
సాక్షి, భువనేశ్వర్(జయపురం): కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ సిబ్బంది బయట పడేసిన సంఘటన స్థానిక పట్టణ సమీపంలోని డొంగాగుడ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఆ మృతదేహాన్ని చూసి, స్థానికులు భయపడుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పీపీఈ కిట్లతో మృతదేహాన్ని డెప్పిగుడ సమీపంలోని చంపాకుపిలి శ్మశానవాటికకు తరలించి, దహనపరిచారు. డొంగాగుడ దగ్గరి కెనాల్ వద్ద బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువకులు అంబులెన్స్ నుంచి ఓ శవాన్ని సిబ్బంది పారవేస్తుండగా చూసినట్లు సమాచారం.