పెద్దవూర: తలకొరివి పెట్టాల్సిన కొడుకు చితిపై నిర్జీవంగా పడి ఉన్నాడు. బాగోగులు చూసుకునే కోడలు, నానమ్మా అంటూ పిలిచే పిల్లలు ఆ పక్కనే అచేతన స్థితిలో ఉన్నారు. ‘కొడుకా ఇక నువ్వు కనపడవా.. దేవుడు అన్యాయం చేశాడు..’ అంటూ గుండెలవిసేలా రోదిస్తూ ఆ వృద్ధ తల్లి.. నలుగురి చితికి నిప్పు పెట్టిన దృశ్యం.. గ్రామం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక దృశ్యం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పల మడుగులో శనివారం కనిపించింది.
నిడమనూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనుతో పాటు భార్య విజయ, పిల్లలు శ్రీవిద్య, వర్షిత్ మరణించిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో జరిగాయి. నలుగురి మృతదేహాలను ఒకే చితిపై పేర్చ గా.. శ్రీను తల్లి పెంటమ్మ.. ఆ చితికి నిప్పం టించింది. అంతిమ యాత్రలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మరణంలోనూ వీడని స్నేహం..
Comments
Please login to add a commentAdd a comment