Pyre
-
చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు..
భువనేశ్వర్: పెళ్లికాని యువతి శరీర మాంసం తింటే అతీత శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో చితిలో సగం కాలిన శవాన్ని బయటకు లాగి తింటూ పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు. అంత్యక్రియలు నిర్వహించిన మృతురాలి బంధువులు చూస్తుండగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో అక్కడే వారిద్దరినీ కట్టేసి దేహశుద్ధి చేశారు. ఒడిశా గిరిజన ప్రాంతమైన మయూర్ భంజ్ జిల్లాలో అనాగరిక సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువతి అంత్యక్రియలను పూర్తి చేసే క్రమంలో ఆమె చితికి నిప్పు పెట్టి చితి కాలుతుండగా వారు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు.. అంతలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు చితిలో కాలుతున్న శవాన్ని బయటకు లాగారు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా వారేమీ సమాధానమివ్వకుండా సగం కాలిన శవాన్ని మూడు ముక్కలు చేసి రెండు ముక్కలను తిరిగి చితిలో వేశారు. మూడో భాగాన్ని మాత్రం వారిద్దరూ పీక్కుని తింటూ మద్యం మత్తులో డాన్సులు చేశారు. అది చూసి కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. స్థానికుల సాయంతో ఇద్దరు నరమాంసాన్ని భక్షకులను స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. విషయం తెలుసుకుని బందసాహి పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సుందర్ మోహన్ సింగ్(53), నరేంద్ర సింగ్(25) ఇద్దరూ దగ్గర్లోని దంతుని గ్రామానికి చెందిన వారని, వీరిలో సుందర్ చేతబడులు చేస్తుంటాడని అదే మూఢ నమ్మకంతో పెళ్లికాని యువతి మాంసం తింటే అతీత శక్తులు వస్తాయని మత్తు ప్రభావంలో సగం కాలిన శవాన్ని తినే పనికి పాల్పడ్డాడరని తెలిపారు. ఇది కూడా చదవండి: లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి.. -
భగభగ మండుతున్న స్నేహితుని చితిలో దూకిన యువకుడు... తరువాత జరిగిందిదే..
ఈ ప్రపంచంలో ఊహించని సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకున్నవారు తెగ ఆశ్చర్యపోతుంటారు. అలాంటి విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఒక యువకుడు మృతిచెందిన నేపధ్యంలో అతని అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి అతని స్నేహితుడు అదే చితిలో పడిపోయి, తీవ్రంగా గాయపడ్డాడు. నగ్లా ఖంగ్రా పరిధిలోని మాడయి గ్రామానికి చెందిన 32 ఏళ్ల అశోక్ కుమార్ కేన్సర్ బాధితుడు. ఈ వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం 6 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుని అంతిమ సంస్కారాలలో పాల్గొనేందుకు అతని స్నేహితుడు ఆనంద్ హాజరయ్యాడు. అశోక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆనంద్ కళ్లుతిరిగి మండుతున్న ఆ చితిలో పడిపోయాడు.అందరూ చూస్తున్నంతలోనే అతని శరీరం 90శాతం మేరకు కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే బాధితుడుని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో స్థానిక వైద్యులు బాధితుడిని ఆగ్రా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మృతుడు అశోక్ బంధువు ఒకరు మాట్లాడుతూ.. చితి మండుతుండగా ఉన్నట్టుండి ఆనంద్ కళ్లుతిరిగి చితిపై పడిపోయాడన్నారు. తాము వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా ఆనంద్‌కు నలుగురు కుమార్తెలున్నారు. మరోవైపు గ్రామస్తులు ఈ ఉదంతంపై మరో కథనాన్ని వినిపిస్తున్నారు. తన స్నేహితుడు అశోక్ మృతితో తీవ్రంగా కలత చెందిన ఆనంద్ స్నేహితుని చితిలో దూకాడని చెబుతున్నారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడని అంటున్నారు. -
గుండెపోటుతో భర్త మృతి.. ఇలా రుణం తీర్చుకున్న భార్య
సాక్షి, శ్రీకాకుళం( రణస్థలం): భర్త చితికి భార్య నిప్పుపెట్టి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన కోష్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వరసాల సత్యనారాయణ (45) 15 రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో కోలుకున్నారు. దీంతో కుటుంబీకులు ఇంటికి తీసుకొచ్చేశారు. అయితే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కరోనా భయంతో బంధువులు ముందుకురాలేదు. మృతుడికి కుమారులు లేరు. దీంతో భార్య పద్మ అన్నీతానై కొంతమంది సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. చదవండి: విషాదం: పిల్లల కళ్లెదుటే.. -
'కొడుకా నువ్వు కనపడవా.. దేవుడు అన్యాయం చేశాడు'
పెద్దవూర: తలకొరివి పెట్టాల్సిన కొడుకు చితిపై నిర్జీవంగా పడి ఉన్నాడు. బాగోగులు చూసుకునే కోడలు, నానమ్మా అంటూ పిలిచే పిల్లలు ఆ పక్కనే అచేతన స్థితిలో ఉన్నారు. ‘కొడుకా ఇక నువ్వు కనపడవా.. దేవుడు అన్యాయం చేశాడు..’ అంటూ గుండెలవిసేలా రోదిస్తూ ఆ వృద్ధ తల్లి.. నలుగురి చితికి నిప్పు పెట్టిన దృశ్యం.. గ్రామం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక దృశ్యం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పల మడుగులో శనివారం కనిపించింది. నిడమనూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనుతో పాటు భార్య విజయ, పిల్లలు శ్రీవిద్య, వర్షిత్ మరణించిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో జరిగాయి. నలుగురి మృతదేహాలను ఒకే చితిపై పేర్చ గా.. శ్రీను తల్లి పెంటమ్మ.. ఆ చితికి నిప్పం టించింది. అంతిమ యాత్రలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మరణంలోనూ వీడని స్నేహం.. -
తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు
ఎల్దుర్తి (మెదక్) : తండ్రికి కూతురు తల కొరివి పెట్టి రుణం తీర్చుకున్న సంఘటన ఎల్దుర్తి మండలంలోని నెల్లూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొట్టమొదటి సర్పంచ్ గొర్క లక్ష్మి భర్త శేకులు (50) అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు స్వప్న, సంతోషి, వెన్నెల ఉన్నారు. మగ సంతానం లేకపోవడంతో చిన్న కూతురు వెన్నెల.. తండ్రికి తల కొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది.