బీజింగ్: ఇప్పుడు చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్న విద్యార్థులు శవాల్లా పోజులిస్తూ ఫొటోలు తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని అక్కడి సోషల్‌మీడియాలో చనిపోయే ఉన్నాం అని ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేస్తున్నారు. అసలు విద్యార్థులు ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇదేమైనా ప్రాంక్ అనుకుంటే మీ పొరపాటే. అక్కడి విద్యార్థులు తమ నిరసనను ఈ రకంగా తెలుపుతున్నారు. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే..
ప్రస్తుతం డ్రాగన్ కంట్రీలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఎంతో కష్టపడి డిగ్రీలు చేసినా.. తమకు ఉపాధి లభించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము బతికినా చచ్చినా ఒకటేననే భావంతో ఈ రకంగా నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఈ ఫొటోలు చైనీస్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శవాలుగా చైనీస్ విద్యార్థులు
ఒక దశాబ్దం క్రితం వరకు ఉపాధి, అభివృద్ధి వైపు దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇటీవల మాత్రం అంతర్జాతీయ వ్యవహారాలు, భద్రతపై దృష్టి పెడుతుండటంతో దేశ వృద్ధి రేటు మందగించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగాలలో 80 శాతం ప్రైవేట్ రంగం వాటాను కలిగి ఉంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ప్రైవేట్ రంగంపై చైనా తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రస్తుతం విద్యా రంగానికి భారీ నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సంస్థలు మూసివేయడమో లేదా తమ వాటాను తగ్గించుకునే పనిలో పడ్డాయి.
చైనాలో, రికార్డు స్థాయిలో 11.6 మిలియన్ల తాజాగా వారి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకుని ఉద్యోగాల వేట ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా గత మేలో, పట్టణ చైనాలో నిరుద్యోగం రేటు 20.8 శాతానికి చేరుకుంది. ఓ వైపు పరిస్థితులు ఇలా ఉండగా.. కొత్తగా ఉద్యోగార్ధుల ప్రవాహం మరింత పెరుగుతుండడం..ఆ దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
పనికి రాని డిగ్రీ పట్టాలు..
ప్రతి సంవత్సరం లక్షల్లో విద్యార్థులు డిగ్రీ పట్టా పట్టుకుని జాబ్ మార్కెట్లోకి ప్రవేశించడంతో.. ఆ డిగ్రీలకు విలువ లేకుండా పోయిందని చైనా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల చైనాలో ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్, పీహెచ్‌డీ అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ తమ చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ లేదని అక్కడి విద్యార్థులు వాపోతున్నారు.
చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం..
Comments
Please login to add a commentAdd a comment