
సాక్షి, శ్రీకాకుళం( రణస్థలం): భర్త చితికి భార్య నిప్పుపెట్టి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన కోష్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు వరసాల సత్యనారాయణ (45) 15 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో కోలుకున్నారు.
దీంతో కుటుంబీకులు ఇంటికి తీసుకొచ్చేశారు. అయితే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కరోనా భయంతో బంధువులు ముందుకురాలేదు. మృతుడికి కుమారులు లేరు. దీంతో భార్య పద్మ అన్నీతానై కొంతమంది సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది.
చదవండి: విషాదం: పిల్లల కళ్లెదుటే..
Comments
Please login to add a commentAdd a comment