కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మునుపటిలానే వారి కిరాతక చర్యలను కొనసాగిస్తున్నారు. హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో క్రేన్‌కు ఒక మృతదేహాన్ని వేలాడదీసి బహిరంగంగా ప్రదర్శించారు. అయితే అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మొదట.. తమ పాలన గతంలో మాదిరి ఉండదని, మారిపోయానట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల గతంలోని పాలన మాదిరిగా షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని, చేతులు నరకడంతోపాటు బహిరంగంగా ఉరి తీస్తామని తాలిబన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి తెలిపాడు. హెరాత్ ప్రాంతంలో ఫార్మసీ నడుపుతున్న ఓ వ్యక్తి మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం.. తాలబన్లు నాలుగు మృతదేహాలను ప్రధాన కూడలికి తీసుకువచ్చి ఒక మృతదేహాన్ని వేలాడిదీసారని, మిగిలిన మూడు మృతదేహాలను మరో కూడళ్లలో వద్ద ఈరకంగానే వేలాడ దీసేందుకు తీసుకెళ్లారని తెలిపాడు.
అయితే ఆ నలుగురు కిడ్నాప్ యత్నించడంతో పోలీసుల చేతిలో హతమయ్యారని తాలిబాన్లు ఆ కూడలి వద్ద ప్రకటించారని చెప్పాడు. ఆగష్టు 15 న తాలిబాన్లు ఆప్గన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజలు చీకటి పాలన మళ్లీ మొదలుకానుందని భయభ్రాంతులకు గురవుతున్నారు.
చదవండి: కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment