Corpse
-
హెజ్బొల్లా చీఫ్ ఎలా చనిపోయాడు..?
బీరుట్:ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతదేహం లభ్యమైంది.దక్షిణ బీరుట్ నుంచి తమ నేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్బొల్లా ఆదివారం(సెప్టెంబర్29) వెల్లడించింది.అయితే నస్రల్లా మృతదేహంపై ఎలాంటి ప్రత్యక్ష గాయాలు లేవని సమాచారం.బాంబు దాడి కారణంగా షాక్‌కు గురై నస్రల్లా మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి.కాగా,తాము లెబనాన్‌పై ఆదివారం తాజా దాడుల్లో హెజ్బొల్లా మరో కీలక నేత నబిల్కౌక్కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.ఇదీచదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
అసలేం జరుగుతోంది.. డిగ్రీ పట్టా అందుకొని ‘శవాలు’గా విద్యార్ధులు!
బీజింగ్: ఇప్పుడు చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్న విద్యార్థులు శవాల్లా పోజులిస్తూ ఫొటోలు తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని అక్కడి సోషల్‌మీడియాలో చనిపోయే ఉన్నాం అని ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేస్తున్నారు. అసలు విద్యార్థులు ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఇదేమైనా ప్రాంక్ అనుకుంటే మీ పొరపాటే. అక్కడి విద్యార్థులు తమ నిరసనను ఈ రకంగా తెలుపుతున్నారు. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే.. ప్రస్తుతం డ్రాగన్ కంట్రీలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఎంతో కష్టపడి డిగ్రీలు చేసినా.. తమకు ఉపాధి లభించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము బతికినా చచ్చినా ఒకటేననే భావంతో ఈ రకంగా నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఈ ఫొటోలు చైనీస్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శవాలుగా చైనీస్ విద్యార్థులు ఒక దశాబ్దం క్రితం వరకు ఉపాధి, అభివృద్ధి వైపు దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇటీవల మాత్రం అంతర్జాతీయ వ్యవహారాలు, భద్రతపై దృష్టి పెడుతుండటంతో దేశ వృద్ధి రేటు మందగించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యోగాలలో 80 శాతం ప్రైవేట్ రంగం వాటాను కలిగి ఉంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ప్రైవేట్ రంగంపై చైనా తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రస్తుతం విద్యా రంగానికి భారీ నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సంస్థలు మూసివేయడమో లేదా తమ వాటాను తగ్గించుకునే పనిలో పడ్డాయి. చైనాలో, రికార్డు స్థాయిలో 11.6 మిలియన్ల తాజాగా వారి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకుని ఉద్యోగాల వేట ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా గత మేలో, పట్టణ చైనాలో నిరుద్యోగం రేటు 20.8 శాతానికి చేరుకుంది. ఓ వైపు పరిస్థితులు ఇలా ఉండగా.. కొత్తగా ఉద్యోగార్ధుల ప్రవాహం మరింత పెరుగుతుండడం..ఆ దేశంలో నిరుద్యోగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పనికి రాని డిగ్రీ పట్టాలు.. ప్రతి సంవత్సరం లక్షల్లో విద్యార్థులు డిగ్రీ పట్టా పట్టుకుని జాబ్ మార్కెట్లోకి ప్రవేశించడంతో.. ఆ డిగ్రీలకు విలువ లేకుండా పోయిందని చైనా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల చైనాలో ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు మాస్టర్స్, పీహెచ్డీ అభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ తమ చదువుకి తగ్గ ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ లేదని అక్కడి విద్యార్థులు వాపోతున్నారు. చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం.. -
నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం..
సాక్షి, అమరావతి: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తమ పార్టీని బతికించుకునేందుకు టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై చంద్రబాబు, లోకేష్ నిసిగ్గుగా శవరాజకీయాలకు తెరలేపారు. ఆ యువకుడి మృతికి వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. అసలేం జరిగింది? తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యాం.. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ప్రాణం. వయస్సు 23 సంవత్సరాలు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. ఇటీవల చింతలూరు గ్రామానికి వెళ్లిన శ్యామ్ అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. తన అభిమాని శ్యాం మరణించినందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెర లేచిన శవరాజకీయం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టిడిపి కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి YSRCPకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా శ్యామ్ చనిపోయాడని తెలియగానే.. తెలుగుదేశం రంగంలోకి దిగింది. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. చంద్రబాబు నిర్వాకం ఇది శ్యాం మరణం వార్త తెలియగానే, చంద్రబాబు దానికి రాజకీయ రంగు పులిమేశారు. ఇది వైఎస్సార్ సిపి పనేనంటూ నిందలు మోపారు. Deeply saddened by the tragic and untimely demise of Shyam in Chintaluru, EG District. The suspicious circumstances surrounding his death are alarming. I strongly urge for a thorough investigation into this matter, ensuring justice is served. It has been alleged that YSRCP… pic.twitter.com/55bpR9cgvR — N Chandrababu Naidu (@ncbn) June 27, 2023 తానా.. తందానా.. తనయుడి కూత ఇది తండ్రి చంద్రబాబు బాటలోనే లోకేష్ నడిచారు. వెంటనే ఓ ట్వీటేశాడు. తన ఆస్థాన విద్వాంసులు రాసిచ్చిన నాలుగు వ్యాఖ్యలను జోడించారు. Pained to learn about the suspicious death of unemployed youngster Shyam. Deepest condolences to his family & friends. A thorough investigation without any bias is needed, even if it involves YCP leaders as alleged by locals. We will fight until justice is delivered to Shyam… pic.twitter.com/C8OvdExVWD — Lokesh Nara (@naralokesh) June 27, 2023 తెలుగుదేశం శవరాజకీయం శ్యాం మృతిపై తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమకు శ్యాం పంపించిన వీడియోలను పోలీసులకు అందించారు. శ్యాం ఆత్మహత్య చేసుకునేముందు ఏం జరిగిందన్నది ఈ వీడియోల్లో స్పష్టంగా ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం తండ్రీ కొడుకులు రాజకీయాలు చేయడంతో వైఎస్సార్సీపీ స్పందించింది. ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారు. రాష్ట్ర ప్రజలు గమనించాలంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. YSRCP ఏం చెప్పింది? సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో! శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻 శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా… pic.twitter.com/DANeXVEgCm — YSR Congress Party (@YSRCParty) June 27, 2023 ఎన్టీఆర్ అభిమాని మృతిని టీడీపీ అవకాశంగా తీసుకుని నీచ రాజకీయాలు చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని మరణం పట్ల గౌరవంగా, పద్ధతిగా సానుభూతి తెలిపారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసు మనసు కలచివేస్తోందని, ప్రభుత్వం దీనిపై తక్షణమే దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అంతా మిస్టరీగా ఉంది.. కుళ్లిన శవాల మధ్య సజీవంగా నవజాత శిశువు!
నాలుగు రోజులు వయసున్న ఓ నవజాత శిశువు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాల మధ్య సజీవంగా ఉంది. తల్లి పాలు లేకపోయినా మూడు రోజులపాటు శిశువు ఆరోగ్యంగా ఉంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్ జిల్లా సహరాన్ పుర్ కు చెందిన కాసిఫ్ , ఆనమ్ దంపతులు టర్నర్ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆనమ్ జూన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి.. అదేరోజు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది. మూడు రోజులుగా ఆ ఇంట్లోనే గత మూడు రోజులుగా ఆ దంపతులు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి నాలుగు రోజుల వయసున్న చిన్నారి కూడా సజీవంగా కనిపించింది. తక్షణమే చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాసిఫ్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా కాషిఫ్‌కు ఇది రెండో పెళ్లి వివాహమని స్థానికులు చెబుతున్నారు. మృతుడి మొదటి భార్య నుస్రత్ అందించిన అదనపు సమాచారం ప్రకారం, గత రెండు మూడు రోజులుగా కాసిఫ్‌తో సంప్రదించడానికి ఆమె ప్రయత్నించిన అది కుదరలేదని తెలిపింది. జూన్ 10వ తేదీ రాత్రి 11 గంటలకు చివరిసారిగా కాసిఫ్‌తో మాట్లాడినట్లు నుస్రత్ పోలీసులకు చెప్పింది. గతంలో ఒకరి వద్ద తీసుకున్న రూ. 5 లక్షల అప్పు గురించి కాసిఫ్ తనతో చెప్పాడని నుస్రత్ చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: మణిపూర్‌లో మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు -
హృదయ విదారక దృశ్యం: నడుము లోతు నీళ్లలోనే అంతిమ వీడ్కోలు!
బెంగళూరు: కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని కోడ్లు గ్రామం వర్షాం వస్తే చాలు జలమయం అయిపోతుంది. ఐతే ఆ సమయంలో ఆ గ్రామంలోని కుటుంబాల్లో ఏ వ్యక్తి అయిన చనిపోతే వారిని శ్మశానానికి తీసుకువెళ్లడం గ్రామస్తులకు ఒక సవాలుగా ఉంది. పైగా అక్కడ నివాసితులు వర్షకాలం అంటేనే చాలా భయపడతారు. శ్మశాన వాటిక రహదారులన్ని ఈ వర్షాకాలం ముంపునకు గురై శవాలను తరలించడం అత్యంత కష్టంగా ఉంటుంది ఈ మేరకు ఆ కోడ్లు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే నడుమ లోతు నీళ్లో శవాన్ని తీసుకువెళ్తున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వర్షాకాలం వస్తేనే చాలు ఈ గ్రామంలోని రోడ్డన్నీ నీళ్లతో నిండిపోతాయని, పరిష్కారం కోసం ఎన్నో నెలలుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సహాయం అందించడంలేదని వాపోయారు. పైగా ఇది రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గ్రామం. (చదవండి: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ అందజేసిన ప్రకాశ్ రాజ్) -
తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో కప్పేశాడు!
సాక్షి, చెన్నై: తల్లి మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో ఓ కుమారుడు కప్పేశాడు. పైగా దాన్ని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ కుమారుడి మానసిక స్థితి ఈ దుశ్చర్యకు కారణంగా విచారణలో తేలింది. చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం దంపతులకు ప్రభు, మురుగన్, సురేష్ అనే కుమారులు ఉన్నారు. గోపాల్ గతంలోనే మరణించాడు. ప్రభు, మురుగన్ చెన్నైలో వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబాలతో నివాసం ఉన్నారు. ఇంట్లో చిన్న కుమారుడు సురేష్(50), తల్లి షెన్బగం (86) మాత్రమే ఉన్నారు. ఇక మానసిక చచలత్వంతో వ్యవహరిస్తుండడంతో నెల రోజుల క్రితం సురేష్‌ను వదిలి పెట్టి భార్య పిల్లలు వెళ్లిపోయారు. అప్పటి నుంచి తల్లితో పాటుగా సురేష్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం తల్లిని చూసేందుకు పెద్ద కుమారుడు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లనివ్వక పోవడంతో అనుమానం తల్లి ఇంట్లో లేదని చెప్పడమే కాకుండా,ఇంట్లోకి సురేష్ తనను అనుమతించక పోవడంతో ప్రభు నీలాంకరై పోలీసుల్ని ఆశ్రయించాడు. వారు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా, ఆ డ్రమ్‌లో తల్లి మృతదేహం ఉన్నట్టు సురేష్ చెప్పడంతో విస్మయానికి గురయ్యారు. ఆ డ్రమ్‌ను పగల కొట్టి చూడగా అందులో షెన్భగం మృతదేహం బయట పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి అనారోగ్యంతో మరణించి, అంత్యక్రియలు చేయలేని పరిస్థితుల్లో సురేష్ ఈ చర్యకు పాల్పడ్డాడా లేదా ప్రాణాలతోనే డ్రమ్‌లో కప్పేశాడా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. చదవండి: స్టేట్ లెవెల్ బాక్సింగ్ ప్లేయర్, పోలీసు ఉద్యోగం.. కానీ ఏం జరిగిందో ఏమో.. -
విజయవాడ: కారులో డెడ్ బాడీ కలకలం
సాక్షి, విజయవాడ: పటమటలంక డీ మార్ట్ వీఎంసీ స్కూల్ వద్ద కారులో మృతదేహం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. పార్కింగ్ చేసిన ఏపీ 37 బీఏ 5456 నెంబరు గల ఇండికా కారులో గర్తుతెలియని మృతదేహం బయటపడింది. మంగళవారం కారులోని మృతదేహం నుంచి కుళ్ళిపోయి దుర్వాసన వచ్చింది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని ప్రారంభించారు. దాదాపు 3 రోజులుగా కారు అక్కడే ఉందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
అమానుషం: ఎవరిదీ పాపం.. మరుగుదొడ్డి వద్ద శిశువు మృతదేహం
తిరువళ్లూరు(చెన్నై): ఓ ప్రైవేటు వైద్యశాల ఆవరణలో ఆడశిశువు మృతదేహం మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. చోళవరం అత్తిపట్టులో ఎంఎంఆర్వీ వైద్యశాల ఉంది. ఇక్కడ సాధారణ, అత్యవసర సేవలకు చిక్సిత అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వైద్యశాల ఆవరణలోని ఓ మరుగుదొడ్డి వద్ద ఆడశిశువు మృతదేహం ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది చోళవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిశువును పరిశీలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్టు గుర్తించి చెన్నై వైద్యశాలకు తరలించారు. కాగా నవజాత శిశువును మరుగుదొడ్డికి సమీపంలో పడేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మరో ఘటనలో.. కూలిన విద్యుత్ స్తంభం తిరుత్తణి: తిరుత్తణి శివారులోని కాశినాధ పురం దళితవాడలో హై ఓల్టేజీ విద్యుత్ స్తంభంపై పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు పడి విద్యుత్‌స్తంభం కూలింది. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఘటనతో ఇళ్ల ముందు ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ స్తంభం కూలిన సమయంలో వీధిలో ప్రజలు లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. అనంతరం కూలిన విద్యుత్ స్తంభం తొలగించి కొత్తది ఏర్పాటు చేశారు. కాగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు దుస్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు. చదవండి: తల్లీ,బిడ్డల హత్య కేసు.. మాజీ ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష -
హృదయ విదారకం: చెత్తకుప్పలో చిన్నారి మృతదేహం
తల్లి గర్భం నుంచి బయట పడి ప్రపంచాన్ని చూసిందో లేదో.. చెత్తకుప్పకు చేరి విగత జీవిగా మారిందో పసికందు. అప్పుడే పుట్టిన పాపాయికి.. అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మరి ఏ పాపం తెలియని ఆ పసికూనకు అంత పెద్ద శిక్ష ఎవరు విధించారో.. ఈ లోకాన్ని చూడక ముందే కన్నుమూసింది. సాక్షి, హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లోని రాంబాగ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పడే పట్టిన ఓ పసికందు మృతదేహం చెత్త కుప్పలో దర్శనమిచ్చింది. మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగించేందుకు రాగా చెత్తకుప్పల పక్కనే ఉన్న మూటలో చిన్నారి మృతదేహం ఉండడాన్ని గమనించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారిని మృతదేహాన్ని ఎవరు పడేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శిశువుని చంపి మూటలో కట్టి చెత్త కుప్పలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: Extra Marital Affair: వాటర్‌మెన్‌తో పరిచయం, భర్తతో కలిసి ఉండలేక.. -
రాచాపూర్‌లో ఉద్రిక్తత.. మహిళ మృతదేహాన్ని ఇంటిపక్కనే పూడ్చి..
సాక్షి,లక్ష్మణచాంద(అదిలాబాద్): మండలంలోని రాచాపూర్ గ్రామంలో ఓ వర్గానికి (క్రిస్టియన్) చెందిన ఫాదర్ భార్య అనారోగ్యంతో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఆదివారం ఉదయం మండలంలోని రాచాపూర్‌లోని ఆమె నివాసానికి తీసుకొచ్చి ఇంటిపక్కనే పూడ్చారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కులమత బేదాలు లేకుండా గ్రామంలో ఎవరు చనిపోయిన వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఆమె మృతదేహాన్ని ఇంటి పక్కనే పూడ్చడం సరికాదని రోడ్డుపై బైఠాయించారు. మృతదేహాన్ని ఇక్కడ నుంచి తొలగించి వైకుంఠ«ధామానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్యన ఘర్షణ.. రాచాపూర్‌లోని మహిళ ఇంటి వద్ద రోడ్డుపై ఓ వర్గానికి చెందిన (క్రిస్టియన్) వారికి రాచాపూర్ గ్రామస్తుల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో విషయం తెలుసుకున్న సోన్ సీఐ రాంనరసింహారెడ్డి, లక్ష్మణచాంద, సోన్, మామడ ఎస్సైలు, సిబ్బందితో వచ్చి సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇంటి పక్కనే పూడ్చిన మృతదేహాన్ని తొలగించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని గ్రామస్తులు ఆందోళన తీవ్రతరం చేశారు. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. మృతదేహం తొలగింపుతో... చివరకు సీఐ రాంనరసింహారెడ్డి ఇరువర్గాల వారితో విడివిడిగా మాట్లాడారు. చివరకు సీఐ సూచనల మేరకు మృతదేహాన్ని బయటకు తీసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి తరలించారు. దీంతో ఆందోళన సర్దుమణిగింది. -
కేసు విషయమై పంచాయతీ పెట్టిన రెండు పోలీస్ స్టేషన్లు
తిరువళ్లూరు(చెన్నై): రెండు పోలీస్ స్టేషన్ల మధ్య సరిహద్దు సమస్య కొలిక్కి రాకపోవడంతో ఓ మృతదేహం వెలికితీత ఆలస్యమైంది. వివరాలు.. మనవాల నగర్ సమీపంలోని నదిలో సుమారు 42 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం తేలుతున్నట్లు స్థానికులు మనవాల్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన మనవాల్‌నగర్ పోలీసులు మృతదేహం తేలుతున్న ప్రాంతం తమ పరిధిలోకి రాదని చెప్పి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు తిరువళ్లూర్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ పద్మశ్రీ నేతృత్వంలోని పోలీసులు మృతదేహం పడి ఉన్న ప్రాంతం మనవాల్‌నగర్ పరిధిలోకి వస్తుందంటూ వెళ్లిపోయారు. తీరా.. తిరువళ్లూర్ టౌన్ మనవల్నగర్ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే విషయంలో పట్టింపులకు పోవడంతో మృతదేహం నదిలోనే ఉండిపోయింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మృతదేహం పడి ఉన్న ప్రాంతం తిరువళ్లూర్ టౌన్ పోలీసులకు వస్తుందంటూ రెవెన్యూ అధికారులు నిర్ధారించి వారి ఆధ్వర్యంలో వెలికి తీశారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. కాగా రెండు పోలీస్ స్టేషన్లు పట్టింపు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
3 నెలలుగా తండ్రి శవంతోనే జీవనం .. కారణం తెలిసి కంగుతిన్న పోలీసులు
కోల్‌కతా: చనిపోయిన వారి మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకుని.. వాటితో కలిసి జీవించే దృశ్యాలను ఎక్కువంగా సినిమాలో చూసుంటాం. కానీ ఇటువంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరణించిన తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు నెలలుగా దానితో కలిసి జీవిస్తున్నాడు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కేపీరాయ్ లేన్‌లో సంగ్రామ్ డే (70) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో మాజీ ఉద్యోగి. గత కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు సంగ్రామాన్ని చూడలేదు. అతని కొడుకు కౌశిక్ డే కూడా చుట్టు పక్కల వారితో పెద్దగా మాట్లాడడు కాబట్టి వారికి మొదట్లో అనుమానం రాలేదు. అయితే ఇటీవల కౌశిక్ ప్రవర్తన కాస్త వింతగ ఉండడం, అతని తండ్రి కనపడకపోవడంతో స్థానికులు గార్ఫా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి వెళ్లగా కౌశిక్ తలుపులు కూడా బలవంతంగా తెరిచాడు. ఇంటిలోకి వెళ్లి చూడగా, కుళ్లిపోయిన స్థితిలో మంచంపై పడి ఉన్న సంగ్రామ్ మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అతని భార్య అరుణా డే పక్షవాతం కారణంగా మంచాన పడింది. మూడు నెలల క్రితం తన తండ్రి చనిపోయాడని, అయితే సంగ్రామ్ మళ్లీ మేల్కొంటాడని భావించానని కౌశిక్ పోలీసులకు చెప్పాడు. కౌశిక్ సమాధానాలు విన్న పోలీసులు అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందిని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. చదవండి: ‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’ -
తాలిబన్ల వికృత చర్య.. ఈ సారి ఒళ్లు గగుర్పొడిచేలా..
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మునుపటిలానే వారి కిరాతక చర్యలను కొనసాగిస్తున్నారు. హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో క్రేన్‌కు ఒక మృతదేహాన్ని వేలాడదీసి బహిరంగంగా ప్రదర్శించారు. అయితే అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మొదట.. తమ పాలన గతంలో మాదిరి ఉండదని, మారిపోయానట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల గతంలోని పాలన మాదిరిగా షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని, చేతులు నరకడంతోపాటు బహిరంగంగా ఉరి తీస్తామని తాలిబన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి తెలిపాడు. హెరాత్ ప్రాంతంలో ఫార్మసీ నడుపుతున్న ఓ వ్యక్తి మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం.. తాలబన్లు నాలుగు మృతదేహాలను ప్రధాన కూడలికి తీసుకువచ్చి ఒక మృతదేహాన్ని వేలాడిదీసారని, మిగిలిన మూడు మృతదేహాలను మరో కూడళ్లలో వద్ద ఈరకంగానే వేలాడ దీసేందుకు తీసుకెళ్లారని తెలిపాడు. అయితే ఆ నలుగురు కిడ్నాప్ యత్నించడంతో పోలీసుల చేతిలో హతమయ్యారని తాలిబాన్లు ఆ కూడలి వద్ద ప్రకటించారని చెప్పాడు. ఆగష్టు 15 న తాలిబాన్లు ఆప్గన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజలు చీకటి పాలన మళ్లీ మొదలుకానుందని భయభ్రాంతులకు గురవుతున్నారు. చదవండి: కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. -
శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్
సాక్షి, శ్రీకాళహస్తి: ఓ మృతదేహం పెద్ద ఉపద్రవమే తెచ్చింది. ఇద్దరు ఆలయ ఉద్యోగులపై వేటు పడేలా చేసింది. మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు కారణమైంది. ఆ మృతదేహం కథేమిటో తెలుసుకోవాలంటే.. ముక్కంటి ఆలయ అనుబంధ భరద్వాజ తీర్థంలోని భరద్వాజేశ్వరాలయ సమీపంలో సోమవారం రాత్రి అధికారుల అనుమతి లేకుండా 7 గంటల సమయంలో ఓ మృతదేహాన్ని ఖననం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం దిరశనమాల గ్రామానికి చెందిన అనిల్ (34) మృతదేహమది. స్థానికంగా ముక్కంటీశుని ఆలయం వద్ద ఓ కుంకుమ దుకాణంలో అతడు పనిచేసేవాడు. అనారోగ్యం బారినపడి చనిపోయాడు. ఓ వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి భరద్వాజ తీర్థంలో ఆలయం పక్కన ఖననం చేశారు. ఇక్కడ అవధూతగా ఉంటూ వచ్చిన కోట్లమ్మ శిష్యుడు అనిల్ అని, అందుకే ఆయన్ను ఇక్కడ ఖననం చేశామని ఖననం చేసిన వారు ప్రచారం చేశారు. అయితే మృతునికి భార్య, ఓ పాప కూడా ఉండడంతో అతడిని ఎలా అవధూతగా చెబుతారని కొందరు ప్రశ్నించినా సమాధానం కరువైంది. ఇది కాస్తా చర్చనీయాంశమై ఆలయ ఈఓ పెద్ది రాజు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. మృతదేహాన్ని ఖననం చేస్తున్నట్లు ఉద్యోగుల దృష్టికి వచ్చినా అడ్డుకోకపోవడంపై ఆగ్రహించారు. దీనికి బాధ్యులను చేస్తూ భద్రతాధికారిగా ఉన్న ఏఈఓ శ్రీనివాసరెడ్డిని, భరద్వాజేశ్వరాలయం అర్చకుడు అనిల్‌కుమార్ స్వామిని సస్పెండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాసులు, సెక్యూరిటీ గార్డు శేఖర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలకుగాను దేవదాయ కమిషనర్‌కు నివేదించారు. అలాగే, ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదలా ఉంచితే, సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భరద్వాజేశ్వరాలయ ప్రాంతంలోని సీసీ కెమెరాలు ఇప్పటివరకు పనిచేయకపోవడం..ఆ సమయంలోనే మృతదేహాన్ని ఖననం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
6 రోజుల నిరీక్షణ.. అంతయ్య మృతదేహం లభ్యం
సాక్షి, హైదరాబాద్: డ్రైనేజీ గుంతలో పడి మృతి చెందిన అంతయ్య మృతదేహం ఎట్టికేలకు లభ్యమైంది. గల్లంతైన మృతదేహం కోసం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 6 రోజుల తర్వాత అంతయ్య మృతదేహం బయటపడింది. కాగా గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు. 6 రోజుల నిరీక్షణ అనంతరం.. బెంగుళూరుకు చెందిన అజంతా సొల్యూషన్స్ టెక్నాలజీ వారి నూతన టెక్నాలజీ కెమెరా పరికరాలతో మొదటగా ట్రంక్ లైన్ లో గుర్తించగా కొద్దిసేపటికే పక్కనే ఉన్న మ్యాన్ హోల్ వద్దకి మృతదేహాం వచ్చి ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే మృతదేహాన్ని బయటకు తీసే పనిలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందితో బయటకు తీయిస్తున్నారు. అంతయ్య కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, మృతికి కారణమైన అధికారులని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఎల్బీ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో డ్రైనేజీ క్లీనింగ్ కోసం మ్యాన్ హోల్లో దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు ప్రాణాలు విడిచారు. మొదట ఆ ఊబిలో శివ అనే వ్యక్తి చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా గల్లంతయ్యాడు. శివ మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. అనంతయ్య మృతదేహాం కోసం ఆ రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా సోమవారం నాడు దొరికింది. -
కరోనా మృతదేహం, కనికరం లేకుండా బయటకు పడేశారు
సాక్షి, భువనేశ్వర్(జయపురం): కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ సిబ్బంది బయట పడేసిన సంఘటన స్థానిక పట్టణ సమీపంలోని డొంగాగుడ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఆ మృతదేహాన్ని చూసి, స్థానికులు భయపడుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పీపీఈ కిట్లతో మృతదేహాన్ని డెప్పిగుడ సమీపంలోని చంపాకుపిలి శ్మశానవాటికకు తరలించి, దహనపరిచారు. డొంగాగుడ దగ్గరి కెనాల్ వద్ద బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువకులు అంబులెన్స్ నుంచి ఓ శవాన్ని సిబ్బంది పారవేస్తుండగా చూసినట్లు సమాచారం. చదవండి: గొప్ప మనసు; పెళ్లి మండపం నుంచి రక్తదాన శిబిరానికి.. -
గుండెపోటుతో భర్త మృతి.. ఇలా రుణం తీర్చుకున్న భార్య
సాక్షి, శ్రీకాకుళం( రణస్థలం): భర్త చితికి భార్య నిప్పుపెట్టి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన కోష్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వరసాల సత్యనారాయణ (45) 15 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో కోలుకున్నారు. దీంతో కుటుంబీకులు ఇంటికి తీసుకొచ్చేశారు. అయితే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కరోనా భయంతో బంధువులు ముందుకురాలేదు. మృతుడికి కుమారులు లేరు. దీంతో భార్య పద్మ అన్నీతానై కొంతమంది సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. చదవండి: విషాదం: పిల్లల కళ్లెదుటే.. -
covid: డబ్బులు ఇస్తేనే నీ భర్త మృతదేహం..
మైసూరు: మైసూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బు చెల్లించలేదని చెబుతూ మృతదేహాన్ని ఇవ్వకుండా ఓ ఆస్పత్రి యాజమాన్యం కర్కశంగా వ్యవహరించింది. మైసూరు ఆలనహళ్లి నివాసి బసవరాజు కరోనా సోకి శ్రీరాంపుర వద్ద ఉన్న గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. అయితే మృతదేహాన్ని ఇచ్చేందుకు వైద్యులు నిరాకరించారు. తన తాళిని తాకట్టు పెట్టి మృతుడి భార్య రూ.90 వేలు చెల్లించింది. కానీ రూ.లక్షన్నర చెల్లిస్తేనే కానీ మృతదేహాన్ని ఇవ్వలేమని వైద్యులు తేల్చి చెప్పారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు ఆస్పత్రికి వచ్చి మాట్లాడారు. కరోనా కష్ట సమయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించడం సరికాదని, మృతదేహాన్ని ఇవ్వకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన ఆస్పత్రి సిబ్బంది ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించింది. చదవండి: క్షుద్రపూజలు: మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి.. -
గొంతునులిమి చంపి.. శవంతో శృంగారం
న్యూఢిల్లీ : ఓ వ్యక్తిని చంపి, అతడి శవంతో కామవాంఛ తీర్చుకున్నారు ఇద్దరు మానవ మృగాళ్లు. వారి మధ్య గొడవ చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, బీహార్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరై ఏరియాలో ఉంటున్నారు. వారికి అదే ప్రాంతంలో ఉంటున్న బాధితుడితో పరిచయం ఏర్పడింది. మంగళవారం రాత్రి వారు బాధితుడి ఇంట్లో మందు పార్టీ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో అతడితో వారికి గొడవ ఏర్పడింది. ఆగ్రహానికి గురైన వారు అతడ్ని గొంతునులిమి చంపేశారు. అనంతరం శవంతో తమ కామ వాంఛ తీర్చుకున్నారు. ఆ రాత్రి అక్కడినుంచి వెళ్లిపోయి శవాన్ని మాయం చేయటానికి బుధవారం ఉదయం మళ్లీ ఆ ఇంటి వద్దకు వచ్చారు. శవాన్ని తరలిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ మృతుడి సోదరి కంటపడ్డారు. ఆమె గట్టిగా అరవటంతో అక్కడినుంచి పరుగులు తీశారు. సోదరుడి దారుణ హత్యపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. గొడవ కారణంగానే అతడ్ని చంపేసినట్లు విచారణలో వారు అంగీకరించారు. -
చెప్పుకోండి చూద్దాం
ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్ స్టార్ట్ చేయ్’ అని డ్రైవర్నుఆదేశించాడు సీఐ. కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైరన్ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. జూన్ 05. 2017. సాయంత్రం.చిత్తూరు జిల్లా, భాకరాపేట సమీపం. దుస్సావాండ్లపల్లి శివారు చెరువు దగ్గర. అంతసేపూ కురిసిన వాన ఎవరో స్విచాఫ్ చేసినట్టు ఆగింది. గాలి మాత్రం హోరున వీస్తోంది.ఉండుండి ఉరుములు, మెరుపులు పోటీ పడుతున్నాయి. గాలి విసురుకి నేలను తాకుతూ పైకి లేస్తూ తంగేడు చెట్ల కొమ్మలు అవస్థపడుతున్నాయి.మళ్లీ వాన మొదలవుతుందేమో అని ఇంటికి త్వరగా వెళ్లేందుకు ఊరి మనిషి ఒకడు సైకిల్ తొక్కుతున్నాడు వేగంగా. గాలికి ఏదో ఎండుగడ్డి నలుసు కంట్లో పడింది. సైకిల్ తొక్కుకుంటూనే ఒక చేత్తో తీసేందుకు ప్రయత్నించాడు. కుదరలేదు. సైకిల్ ఆపి భుజంపై ఉన్న టవల్‌తో తుడుచుకున్నాడు. అప్పుడే అప్రయత్నంగా చెరువు వైపు చూశాడు. ఏదో కనిపించినట్టయ్యింది.మళ్లీ చూశాడు.వెంపలి చెట్టు పక్కన ఆకు పచ్చని గుడ్డ ఏదో గాలికి రెపరెలాడుతోంది. నిశితంగా చూశాడు. అది చీర. లోతుగా చూశాడు. గుండె ఝల్లుమంది. బురదలో నుంచి పైకి లేచిన రెండు కాళ్లు. నాలుగు అడుగులు వేసి చెరువు దగ్గరికి వెళ్లాడు. దుర్వాసన. అతనికి అర్థమైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పుడే మళ్లీ వర్షం మొదలైంది. సీఐ చెరువు దగ్గరకు వచ్చి చూశాడు. అప్పటికే బాగా ఉబ్బి, చివికిపోయిన మహిళ శవం. కొంత నీళ్లలో మరికొంత బురదలో కూరుకుపోయి ఉంది. ఊర్లో వాళ్లతో కలిసి శవాన్ని బయటికి తీయించాడు.చనిపోయిన మనిషి బాహ్య ఆనవాళ్లు తెలుస్తున్నాయి. కాని ముఖం గుర్తుపట్టలేకుంది. ఎన్ని రోజులయ్యిందో... శరీరం జీర్ణావస్థలో ఉంది.‘వాన తగ్గింది కదా.. క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో జాగ్రత్తగా వెదకండి’ సిబ్బందిని ఆదేశించాడు సీఐ.క్లూ కోసం వెదుకుతున్నారు కానిస్టేబుళ్లు. చెరువు గట్టు కింద ఒక చెప్పు దొరికింది. సిబ్బంది ఆ చెప్పును సీఐకి చూపించారు. అది ఆమెదే అయ్యుంటందనే నిర్థారణకు వచ్చాడు సీఐ. శవాన్ని పోస్టుమార్టంకి పంపాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు.ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. వర్షం భారీగా పడుతుందనే సూచనను ఇస్తోంది ఆకాశం. ‘జీప్ స్టార్ట్ చేయ్’ అని డ్రైవర్‌ను ఆదేశించాడు సీఐ.కానిస్టేబుళ్లు ఆయన్ను అనుసరించారు. దుస్సావాండ్లపల్లికి సైర న్ మోగించుకుంటూ వెళ్తోంది జీపు. 20 నిమిషాల తరువాత ఆ గ్రామానికి చేరుకున్నారు. సైరన్ సౌండ్‌కు ఇళ్లలోని జనం ఆందోళనగా బయటికొచ్చారు.‘ఊరి చివర చెరువులో ఓ ఆడమనిషి చచ్చి శవమై తేలిందంట. ఎవరై ఉంటారో’.. అని జనం బిక్కుబిక్కుమంటున్నారు.కానిస్టేబుల్ మైక్‌లో ‘ఆడోళ్లందరూ రచ్చబండ ఉన్న చోటుకు రావాలి’ అని అనౌన్స్ చేశాడు.భయం భయంగా పరుగున వచ్చారు గ్రామంలోని మహిళలు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులూ.‘ఒక్కొక్కరికీ.. చెరువు దగ్గర దొరికిన చెప్పు చూపించు’ కానిస్టేబుల్‌ను ఆదేశించాడు సీఐ. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకునేవారా? జాగ్రత్తగా చూసి చెప్పండి’.. అని అందరికీ చూపిస్తున్నాడు కానిస్టేబుల్.అందరూ ‘తెలియదు’ అని చెప్పారు.‘అది ఖరీదైన చెప్పు సార్! మా ఊళ్లో ఎవరూ వేసుకోరు’ బదులిచ్చారు.సీఐ ఆలోచనలో పడ్డాడు.అటువైపుగా గడ్డి ఎత్తుకెళుతున్న ఓ ఆడమనిషిని దూరం నుంచే చూసిన సీఐ ‘ఆమెను ఇలా పిలుచుకురండి’ అని ఆదేశించాడు.కానిస్టేబుల్ ఆమె దగ్గరికి పరిVð త్తుకు వెళ్లి ‘మా సార్ పిలుస్తున్నాడు’ అన్నాడు.‘ఎందుకూ’ అంది ఆమె. ‘ఊరంతా అక్కడే ఉంది..’ అని కానిస్టేబుల్ విషయం చెప్పేసరికి ఆమె గడ్డి మూట కింద పడేసి గబగబా సీఐ ఉన్న చోటుకు వచ్చింది. ‘ఇలాంటి చెప్పు మీ ఊళ్లో ఎవరైనా వేసుకోవడం చూశావా..’ ప్రశ్న పూర్తికాకముందే... ‘చూశా సార్! బెంగుళూరామే వేసుకుంటది’.. అందామె.‘బెంగుళూరామేనా?’ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సీఐ.‘ఈ ఊరోళ్లే సార్. ఏడెనిమిదేళ్ల కింద బెంగుళూరు వెళ్లిపోయారు! ఇప్పుడు బెంగుళూరులో బతుకుతాండారు. వెంకటప్ప పెండ్లాం అనిత ఇట్టాంటి చెప్పులే వేసుకుంటాది సార్’ అంది.‘ఈ మధ్య కాలంలో ఆమె ఎప్పుడైనా ఈ ఊరు వచ్చిందా’‘రాలేదు సార్. మొగుడొక్కడే వస్తున్నాడు.అంతకుమించి నాకేం తెలియదు సార్’ అంది ఆమె.‘సరే.. సరే..’ చెప్పిన వివరాలు నోట్ చేసుకొని అందరినీ వెళ్లిపొమ్మన్నారు. ‘చనిపోయిన మహిళ పేరు అనితనే అయ్యుంటుందా?’ సీఐ ఆలోచనలో పడ్డాడు.ఇది తమ అనుమానం మాత్రమే. రుజువులు ఏమీ లేవు. ఒకవేళ అనితనే అనుకుంటే ఆమెను ఎవరు చంపి ఉంటారు? భర్తా? అయితే, ఎందుకు? పోలీసులు రోజూ దుస్సావాండ్లపల్లికి వెళ్లి వస్తూ మరికంత సమాచారం కోసం వాకబు చేస్తున్నారు అనిత కుటుంబీకులు ఎవరైనా వచ్చారా అని అడుగుతున్నారు. ఈలోపు అనిత భర్త వెంకటప్ప, అతని అన్న ఊరికి వచ్చారని అనిత రాలేదని తెలిసింది. వెంటనే వెంకటప్పను పిలిచి ‘నీ భార్య అనిత ఏమైంది’ అని అడిగాడు సీఐ. ‘బెంగుళూరులోనే ఉంది సార్. ఎందుకు అడుతున్నారు?’ అనుమానంగా అడిగాడు వెంకటప్ప. ‘మరేం లేదు. ఓ కేసు విషయమై ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు వెళ్లచ్చు’ అని స్టేషన్‌కి బయల్దేరాడు సీఐ. అనిత బెంగళూరులో ఉంటే చనిపోయిన ఈమె ఎవరు? అనుమానాలే తప్ప మరే రుజువులు దొరకడం లేదు. విసుక్కున్నాడు సీఐ. ఊర్లోనే మరికొందరిని కలిసి, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వాలో చెప్పి స్టేషన్‌కి వెళ్లిపోయాడు. జులై 15. దుస్సావాండ్లపల్లి నుంచి సీఐకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ‘బెంగళూరులో అనిత భర్త వెంకటప్ప అన్న కూతురు వివాహం జరుగుతోంది’ అని ఆ ఫోన్ తాలూకు సారాంశం.సీఐకి అనుమానం వచ్చింది. సొంత ఊళ్లో పెళ్లి జరపకుండా బెంగళూరులో పెళ్లి ఎందుకు జరుపుతున్నారు? బెంగుళూరు వెళ్లి స్థిరపడినా తరచూ ఊరికి మాత్రం వస్తూనే ఉన్నారు... స్థిరాస్తులు కూడా ఇక్కడే ఉన్నప్పుడు పెళ్లి ఇక్కడే చేయాలి కదా అనుకున్నాడు. ఏదైతేనేం మరిన్ని వివరాలు రాబట్టాలంటే ఈ పెళ్లికి వెళ్లాలి. నిర్ణయానికి వచ్చిన సీఐ తన సిబ్బందిని పిలిచాడు. పెళ్లి జరుగుతున్న రోజు సీఐ టీమ్ బెంగుళూర్ వెళ్ళింది. ఆ పెళ్లిలో అనిత లేదు. పోలీసులకు అర్థమైంది. వెంటనే అనిత భర్త వెంకటప్ప, అతని అన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమదైన శైలిలో విచారణ చేయడంతో వెంకటప్ప అతని అన్న తప్పు ఒప్పుకున్నారు. అనితను చంపడానికి ఒక్కో కారణాన్ని పోలీసుల ముందు బయటపెట్టారు అన్నాదమ్ములు. అనితకు వెంకటప్పకు పెళ్లయ్యి 15 ఏళ్ల పైనే అయ్యింది. ఓ కూతురు కూడా ఉంది. వెంకటప్ప చిన్న కంపెనీలో ప్రైవేట్‌జాబ్ చేస్తుండేవాడు. అతని అన్న కుటుంబం కూడా బెంగుళూరులోనే ఉంది. రెండేళ్ల కిందటి వరకు బాగానే ఉన్న అనితకు కొత్త కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. విలాసవంతమైన జీవనం కోరుకునేది. అందుకు భర్త వెంకటప్పని డబ్బులు ఇవ్వాలని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ‘కోరినవన్నీ తెచ్చివ్వలేనని, ఉన్నదాంట్లోనే సర్దుకోవాలని’ ఖరాకండిగా చెప్పేవాడు వెంకటప్ప. ఇద్దరికీ తరచూ గొడవలు అయ్యేవి. వెంకటప్పతో ఉంటే తన సరదాలు ఎలాగూ తీరవని నిశ్చయించుకున్న అనిత తనకు ఉన్న పరిచయాలను ‘ఉపయోగించుకోవడం’ మొదలుపెట్టింది. ఎంతటి పనులు చేయడానికైనా వెనకాడేది కాదు. ధనవంతులతో పరిచయాలు ఏర్పరుచుకుంది. కార్లు, నగలు, ఖరీదైన దుస్తులు కొనుగోలు చేస్తుండేది. వెంకటప్ప నచ్చచెప్పాలని చూసినా వినేది కాదు. ఎదురు తిరిగేది. ఓ రోజు వెంకటప్ప అన్న కూడా అనితకు చెప్పి చూశాడు. ఇలాగే ఉంటే విషయం చాలా దూరం వెళుతుందని బెదిరించాడు. ‘నాకు పెద్ద పెద్దవాళ్లతో పరిచయాలున్నాయి. నా దారికి అడ్డు వస్తే మీ ఇద్దరిని చంపేయడానికి నాకెంతో టైమ్ పట్టదు’ అంటూ ఎదురు తిరిగింది అనిత. దాంతో అన్నదమ్ములిద్దరూ భయపడిపోయారు. ఈ విషయం బంధువుల్లోనూ, ఊర్లోనూ తెలిస్తే తమ పరువు పోతుందని ఆలోచనలో పడ్డారు. ఒక నిశ్చయానికి వచ్చారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్న వెంకటప్ప ఓ రోజు అనితతో.. ‘ఊళ్లో మనకు భూములున్నాయి కదా! వాటిని అమ్మకానికి పెట్టాం. నువ్వు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఊరెళ్లి రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాక తిరిగి వద్దాం’ అన్నాడు.‘సరే’ అని బయల్దేరింది అనిత. మే 31 రాత్రి సమయానికి కారులో దుస్సావాండ్లపల్లి శివారు ప్రాంతంలోని చెరువు కట్టమీదుగా వెళుతున్నారు అనిత, వెంకటప్ప అతని అన్న. అప్పటికే బాగా చీకటి పడింది. ఓ చోట కారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందని అన్నదమ్ములిద్దరూ కిందకు దిగారు. కారు స్టార్ట్ అవడం లేదని అనిత కూడా దిగింది. అక్కడే అన్నదమ్మలిద్దరూ అనితను గొంతుపిసికి చంపేశారు. అనిత శరీరాన్ని చెరువు కట్టమీదుగా ఓ వైపుకు తీసుకెళ్ళారు. చెరువు ఒడ్డున కొంతమేరలోపలికి వెళ్లి అక్కడ బురదగా ఉన్న చోట తవ్వి, అనిత శరీరాన్ని అందులో పూడ్చేసి, పైన కొన్ని రాళ్లు పడేసి తిరిగి కారులో వెళ్లిపోయారు. పెనుగులాటలో అనిత చెప్పు ఒకటి గట్టు మీద పడిపోగా,మరికొటి చెరువు నీటిలో ఎటో కొట్టుకుపోయింది. గట్టు మీద పడిపోయిన కాలి చెప్పు మౌన సాక్ష్యంగా ఉండిపోయింది.ఐదు రోజుల తర్వాత విపరీతంగా కురుస్తున్న వానలకు శరీరం కొంతవరకు పైకి తేలింది. అభిప్రాయ భేదాలు, చెడు ప్రవర్తనలు, కుటుంబానికి మచ్చ తెచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు అందుకు కారణమైన వ్యక్తులను చట్టబద్ధంగా వదిలించుకోవచ్చు.కాని మనమే నేరపూరితమైన చర్యలకు పూనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. – గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు -
స్త్రీల కోసం చిందిన సిరా చుక్క
చాలా పాత మొహల్లా అది.టాంగాలు నడుస్తున్నాయి. తాగుబోతులు తిరుగాడుతున్నారు. స్త్రీలను వేటాడేవారు జుబ్బాల జేబుల్లో చిల్లర పడేసుకొని కొనడానికి తిరుగుతున్నారు. ‘సార్.. అమ్మాయి కావాలా సార్’ అడిగాడతను ఒక పెద్దమనిషిని. ‘రండి సార్.. పైనే ఉంది’ తీసుకెళ్లాడు. మురికిగా ఉన్న మహల్ అది. చిన్న చిన్న గదులు. మురికి పనుల కోసంగా ఉన్న గదులు. మురికి సమయాలలో రద్దీగా ఉండే గదులు. మెట్ల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళుతున్నాడు. ‘ఇటు... ఇటు..’గడప దగ్గర నిలబెట్టి లోపలికెళ్లాడు. కొద్దిగా తెరిచిన తలుపు నుంచి లోపల ఏముందో కనిపిస్తూ ఉంది.కుక్కి మంచం. దాని మీద ఒక ప్రాణం లాంటి ప్రాణం. స్త్రీ ప్రాణం.‘లెయ్వే... లెయ్... గిరాకీ వచ్చింది లెయ్’ లేవలేదు. నిద్రపోతూ ఉంది. మొద్దుగా నిద్ర పోతూ ఉంది. శవంలా నిద్రపోతూ ఉంది. ‘లెయ్మంటున్నానా’ నీళ్లు మొహాన కొట్టి బలవంతంగా లేపాడు. ‘వద్దు.. ఓపిక లేదు... పంపించెయ్’ ‘ఇదే ఆఖరు... ఆ తర్వాత నిద్ర పోదూగానీ’ ‘అయ్యో.. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా. నేను నిద్రపోయి ఎంత కాలం అయ్యింది. నాకు నిద్ర వస్తోంది.దండం పెడతాను. పంపించేయ్’ ‘ఇదొక్కటే అన్నానా. ఏం తమాషాగా ఉందా’ జుట్టు పట్టుకున్నాడు. స్త్రీ. నలిగి నలిగిపోయి ఉన్న స్త్రీ. నలిపి వేయబడిన స్త్రీ. శవంలా జీవచ్ఛవంలా మారిన స్త్రీ. ఏమడుగుతోంది. మణులా మాణిక్యాలా. నిద్ర. గుక్కెడు నిద్ర. బాధల్ని క్షోభల్ని కాసేపైనా మర్చిపోయేలా చేయగలిగే నిద్ర. ఇవ్వట్లేదే రాక్షసుడు. ‘చెప్పినమాట వింటావా లేదా’ ఛెళ్లున కొట్టాడు.‘ఒరేయ్ రాక్షసుడా’ కాళి అయ్యింది. అపరకాళిలా తిరగబడింది. రక్కింది. ముఖాన పీకింది. తల మంచానికేసి బాదింది. కింద పడ్డాడు. పోయాడు. ఊపిరి తీసుకునే వ్యవధి కూడా లేనట్టుగా పోయాడు. శవం. కాని అదంతా ఆమెకు ఎందుకు. ఆమెకు కావలసింది నిద్ర. హాయిగా పట్టే నిద్ర. అప్పుడిక ఆమె ఆ కుక్కిమంచం మీద, మగాళ్లు నిద్రపోనివ్వని మంచం మీద, దారుణ ఆక్రమణల మంచం మీద తన కోసం తాను తన కోసంగా తాను నిద్ర పోయింది.మంటో రాసిన కథ ఇది. ఇప్పుడు కాదు 60 ఏళ్ల క్రితం. దేశ విభజన జరిగింది. ఇరు ప్రాంతాల వాళ్లు కత్తులు ఝళిపిస్తున్నారు. నెత్తురు చిందిస్తున్నారు. శవానికి శవంతో జవాబు చెబుతున్నారు. ద్వేషాన్ని ద్వేషంతో నూరుతున్నారు. తలల్లో స్పృహ లేదు. చేతుల్లో కత్తులు మాత్రమే ఉన్న కాలం అది. పురుషుడు దొరికితే సంహరించు. స్త్రీ దొరికితే చెరిచెయ్.అలాంటి సమయంలో సరిహద్దు మీద ఒక తండ్రి వెతుకులాడుతున్నాడు. కూతురుని. కన్నకూతురిని. ‘నా కూతురుని చూశావా బాబూ’‘నీ కూతురు ఎలా ఉంటుంది ముసలాయనా?’‘ఎర్రగా తామరపువ్వులా ఉంటుంది. కురులు విప్పితే అప్సరసలా ఉంటుంది. బుగ్గన పెద్ద పుట్టుమచ్చ. అందమైన కూతురు. అమాయకమైన కూతురు. పదహారేళ్ల కూతురు...నాకూతురుని చూశారా బాబూ’...బిడారుల్లో ఏడుపులు... శిబిరాల్లో శోకాలు... వలస పోయేవాళ్ల ఏడ్పులు... వలస వస్తున్నవాళ్ల ఆర్తనాదాలు... కూతురు కనిపించడం లేదే...ఎక్కడో ఒక మూలన ఆ అమ్మాయి కనిపించిందని ఎవరో చెప్పారు.తండ్రి పరిగెత్తాడు. పరిగెత్తి కూతురిని చూశాడు. గుండెలకు హత్తుకుంటూ చూశాడు. కన్నీళ్లను ఆ అమ్మాయి గొంతులోకి ఒంపుతూ ప్రాణాలు దక్కించుకోవడానికి చూశాడు. భుజాల మీద వేసుకొని హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. హాస్పిటల్ బెడ్ మీద కూతురు పడి ఉంది. కొనఊపిరితో ఉంది. ‘డాక్టర్ సాబ్... నా కూతురిని బతికించండి డాక్టర్ సాబ్’ పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్‌ను తీసుకొచ్చాడు.డాక్టర్ వచ్చి నాడీ పట్టుకుని చూశాడు. పేరు పెట్టి పిలిచాడు. కదలిక లేదు. కేసు అర్థం కావడం లేదు. పరికించి చూద్దామంటే గది చీకటిగా ఉంది. గాలాడక చిరాగ్గా ఉంది. పక్కనే ఉన్న కిటికీ రెక్కను చూపిస్తూ ‘విప్పు’ అన్నాడు. తండ్రికి సరిగ్గా వినపడలేదు. ‘దానిని విప్పు’ అన్నాడు.అప్పుడు అనూహ్యంగా ఒకటి జరిగింది.ఆ మాటకు ఆ అమ్మాయిలో కదలిక వచ్చింది. మెల్లగా చేతులు రెంటిలోనూ సత్తువ తెచ్చుకుని వణుకుతూ భయం భయంగా తన పైజామా బొందును ‘విప్పడం’ మొదలుపెట్టింది.కథ ముగిసింది.ఇది కూడా మంటో రాసిన కథే. మంటోగా పిలువబడే ప్రపంచాన ప్రసిద్ధమైన ‘సాదత్ హసన్ మంటో’ స్త్రీల కోసం రాశాడు. స్త్రీ దుఃఖాన్ని లోకానికి చెప్పడానికి రాశాడు. స్త్రీ నిజమైన వేదనను చూస్తే షాక్ అవుతారని చెప్తూ షాకయ్యే పద్ధతిలో రాసి నేల కదిలిపోయేలా చేశాడు. స్వాతంత్య్రం వచ్చే సమయాన బాంబే (ముంబై)లో ఉన్న మంటో అక్కడి వేశ్యల జీవితాల్ని పరిశీలించాడు. అప్పటి వరకూ ఉర్దూ కథా సాహిత్యంలో మర్యాదకరమైన కథలు వస్తున్న సమయంలో వారి జీవితాన్ని కథా వస్తువుగా తీసుకుని లోకాన్ని హడలెత్తించాడు. అందుకు కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగాడు. అయినా భయపడలేదు. ‘వేశ్యల దగ్గరకు వెళ్లడానికి మనకు పర్మిషన్ ఉందిగానీ వారి జీవితాన్ని రాయడానికి పర్మిషన్ లేదా’ అని మంటో ప్రశ్నించాడు. ‘దేశభక్తి కథలు, కార్మికుల కథలు రాయమని అందరూ నన్ను అడుగుతుంటారు. కాని వేశ్యావాటికలో మూసిన తలుపుల వెనుక ఉన్న హింసకు మించిన వస్తువు నా వద్ద లేదు. వాళ్లు మన సమాజంలో భాగం. వారి గురించి రాయాలి’ అన్నాడు మంటో. ఆ రోజులలోనే ఆయన బాంబే శ్రీమంతులు తమ లైంగిక విశృంఖలత్వం కోసం నిరుపేద పసిపిల్లలను ఎలా ఉపయోగించుకునేవారో రాసి సమాజపు పైపై పూతల పరదాలను చీలికలు పీలికలు చేశాడు. అమృత్‌సర్‌లో పుట్టిన సాదత్ హసన్ మంటో భారతదేశాన్ని అందునా బాంబేని విపరీతంగా ప్రేమించాడు. ఆరాధించాడు. బాంబేలో హీరో అశోక్ కుమార్ కీలకపాత్ర పోషించిన ‘బాంబే టాకిస్’ స్టుడియోలో స్క్రిప్ట్ రైటర్‌గా ఉండేవాడు. కాని దేశ విభజన సమయంలో ‘ముస్లిం ఉద్యోగులు’ ఎక్కువ మంది బాంబే టాకిస్లో పని చేస్తున్నారు కనుక ఆ స్టుడియోను తగులబెడతాం అని ఆ రోజులలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. అవి విని మంటో కలత చెందాడు. అంతేకాదు ‘హృదయంలో ఉండవలసిన మతం తలకెక్కి’ విషం చిమ్ముతున్న సమయాలను చూసి విషాదపడ్డాడు. ‘నా దేశం పాకిస్తానా?’ అనే ప్రశ్నతో అతడు లాహోర్ చేరుకున్నాడు. కాని అక్కడకు వెళ్లినా అతడు అనుక్షణం బాంబేను కలవరిస్తూ బతికాడు. 1948లో మంటో పాకిస్తాన్ వెళితే ఆ దేశంలో అతను కేవలం ఏడేళ్లే జీవించగలిగాడు. ‘నా తల్లిదండ్రులు ఖననమైన మట్టి భారతదేశంలో ఉంది. నన్ను ముక్కలు చేసి ఇచ్చిన ఈ స్వాతంత్య్రం శోకమే మిగిల్చింది’ అన్న మంటో 1955లో మరణించాడు. ∙∙ మంటో రాసిన కథల్లో ‘ఠండా గోష్’ (చల్లటి మాంసం) అతడికి విశేషమైన పేరును, కీర్తిని, పీడకలలను మిగిల్చిన కోర్టు కేసులను ఇచ్చింది. ఆ కథలో అతడు వాడిన భాష, తీసుకున్న కథాంశం ఇప్పటికీ యథాతథంగా ప్రచురించడం కష్టం– మెయిన్‌స్ట్రీమ్ పత్రికలలో. మానవ ప్రవర్తనలోని పశుత్వాన్ని, కర్కశత్వాన్ని, స్వార్థాన్ని, పర్వెర్షన్ను మంటో చెప్తూ వెళ్లాడు. నగ్నంగా చూపుతూ వెళ్లాడు. ‘ఇలా రాయడం తప్పు కాదా... రచయితకు బాధ్యత ఉండక్కర్లేదా’ అనంటే ‘వేపాకులు చేదుగానే ఉంటాయి. కాని అవి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి’ అని జవాబు చెప్పాడు. అతడి ఒక కథలో ఒక ముసలి దంపతుల ఇంట్లో ఒక వేరే మతస్తుడు శరణుజొచ్చుతాడు. ఆ ముసలి దంపతులు చాలా మంచివాళ్లు. చీమకు కూడా అపకారం తలపెట్టరు. కాని తమ ఇంట్లో శరణుజొచ్చింది అన్య మతస్తుడు. అప్పుడు వాళ్లు బాగా ఆలోచించి తాము మంచివారం గనక ఒక నిర్ణయం తీసుకుంటారు. ‘మనకెందుకు ఆ పక్కింటి వాళ్లకు ఇతణ్ణి అప్పజెబుదాం. వాళ్లయితే రోజుకొరిని చంపుతున్నారు. ఇతడి సంగతి వాళ్లే చూసుకుంటారు’.ఇలా చెంపకు పట్టి కొట్టినట్టు అతడు కథలు రాశారు.అతడి కథల్లో ఇవాళ్టి మనుషులు కనిపిస్తారు. రేపటి మనుషులు కనిపిస్తారు. నైచ్యం వదులుకోని మనిషి ఉన్నంత కాలం మంటో కథ ఉంటుంది. ‘మంటో’ మీద అనేక నాటకాలు, వ్యాసాలు వచ్చాయి. భారతదేశంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. సుప్రసిద్ధ నటి, దర్శకురాలు నందితా దాస్ ‘మంటో’ జీవితకథను తెరకెక్కించింది. మంటో మీద ఉన్న గౌరవంతో నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కేవలం ఒక్క రూపాయి రెమ్యూనరేషన్‌తో ఈ సినిమాలో నటించాడు. ఒక రచయిత జీవితం, సత్యం పలకాలనుకున్న ఒక రచయిత జీవితం, సత్యానికి నిలబడి సమాజపు నిర్దాక్షిణ్యతను చవి చూసిన ఒక రచయిత జీవితం, తన నేలకు దూరమయ్యి అస్థిమితత్వం పొందిన రచయిత జీవితం ఈ జీవితాన్ని మాత్రమే కాదు... దేశ విభజన ఈ దేశ ప్రజల మీద ఎటువంటి గాయాన్ని కలిగించిందో కూడా ఈ సినిమా చూపుతుంది.మనిషి కోసం మాట్లాడే రచయితలకు బెదిరింపులు, మరణ సందేశాలు వస్తున్న ఇవాళ్టి రోజులలో, ఏ ఉన్మాదాన్నైనా ఖండించాల్సిందే అని కలం పట్టుకునేవారి నోళ్లు మూయించాలనుకుంటున్న ఈ రోజులలో, ప్రజల మధ్య ద్వేషాన్ని కడిగిపారేయడానికి సిరాను నింపుకునేవాళ్ల కలాల ములుకు విరగ్గొడుతున్న ఈ రోజులలో మంటో అవసరం ఉంది.వంద మంటోల అవసరం ఉంది. వేయి మంటోలు ప్రభవించాల్సిన అవసరం ఉంది.సినిమా థియేటర్స్‌లో ఉంది. వెళ్లి మంటోతో పాటు ఒక కథకు కన్నీరు కార్చండి. ఒక కథకు దగ్ధమవ్వండి. నందితా దాస్ ఇచ్చిన మరో కానుక స్త్రీల కోసం రాసిన రచయిత జీవితాన్ని ఒక మహిళా డైరెక్టర్ తెర మీదకు అనువదించడం విశేషమైన అంశం. మంటో జీవిత కథను తెరకెక్కించడానికి నటి, దర్శకురాలు నందితా దాస్ దాదాపు నాలుగు సంవత్సరాలు వెచ్చించారు. రీసెర్చ్ చేశారు. పాకిస్తాన్ వెళ్లి మంటో ముగ్గురు కుమార్తెలను, స్నేహితులను కలిసి మంటో జీవితాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మంటో జీవితం గురించి చూపుతూనే ఆయనకు విశేషమైన పేరు తెచ్చిన కథలకు ఈ సినిమాలో చోటిచ్చారు. ‘ఖోల్దో’, ‘టొబా టేక్సింగ్’, ‘ఠండా గోష్’ కథలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది పిరియడ్ ఫిల్మ్. ఆ కాలం వాతావరణం కల్పించడానికి 1950ల నాటి బాంబే, లాహోర్ల వాతావరణం సృష్టించడానికి నందితా అథెంటిక్ బ్యాక్‌గ్రౌండ్‌ను సృష్టించడంలో ప్రతిభ చూపారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల మంటోతో పాటు నందితాకు కూడా ఆలింగనం ఇస్తారు. – ఖదీర్ -
బైక్‌పై వచ్చి కుక్కను చంపి ఎత్తుకెళ్లారు
-
వాచ్‌మన్ మృతికి కారకులెవరు?
మునిసిపల్ కార్యాలయం ఎదుట శవంతో ఆందోళన లంచం ఇవ్వలేకే నాన్న మృతి : కుటుంబ సభ్యులు ఇది సర్కార్ హత్యే : వైఎస్సార్సీపీ సమన్వయకర్త సిద్ధారెడ్డి కదిరి మునిసిపాలిటీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న నరసింహులు (56) శనివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఉద్యోగంలో ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ ఓ టీడీపీ నాయకుడు డిమాండ్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ఊపిరి ఆగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శవాన్ని మునిసిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసింహులు 20 ఏళ్లుగా నైట్ వాచ్‌మన్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నాడు. మునిసిపాలిటీలో టీడీపీ పాలకవర్గం కొలువు దీరగానే.. అప్పటివరకు ఉన్న కార్మికులను తొలగిస్తామని ఆ పార్టీ నాయకులు కొందరు చెప్పారు. దీంతో ప్రతికార్మికుడూ ఉద్యోగం కాపాడుకునేందుకు రూ.30 వేల నుంచి రూ.70 వేల దాకా సమర్పించుకోవలసి వచ్చింది. ‘నన్ను ఉద్యోగం నుంచి తొలగించకండయ్యా..కొడుకు చదువు ఆగిపోతుంది’ అని నరసింహులు అప్పుచేసి మరీ రూ.50 వేలు సదరు నాయకులకు సమర్పించుకొని అప్పట్లో తన ఉద్యోగాన్ని నిలుపుకున్నాడు. తాజాగా శనివారం అదే నాయకుడు మున్సిపల్ కార్యాలయం వద్ద కలిసి ‘నీ గడువు జూన్ 30తో పూర్తయింది. మళ్లీ కొనసాగాలంటే ఇప్పుడు మళ్లీ రూ.30 వేలు ఇవ్వాలి’ అని చెప్పడంతో నరసింహులుకు అక్కడే గుండె ఆగినంత పనైంది. దిక్కుతోచక ఇంటికెళ్లి విషయం చెప్పి సృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండె ఆగిపోయిందని వైద్యులు చెప్పడంతో భార్య సుబ్బమ్మ, కుమారుడు సురేష్, కూతుర్లు, బంధువుల కన్నీరు మున్నీరుగా విలపించారు. మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన : వాచ్‌మన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బం«ధువులు వాహనంలో మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి నిరసన తెలియజేశారు. ఈలోగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. ‘మీకివ్వాలని చెప్పి మీ అనుచరులు మా నాన్న దగ్గర గతంలో రూ.50 వేలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇంకా రూ.30 వేలు ఇవ్వాలని వచ్చారు. అందుకే మా నాన్న గుండె ఆగి చనిపోయాడు’ నరసింహులు కుటుంబ సభ్యులు ఆయన ఎదుటే విలపించారు. ఇందుకు కందికుంట ఆగ్రహిస్తూ ‘నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి’ అని తెలియజేశారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటానని అక్కడినుంచి వెళ్లిపోయారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి విషయం తెలుసున్న వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి వెంటనే మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు ‘ఇది పూర్తిగా సర్కారు హత్యే. కార్మికులను ఉద్యోగంలో కొనసాగించాలంటే అధికార పార్టీ నాయకులకు ముడుపులెందుకివ్వాలయ్యా..? దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వారికి నచ్చజెప్పి అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామం అమడగూరు మండలానికి తరలించేలా చేశారు. -
హత్య చేసి కాల్చేశారు..?
►అడ్డకొండలో వెలుగులోకి వచ్చిన వైనం ►మృతుడు నారేవారిపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ ►దంపతుల మధ్య విభేదాలే చావుకు కారణమా? రామసముద్రం : రామసముద్రం అడ్డకొండ ప్రాంతంలోని మంగలోని మిద్దె సమీపంలో కాల్చివేసి బొగ్గుల గూడుగా ఉన్న గుర్తుతెలియని శవం వెలుగులోకి వచ్చింది. కట్టెల కోసం వెళ్లిన నారేవారిపల్లె గ్రామస్తులు ఇది గుర్తించారు. సమాచారమివ్వడంతో పుంగనూరు రూరల్ సీఐ రవీంద్ర, ఎస్ఐ సోమశేఖర్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే శవం బాగా కాలిపోయి గుర్తుపట్టని విధంగా ఉండటం, మృతదేహాన్ని జంతువులు పీక్కుతిన్న ఆనవాళ్లు ఉండడంతో ఎవరనేది తెలియరాలేదు. అయితే వారం క్రితం అదృశ్యమైన నారేవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు బి.ఆదెప్ప(40) మృతదేహమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సంఘటన స్థలంలో పడి ఉన్న వెదురు కట్టె ఆధారంగా మృతుడిని కుటుంబ సభ్యులు గుర్తించి భోరున విలపించారు. ఆదెప్ప ఆటో డ్రైవర్‌గా ఉంటూ కౌలుకు వ్యవసాయం చేసేవాడు. కుటుంబంలో భార్యాభర్తల నడుమ కొంతకాలంగా గొడవలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదెప్ప భార్య రత్నమ్మపై అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం అడ్డకొండలో శవం ఉందని ప్రచారంలోకి రావడంతో మృతుడి భార్య పరారైనట్లు తెలుస్తోంది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సీఐ రవీంద్ర కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వాస్తవాలేమిటో తెలియాల్సి ఉంది. -
వ్యాను దిగి వ్యాను ఎక్కాడు
దొంగిలిస్తే దొంగిలించాడు. మార్చురీ వ్యాన్ని దొంగిలించాడు! కొంత దూరం పోయాక వెనక్కు తిరిగి వ్యాన్‌లోకి చూస్తే.. లోపల శవం ఉంది. ‘ఓరి దేవుడో!’ అనుకుంటూ ఆ వ్యాన్ని తీసుకెళ్లి, దొంగిలించిన చోటే వదిలేశాడు. వదిలేస్తే వదిలేశాడు. అక్కడే ఇంకో వ్యాన్ని నొక్కేసి, డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. వెంటనే వాళ్లు ఇతడిని జైలు వ్యాను ఎక్కించారు. పోలీసులు అతడి మీద దొంగతనం కేసు పెట్టారు కానీ, శవాన్ని దొంగిలించే ప్రయత్నం చేశాడన్న కేసు మాత్రం పెట్టలేదు. శవం కోసం అతడు అంత పని ఎందుకు చేస్తాడులే అనుకుని చిన్న కేసుతో సర్దుకుపోయారు. కాలిఫోర్నియాలో ఇప్పుడిదే పెద్ద వార్త!