చీటీల పేరుతో మోసగించిన వ్యక్తి అరెస్ట్ | cheated in the name of the receipt of the arrest of the person | Sakshi
Sakshi News home page

చీటీల పేరుతో మోసగించిన వ్యక్తి అరెస్ట్

Published Sat, Nov 29 2014 3:02 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM

cheated in the name of the receipt of the  arrest of the person

ఏలూరు(వన్ టౌన్) : ఆశ్రం ఆస్పత్రిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ కిందిస్థాయి సిబ్బంది నుంచి చీటీల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి చివరకు ఎగనామం పెట్టి పరారైన వ్యక్తిని ఏలూరు రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశ్రం మెడికల్ కళాశాలలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కంతేటి కిషోర్‌రాజు తనతో పాటు సంస్థలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది నుంచి చీటీల పేరుతో సుమారు రూ.25 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు ఈ నెల 25న ఏలూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితుడు కిషోర్‌రాజు రహస్యంగా తలదాచుకుంటున్న బీడీ కాలనీలోని ఇంటిపై నిఘాపెట్టి శుక్రవారం వేకువజామున అతడిని పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై జి.ఫణీంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement