బెంగళూరు: కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని కోడ్లు గ్రామం వర్షాం వస్తే చాలు జలమయం అయిపోతుంది. ఐతే ఆ సమయంలో ఆ గ్రామంలోని కుటుంబాల్లో ఏ వ్యక్తి అయిన చనిపోతే వారిని శ్మశానానికి తీసుకువెళ్లడం గ్రామస్తులకు ఒక సవాలుగా ఉంది. పైగా అక్కడ నివాసితులు వర్షకాలం అంటేనే చాలా భయపడతారు. శ్మశాన వాటిక రహదారులన్ని ఈ వర్షాకాలం ముంపునకు గురై శవాలను తరలించడం అత్యంత కష్టంగా ఉంటుంది
ఈ మేరకు ఆ కోడ్లు గ్రామంలో ఒక వ్యక్తి చనిపోతే నడుమ లోతు నీళ్లో శవాన్ని తీసుకువెళ్తున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వర్షాకాలం వస్తేనే చాలు ఈ గ్రామంలోని రోడ్డన్నీ నీళ్లతో నిండిపోతాయని, పరిష్కారం కోసం ఎన్నో నెలలుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సహాయం అందించడంలేదని వాపోయారు. పైగా ఇది రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గ్రామం.
(చదవండి: అప్పు ఎక్స్‌ప్రెస్ పేరిట అంబులెన్స్ అందజేసిన ప్రకాశ్ రాజ్)
Comments
Please login to add a commentAdd a comment