
సాక్షి, విజయవాడ: పటమటలంక డీ మార్ట్ వీఎంసీ స్కూల్ వద్ద కారులో మృతదేహం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. పార్కింగ్ చేసిన ఏపీ 37 బీఏ 5456 నెంబరు గల ఇండికా కారులో గర్తుతెలియని మృతదేహం బయటపడింది. మంగళవారం కారులోని మృతదేహం నుంచి కుళ్ళిపోయి దుర్వాసన వచ్చింది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని ప్రారంభించారు. దాదాపు 3 రోజులుగా కారు అక్కడే ఉందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.