నాలుగు రోజులు వయసున్న ఓ నవజాత శిశువు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాల మధ్య సజీవంగా ఉంది. తల్లి పాలు లేకపోయినా మూడు రోజులపాటు శిశువు ఆరోగ్యంగా ఉంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్ జిల్లా సహరాన్ పుర్ కు చెందిన కాసిఫ్ , ఆనమ్ దంపతులు టర్నర్ రోడ్డులో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆనమ్ జూన్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి.. అదేరోజు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది.
మూడు రోజులుగా ఆ ఇంట్లోనే
గత మూడు రోజులుగా ఆ దంపతులు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి నాలుగు రోజుల వయసున్న చిన్నారి కూడా సజీవంగా కనిపించింది. తక్షణమే చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాసిఫ్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా కాషిఫ్‌కు ఇది రెండో పెళ్లి వివాహమని స్థానికులు చెబుతున్నారు.
మృతుడి మొదటి భార్య నుస్రత్ అందించిన అదనపు సమాచారం ప్రకారం, గత రెండు మూడు రోజులుగా కాసిఫ్‌తో సంప్రదించడానికి ఆమె ప్రయత్నించిన అది కుదరలేదని తెలిపింది. జూన్ 10వ తేదీ రాత్రి 11 గంటలకు చివరిసారిగా కాసిఫ్‌తో మాట్లాడినట్లు నుస్రత్ పోలీసులకు చెప్పింది. గతంలో ఒకరి వద్ద తీసుకున్న రూ. 5 లక్షల అప్పు గురించి కాసిఫ్ తనతో చెప్పాడని నుస్రత్ చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: మణిపూర్‌లో మంత్రి నివాసానికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
Comments
Please login to add a commentAdd a comment