఆనందాన్ని అరవింద్ స్వామి పంచుకుంటూ – ‘‘ఇంట్లో మరో గ్రాడ్యువేట్ యాడ్ అయ్యారు. అధీరా.. నీ అచీవ్‌మెంట్స్, నీ జర్నీని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇక ప్రపంచమే నీ వంటిల్లు. వెళ్లు.. నీ ఇష్టమొచ్చింది వండేసేయ్’’ అని పేర్కొన్నారు.