Ashram Hospital
-
దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదు: కలెక్టర్ కార్తికేయమిశ్రా
సాక్షి, పశ్చిమ గోదావరి: ఆశ్రమ్ ఆస్పత్రిలో ఘటనపై కమిటీ నిజనిర్ధారణ చేసిందని కలెక్టర్ కార్తికేయమిశ్రా అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. డయాబెటిక్ పేషెంట్ దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదన్నారు. ఆ సమయంలో విద్యుత్, ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కోలుకున్నాక గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు -
ఏలూరు ఆశ్రమం ఆస్పత్రి ఘటన.. విచారణకు ఆదేశించిన మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు ఆస్పత్రిలో రోగి మృతిపై మంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు. డీఎం,హెచ్‌వో, ఆశ్రమం హాస్పిటల్ డాక్టర్‌తో మాట్లాడారు. పేషెంట్ ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. మృతుడి బంధువుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ చేరాడు. దాదాపు నెల రోజుల పాటు చికిత్స తీసుకుని మృతి చెందాడు. (చదవండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం) -
పక్కా పథకం ప్రకారమే తేజస్వినిపై దాడి
సాక్షి, ఏలూరు: ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్మాది దాడిలో గాయపడి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవ్వూరి తేజస్వినిని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా పోడూరు మండలం కవిటంకు చెందిన డిగ్రీ విద్యార్థిని తేజస్వినిని పథకం ప్రకారమే మేడపాటి సుధాకర్‌రెడ్డి హతమార్చేందుకు కత్తితో దాడికి పాల్పడినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తేజస్వినిని ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తుండటంతో ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు విషయాన్ని గ్రామ పెద్దలు దృష్టికి తీసుకు వెళ్లడంతో తేజస్వినిని ఇబ్బంది పెట్టనని సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ఈ ఘటనతో తేజస్వినిపై కక్ష పెంచుకున్న సుధాకర్‌రెడ్డి ఆమెను హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేశాడు. సమయం కోసం మాటువేసి కత్తితో ఆమెపై దాడి చేశాడు. తేజస్విని పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పెద్దల సమక్షంలో రాజీ జరిగినప్పట్నుంచీ కళాశాలకు వెళ్లేటపుడు రోజూ ఆమె మేనమామ శ్రీనివాసరెడ్డి బస్సు ఎక్కించి వస్తున్నారు. అయితే బుధవారం పని ఉండి మేనమామ ఆమె వెంట రాలేదు. తేజస్విని ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టిన సుధాకర్‌రెడ్డి వెస్పాపై కత్తులు ఉన్న సంచి తీసుకుని ఆమెను వెంబడించాడు. కత్తితో దాడికి తెగబడ్డాడు. సమీపంలోని ఇంటి పెరట్లోకి తేజస్విని పరుగెత్తడంతో అక్కడే ఉన్న ఆ ఇంటి యజమానితో పాటు మరొకరు సుధాకర్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఓవైపు వారిని విదిలించుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తేజస్వినిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాడి తరువాత సుధాకర్‌రెడ్డి నోటి నుంచి నురుగ రావడంతో దాడి చేయడానికి ముందే అతడు పురుగుమందు తాగినట్లు తెలుసతఓంది.. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరినీ చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం తేజస్విని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా సుధాకర్‌రెడ్డికి గతంలోనే వివాహం అయింది. అయినా తేజస్వినిని ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. -
వైద్యం అందక వీడియో జర్నలిస్టు మృతి
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆశ్రమ్ ఆస్పత్రిలో సుధాకర్ అనే వీడియో జర్నలిస్టు మరణించారు. ఆశ్రమ్ ఆస్పత్రిలో సమయానికే చేరినా, వైద్యం అందించలేదని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. సుధాకర్‌కు జర్నలిస్టు హెల్త్ కార్డు ఉన్నా పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. కాగా ఆశ్రమ్ ఆస్పత్రికి ప్రస్తుతం చైర్మన్‌గా నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యవహరిస్తున్నారు. సుధాకర్ మృతికి నిరసనగా ఆశ్రమ్ ఆస్పత్రి ముందు జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు బైఠాయించారు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
చీటీల పేరుతో మోసగించిన వ్యక్తి అరెస్ట్
ఏలూరు(వన్ టౌన్) : ఆశ్రం ఆస్పత్రిలో సూపర్వైజర్గా పనిచేస్తూ కిందిస్థాయి సిబ్బంది నుంచి చీటీల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు ఎగనామం పెట్టి పరారైన వ్యక్తిని ఏలూరు రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశ్రం మెడికల్ కళాశాలలో సూపర్వైజర్గా పనిచేస్తున్న కంతేటి కిషోర్‌రాజు తనతో పాటు సంస్థలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది నుంచి చీటీల పేరుతో సుమారు రూ.25 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు ఈ నెల 25న ఏలూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కిషోర్‌రాజు రహస్యంగా తలదాచుకుంటున్న బీడీ కాలనీలోని ఇంటిపై నిఘాపెట్టి శుక్రవారం వేకువజామున అతడిని పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై జి.ఫణీంద్ర తెలిపారు.