గొంతునులిమి చంపి.. శవంతో శృంగారం | Two Eliminates Man And They Have Intercouse With Corpse | Sakshi
Sakshi News home page

గొంతునులిమి చంపి.. శవంతో శృంగారం

Published Fri, Mar 13 2020 11:03 AM | Last Updated on Fri, Mar 13 2020 11:27 AM

Two Eliminates Man And They Have Intercouse With Corpse - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

న్యూఢిల్లీ : ఓ వ్యక్తిని చంపి, అతడి శవంతో కామవాంఛ తీర్చుకున్నారు ఇ‍ద్దరు మానవ మృగాళ్లు. వారి మధ్య గొడవ చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌, బీహార్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు దక్షిణ ఢిల్లీలోని నెబ్‌ సరై ఏరియాలో ఉంటున్నారు. వారికి అదే ప్రాంతంలో ఉంటున్న బాధితుడితో పరిచయం ఏర్పడింది. మంగళవారం రాత్రి వారు బాధితుడి ఇంట్లో మందు పార్టీ జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో అతడితో వారికి గొడవ ఏర్పడింది. ఆగ్రహానికి గురైన వారు అతడ్ని గొంతునులిమి చంపేశారు. అనంతరం శవంతో తమ కామ వాంఛ తీర్చుకున్నారు.

ఆ రాత్రి అక్కడినుంచి వెళ్లిపోయి శవాన్ని మాయం చేయటానికి బుధవారం ఉదయం మళ్లీ ఆ ఇంటి వద్దకు వచ్చారు. శవాన్ని తరలిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ మృతుడి సోదరి కంటపడ్డారు. ఆమె గట్టిగా అరవటంతో అక్కడినుంచి పరుగులు తీశారు. సోదరుడి దారుణ హత్యపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు. గొడవ కారణంగానే అతడ్ని చంపేసినట్లు విచారణలో వారు అంగీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement