
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు ఆస్పత్రిలో రోగి మృతిపై మంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు. డీఎం,హెచ్‌వో, ఆశ్రమం హాస్పిటల్ డాక్టర్‌తో మాట్లాడారు. పేషెంట్ ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. మృతుడి బంధువుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ చేరాడు. దాదాపు నెల రోజుల పాటు చికిత్స తీసుకుని మృతి చెందాడు.
(చదవండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment