Peddavura
-
భార్యతో అత్తారింటికి అల్లు అర్జున్.. అభిమానులకు తప్పని నిరాశ
సినీ హీరో అల్లు అర్జున్ సతీసమేతంగా నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి వచ్చారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తోడల్లుడు నామిరెడ్డి వీరారెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం సినీ హీరో అల్లు అర్జున్ సతీసమేతంగా చింతపల్లి గ్రామానికి వచ్చి వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పక్కనే ఉన్న అత్తారింటికి వెళ్లి గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే తమ సమీప బంధువుల పిల్లలు ఒకరిద్దరు ఇంట్లోకి వెళ్లి అల్లు అర్జున్‌తో ఫొటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ చింతపల్లికి వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. అల్లు అర్జున్‌తో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలను తీసుకోకుండా బౌన్సర్లు అడ్డుకున్నారు. తమ అభిమాన హీరో ఫొటో తీసుకోనీయక పోవడంతో అభిమానులు, ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. గతంలోనూ అల్లు అర్జున్ చింతపల్లి గ్రామానికి రెండు పర్యాయాలు దసరా పండుగకు వచ్చి సందడి చేశారు. చదవండి: Shruti Hassan : శ్రుతిహాసన్ ఏంటి ఇలా తయారైంది? ఆమె ముఖానికి ఏమైంది? -
నల్లగొండ జిల్లాలో కూలిన ట్రైనింగ్ విమానం
-
కుప్పకూలిన ట్రైనీ విమానం
పెద్దవూర/విజయపురిసౌత్: నల్లగొండ జిల్లాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని మహిళా శిక్షణ పైలట్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. టూ సీటర్ సెస్నా 152 విమానంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ సమీ పంలో ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిమా గజరాజ్ (29) శిక్షణ పొందుతున్నారు. టూ సీటర్ సెస్నా–152 ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్తో శనివారం ఉదయం 10.30 గంటలకు శిక్షణ కేంద్రం నుంచి సింగిల్‌గా బయలుదేరారు. టేకాఫ్ అయిన 30 నిమిషాల్లోనే కూలిపోయింది. విమానం శకలాలు వంద మీటర్ల దూరంలో పడిపో యాయి. పైలట్ అక్కడికక్కడే మృతిచెందారు. చెట్లను తాకే ఎత్తులో చక్కర్లు కొట్టి.. రామన్నగూడెం, ముత్యాలమ్మగుడి స్టేజీ మీదుగా 10 నిమిషాలకు పైగా చెట్లను తాకే ఎత్తులో నాలుగైదు సార్లు విమానం చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ బావి పక్కనున్న సుబాబుల్ చెట్టు పైభాగంలో ఉన్న ఆకులను తాకుతూ పైకి లేచిందని, తర్వాత 30 సెకన్లలోనే రెండు హై టెన్షన్ విద్యుత్ స్తంభాల మధ్య విద్యుత్ తీగల కిందుగా వెళ్లి కూలిపోయిందని వివరించారు. దగ్గర్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న గ్రామ వీఆర్ఏ ప్రమాదం విషయాన్ని స్థానిక తహసీల్దార్, పోలీసులకు తెలిపారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాలిలో చక్కర్లు కొడుతూ భూమిని వేగంగా తాకి పెద్ద శబ్దంతో విమానం కూలిందని ఎస్పీ తెలిపారు. విమానం సాంకేతిక లోపంతో కూలిందా, మరేదైనా కారణమా డీజీసీఏ విచారణలో తేలుతుందన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారని తెలిపారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం: విమానం శిథిలాల కింద పైలట్ మృతదేహం మాంసం ముద్దగా మారింది. సాయంత్రం 4 గంటలకు ట్రాక్టర్‌తో శిథిలాలను పక్కకు తొలగించి మృతదేహాన్ని బయటికి తీశారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి భర్త, తల్లి ఉన్నారు. వారితో కలిసి రైట్బ్యాంకులోనే ఉంటున్నారు. మహిమ మరణ వార్త తెలుసుకొని భర్త పరందామ కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరికి 2017లో వివాహం అయినట్లు తెలిసింది. డీజీసీఏ బృందం పరిశీలన: ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన ప్రదేశాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ ప్రత్యేక బృందం అధికారులు పరిశీలించారు. కూలిపోయిన విధానాన్ని ప్రత్యక్ష సాక్షులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి డీజీసీఏ ప్రత్యేక బృందం రానున్నట్లు తెలిసింది. మరోవైపు విజయపురి సౌత్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్ ఆకాడమీని గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్, ఆర్డీవో పార్థసారథి తనిఖీ చేశారు. ఫ్లైటెక్లోని రికార్డులు, విమానలకు సంబంధించి అనుమతి పత్రాలను పరిశీలించి విచారణ చేపట్టారు. విమానంతో సిగ్నల్స్ తెగిపోయాయి: ఫ్లైటెక్ సీఈవో ఫ్లైటెక్ శిక్షణ కేంద్రంలో 6 నెలల క్రితం ట్రైనీ మహిళా పైలట్‌గా మహిమా గజరాజ్ చేరారు. ఆమె ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్‌గా నడిపిన అనుభవం ఉందని సంస్థ సీఈవో మమత తెలిపారు. టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్తో సిగ్నల్స్ తెగిపోయా యన్నారు. ఫ్లైటెక్ 2009లో ప్రారంభం నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్‌లో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పైలట్ శిక్షణ తరగతులను నిర్వహిం చేందుకు అనుమతిచ్చింది. దీంతో ఫ్లైటైక్ ఏవి యేషన్ అకాడమీకి సంబంధించిన ప్రహరీ, రన్‌వే, హ్యం గర్లు నిర్మించారు. 2010లో అధికారులు క్రాస్ కంట్రీకి అనుమతులు ఇవ్వటంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. హైదరాబా ద్‌లోని నాదర్గుల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి నాగార్జునసాగర్‌కు ట్రైనీ పైలట్ ఎయిర్‌క్రాప్ట్‌లో వచ్చి తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేవారు. అలాగే ఉదయం నాగార్జునసాగర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకు క్రాస్ కంట్రీ నిమిత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరిన మహిమ.. ప్రమాదానికి గురై మృతి చెందారు. సంస్థలో పైలట్లు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెన్స్ ఇంజనీరింగ్, బీఎస్సీ ఏవియేషన్‌కు సంబంధించి సుమారు 60 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. -
సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి
పెద్దవూర: అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందిన సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్ అంత్యక్రియలు ఆదివారం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన మృతితో పెద్దవూర గ్రామ పంచాయతీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో మృతి చెందగా శనివారం రాత్రి 9 గంటలకు పెద్దవూర తీసుకువచ్చిన మృతదేహాన్ని ఆదివారం 11 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన నాయకుడి కడచూపు కోసం వందలాదిగా తరలివచ్చారు. కిలోమీటర్ పైగా సాగిన అంతిమ యాత్రలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డిలు పాల్గొని నడిచారు. పాడె మోసిన మంత్రి జగదీశ్‌రెడ్డి తన సహచరుడు, సీనియర్ టీఆర్ఎస్ నేత, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని పాడెను మోశారు. భాస్కర్‌రెడ్డితో తనకు గల అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రముఖుల పరామర్శ అనారోగ్యంతో మృతి చెందిన పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్, ఎంసీ కోటిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మన్నెం రంజిత్‌యాదవ్, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధసుందర్‌రెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కంకణాల నివేదితారెడ్డి, డీవీఎన్‌రెడ్డి, ఇరిగి పెద్దులు, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'కొడుకా నువ్వు కనపడవా.. దేవుడు అన్యాయం చేశాడు'
పెద్దవూర: తలకొరివి పెట్టాల్సిన కొడుకు చితిపై నిర్జీవంగా పడి ఉన్నాడు. బాగోగులు చూసుకునే కోడలు, నానమ్మా అంటూ పిలిచే పిల్లలు ఆ పక్కనే అచేతన స్థితిలో ఉన్నారు. ‘కొడుకా ఇక నువ్వు కనపడవా.. దేవుడు అన్యాయం చేశాడు..’ అంటూ గుండెలవిసేలా రోదిస్తూ ఆ వృద్ధ తల్లి.. నలుగురి చితికి నిప్పు పెట్టిన దృశ్యం.. గ్రామం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక దృశ్యం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తెప్పల మడుగులో శనివారం కనిపించింది. నిడమనూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనుతో పాటు భార్య విజయ, పిల్లలు శ్రీవిద్య, వర్షిత్ మరణించిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో జరిగాయి. నలుగురి మృతదేహాలను ఒకే చితిపై పేర్చ గా.. శ్రీను తల్లి పెంటమ్మ.. ఆ చితికి నిప్పం టించింది. అంతిమ యాత్రలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మరణంలోనూ వీడని స్నేహం.. -
ఓటు హక్కును వినియోగించుకోని పాలమూరు కూలీలు
సాక్షి, పెద్దవూర: తెలుగు రాష్ట్రాలలో మొదటి విడతలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు పాలమూరు కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాలకు చెందిన వందలాది మంది జడ్చర్ల–కోదాడ రోడ్డు విస్తరణ పనులలో కూలీ పనులు చేస్తున్నారు. వీరిని సంబందిత కాంట్రాక్టర్ నెలవారీ వేతనంతో కుటుంబాలకు, కుటుంబాలే జీతం చేస్తున్నారు. వీరి స్వగ్రామాలలో గురువారం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా ఓటు హక్కును వినియోగించుకోలేని దీన పరిస్థితిలో ఉన్నారు. తాము కేవలం సర్పంచ్ ఎన్నికల సమయంలోనే మా స్వగ్రామమైన దేవరకద్రకు వెళ్లి ఓట్లు వేసినట్లు, శాసనసభ ఎన్నికల్లోనూ ఇక్కడే ఉండి కూలీ పనులు చేసినట్లు తెలిపారు. ఓటు వేయటానికి ఊరికి వెళ్తే ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు అవుతుందని, దీనికి తోడు పనికి రాకుంటే నాకాలు వేస్తారని దీనంగా పేర్కొన్నారు. -
ప్రత్యేక ఆకర్షణగా సినిమాలోని ఎద్దు
సాక్షి,పెద్దవూర : ప్రముఖ హీరో పవన్‌కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాలో ఉన్న ఎద్దు పందేలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాశివరాత్రి సందర్భంగా దున్న ఇద్దాస్ ఆరాధనోత్సవాలలో భాగంగా తెలుగు రాష్ట్రాల ఎద్దుల పందేలను గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన సోమవారం నిర్వహించిన సీనియర్ సైజు విభాగంలో కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన నవనీతకృష్ణ ఎద్దులు పాల్గొన్నాయి. చివరికి ఆ ఎద్దులు 3200 అడుగుల దూరం లాగి చతుర్థ బహుమతిని గెల్చుకున్నాయి. -
కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలి: జానారెడ్డి
సాక్షి, పెద్దవూర : నియంతలా వ్యహరిస్తున్న కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలని సీఎల్పీ మాజీ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చలకుర్తి, సంగారం, ముసలమ్మచెట్టు, బట్టుగూడెం, పెద్దవూర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మాటల గారడీతో నాడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు డబ్బుల మూటలతో మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ ప్రజలను బాగుపెట్టడానికి కాదని తన కుటుంబాన్ని స్వర్ణయుగం చేసుకోవడానికే అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అవస్థల పాలైంది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. గత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే టీఆర్ఎస్ పేర్లు మార్చి ఏదో గొప్ప చేశామని జబ్బలు చర్చుకుంటుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ చర్యలు విపరీతంగా ఉంటాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజలను రక్షించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడి హద్దుమీరిన అహంకార పూరితుడై నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపడానికే ఉత్తర, దక్షిణాలుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజాకూటమిగా ఏర్పాడినట్లు తెలిపారు. జానారెడ్డి అంటే అన్ని కులాలు, మతాల వాడని అన్నారు. ఓట్ల కోసం కులాల పేరుతో రెచ్చగొట్టి ఊర్ల పేర్లు, బజార్లు తెలియని వారు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, రూ.3వేల నిరుద్యోగ భృతి, ఉచితంగా 7 కిలోల సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కడారి అంజయ్యయాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, జానా తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రమావత్ శంకర్‌నాయక్, అబ్బిడి కృష్ణారెడ్డి, కూరాకుల అంతయ్య, గడ్డంపల్లి వినయ్‌రెడ్డి, కర్న దామోదర్‌రెడ్డి, పబ్బు యాదగిరిగౌడ్, కర్నాటి పద్మారెడ్డి, నర్సింహారెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ కత్తి రమణమ్మవెంకట్రెడ్డి, సంజీవరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వెంకటయ్య, టీడీపీ నాయకులు దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, బాబురావునాయక్ పాల్గొన్నారు. జానా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక: మండలంలోని చలకుర్తి, నీమానాయక్‌తండా, కుంకుడుచెట్టుతండా, మల్లేవానికుంటతండా, రామ్మూర్తికాలనీ, బట్టుగూడెం, సంగారం గ్రామాలకు చెందిన పలువురు టీఆర్ఎస్ నుంచి సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీలో చేరిన వారిలో తుమ్మలపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గోదాసు నారాయణరెడ్డి, సర్థార్‌నాయక్ ఉన్నారు. మరిన్ని వార్తాలు... -
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు..
పెద్దవూర(నల్లగొండ): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డితోపాటు పెద్దవూర పీఏసీఎస్ చైర్మన్ తుమ్మలపల్లి శ్రీకర్‌రెడ్డి, 11 మంది సర్పంచిలు, 8మంది ఎంపీటీసీ సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో వీరందరికీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి
పెద్దవూర: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందని డిప్యూటీ తహసీల్దార్ ఇస్లావత్ పాండునాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి«థిగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థినులు బతుకమ్మలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర, తెప్పమడుగు సర్పంచ్‌లు కూతాటి భానుశ్రీదేశ్, చామల సువర్ణభాస్కర్రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ నడ్డి ఆంజనేయులు, చామకూరి లింగారెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. న్యూకిడ్స్ పబ్లిక్ స్కూల్లో.. మండల కేంద్రంలోని న్యూకిడ్స్ పబ్లిక్ పాఠశాలలోనూ గురువారం విద్యార్థినులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ షేక్ అబ్బాస్, ఉపాధ్యాయులు రామకృష్ణ, వెంకటయ్య, రషీద్, చిరంజీవి, శ్రీనివాస్‌రెడ్డి, ఖలీల్‌పాషా పాల్గొన్నారు. -
శిశుగృహకు ఆడశిశువు అప్పగింత
పెద్దవూర మండలంలోని పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధి పాత జయరాంతండాకు చెందిన రమావత్ వనిత–రాము దంపతులు ఆడశిశువును సాకలేమని శనివారం పెద్దవూర ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తండాకు చెందిన రమావత్ వనిత–రాము దంపతులు నిరుపేద గిరిజనులు. వీరికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి మొదటి, రెండవ సంతానంగా ఆడపిల్లలే జన్మించారు. వంశాంకురం కోసం కుమారుడు కావాలని భావించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. మూడవ కాన్పులోనూ వనిత గత జూన్ 6వ తేదీన మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత శిశువుతో సహా పాత జయరాంతండాకు వచ్చింది. పాప జన్మించిన 15 రోజులకు తన తల్లిగారింటికి వెళ్తున్నానని చెప్పి జయరాంతండా నుంచి వెళ్లింది. ఆ తర్వాత నెలన్నర రోజులకు పాపను తీసుకురాకుండా ఒక్కతే ఇంటికి చేరింది. పాప ఏమైందని చుట్టుపక్కల వారు అడిగితే చనిపోయిందని చెప్పటంతో వారికి అనుమానం వచ్చింది. విషయాన్ని స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు చేరవేయడంతో వనితను నిలదీశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్త పి.పద్మావతి, సూపర్వైజర్ ఎస్.వెంకాయమ్మలు విషయాన్ని సీరియస్‌గా తీసుకుని భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాపను సాకటానికి ఆర్థిక స్థోమత లేక తమ బంధువులకు సాదుకోవటానికి ఇచ్చానని చెప్పింది. దీంతో బంధువుల నుంచి శిశువును తీసుకువచ్చి సాకలేమని శనివారం స్థానిక కార్యాలయంలో గ్రామస్తుల సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అధికారులు శిశువును నల్లగొండ శిశుగృహకు తరలించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్.వెంకాయమ్మ, కార్యకర్త పి.పద్మావతి, గ్రామస్తులు దేవసాని శశిపాల్‌రెడ్డి, పాల్తీ శ్రీనునాయక్, కొంగరి రాములు, ఆయా జ్యోతి పాల్గొన్నారు. -
ఇందిరమ్మ బిల్లులు చెల్లించేలా కృషి
వెల్మగూడెం(పెద్దవూర) : ప్రభుత్వం మెడలు వంచైనా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు ఇప్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో విషయాన్ని లేవనెత్తి రెండు, మూడు నెలల్లో చెల్లించేలా కృషి చేస్తానని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని వెల్మగూడెంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో నిరుపేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి సగంలో ఆగిపోయిన ఇళ్ల బిల్లులు చెల్లించమంటే ఈ ప్రభుత్వం సాకులు చెబుతూ డబుల్, త్రిబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామంటూ దాటవేస్తుందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు దేవుడెరుగు పెండింగ్‌లో ఉన్న బిల్లులనైనా చెల్లించాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రాంతంలో కొందరు స్వప్రయోజనాలకో, వ్యక్తిగతంగానో, కసి కోసమో, కక్ష కోసమో తగవులు పెట్టడానికి చూస్తున్నారని అన్నారు. ప్రలోభాలకు లోనుకాకుండా యువత గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నాటి సీఎం ఎన్టీ రామారావును ఒప్పించి, మెప్పించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్, తాగు, సాగునీటితో పాటు 80 శాతం ఇళ్లు నిర్మాణం చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లోనెలకొల్పిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వెల్మగూడెంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాచిరెడ్డి మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ కురాకుల అంతయ్యయాదవ్, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, డీవీఎన్‌రెడ్డి, అబ్బిడి కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, నరాల కొండయ్య, నారాయణరెడ్డి, కిషన్‌రావు, సీహెచ్. వెంకటేశ్వర్లు, ఇంద్రకిరణ్, దేవేందర్‌రెడ్డి, సైదిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాఘవరెడ్డి, దినేష్‌నాయక్, సక్రు, కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.35వేలు పలికిన గణేష్ లడ్డూ
పెద్దవూర: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకుంటున్న గణనాథుల లడ్డూలు వేలంలో అధిక రేటు పలుకుతున్నాయి. మండలంలోని తుంగతూర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతపల్లి తండాలో పూజలందుకున్న వినాయక లడ్డూను వేలంలో తండాకు చెందిన జటావత్ సోమాలీరమణి రూ.35వేలకు దక్కించుకుంది. అనంతరం తండాలో ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో లడ్డూను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలోని న్యూకిడ్స్ పబ్లిక్ స్కూల్లో గణేష్ విగ్రహ నిమజ్జనంగా సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేస్తు, బాణ సంచా కాల్చుతూ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జటావత్ రవినాయక్, ఎంపీటీసీ శాంతి, బాలాజీనాయక్, హేమానాయక్, శ్రీను, భగవాన్, రాజు, మాన్యా పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణించాలి
పెద్దవూర: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక న్యూవిజన్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన జూనియర్ కళాశాలల జిల్లా స్థాయి అండర్–19 వాలీబాల్ సెలక్షన్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గెలిచే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుందని, దానిని ఎవరైతే పూర్తిగా అందుకుంటారో వారే జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వస్తపురి మల్లిక, ఎంపీడీఓ రఫీఖున్నీసా, ఎంఈఓ బి.ప్రభాకర్‌రావు, ఎస్ఐ బాడాన ప్రసాదరావు, నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మందడి నర్సిరెడ్డి, వాలీబాల్ అండర్–19 ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. దయాకర్‌రెడ్డి, పీడీలు ఎస్. నర్సింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, భీకునాయక్, అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ షేక్ అబ్బాస్, ప్రిన్సిపాల్ యాదగిరి పాల్గొన్నారు. -
ఛాంపియన్‌గా నిలిచిన కరీంనగర్ క్లస్టర్
చలకుర్తి(పెద్దవూర): మండలంలోని చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జేఎన్వీ రీజినల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో కరీంనగర్ క్లస్టర్ ఛాంపియన్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ జి.బ్రహ్మపుత్రారెడ్డి తెలిపారు. గురువారం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జేఎన్వీలకు చెందిన ఎనిమిది క్లస్టర్ల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అండర్–14, అండర్–17, అండర్–19 బాల బాలికల విభాగాల్లో మొత్తం ఆరు కేటగిరీలకు గాను ఐదింటిని కరీంనగర్ క్లస్టర్ గెల్చుకోగా, అండర్–19 విభాగంలో బెంగళూరు రూరల్ క్లస్టర్ గెలిచినట్లు తెలిపారు. బెస్ట్ ప్లేయర్స్ అవార్డులను అండర్–14 బాలుర, బాలికల విభాగంలో కరీంనగర్ క్లస్టర్‌కు చెందిన వేదానంద, మేఘనలు, అండర్–17 విభాగంలో కరీంనగర్ క్లస్టర్‌కు చెందిన ఎం. సుమంత్, హర్షితలు, అండర్–19 బాలుర విభాగంలో బెంగళూరు రూరల్ క్లస్టర్‌కు చెందిన కిరణ్, బాలికల విభాగంలో కరీంనగర్ క్లస్టర్‌కు చెందిన సాయిదీపికలు గెల్చుకున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మందిని జాతీయ స్థాయి పోటీల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు సెప్టెంబర్ 5వ తేదీ వరకు చలకుర్తిలోనే శిక్షణ నివ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూరై్తన తర్వాత సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గుజరాత్‌లోని కేడాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. -
ఎండుతున్న పంటలు
పెద్దవూర: వర్షాభావ పరిస్థితులతో మండలంలోని పత్తి, కంది, పెసర పంటలు వాడుబట్టి ఎండిపోతున్నాయి. రూ. వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు వర్షాలు లేక కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం పత్తి పంటను సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రచారం చేసినా మండల రైతులు దాని వైపే ఆసక్తి కనపర్చారు. జూన్‌లో సక్రమంగా వర్షాలు పడటంతో మండలంలో రైతులు 30వేల ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు విత్తారు. పత్తి చేలలో అంతరకృషి చేపట్టారు. పదిహేను రోజుల తర్వాత ఒక మోస్తారు వర్షం పడటంతో రైతులు పంట ఎదుగుదలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కాంప్లెక్స్ ఎరువులు, క్రిమి సంహారక మందులను పిచికారి చేశారు. కాని నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి, కంది, పెసర చేలు, బత్తాయి తోటలు వాడుబట్టి ఎండిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఎండిన పెద్దవాగు.. ఆందోళనలో రైతులు మండలంలో ఎప్పుడు అన్ని కాలాల్లో నీటితో కళకళలాడే పెద్దవాగు ఎండిపోయింది. దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 11ఏళ్లలో ఏనాడు వాగు ఎండిపోయిన దాఖలాలు లేవు. ఈ యేడాది వర్షాలు ఆశించిన మేర కురవక పోవడంతో భూములు పూర్తిగా తడిసి నీరు బయటకు వెళ్లిన పాపాన పోలేదు. పడిన వర్షాల వల్ల విత్తనాలు వేసుకోవడానికి కావాల్సిన పదును మాత్రమే అయ్యింది. వరదలు రాకపోవడంతో నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీలోనే ఉంది. వందల ఎకరాల్లో సాగు: పెద్దవాగు నాంపల్లి మండలం పసునూరు చెరువు వద్ద పుట్టి గుర్రంపోడ్, పీఏపల్లి మండలాల మీదుగా పెద్దవూర మండలంలోనికి ప్రవహిస్తుంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణం కాకమునుపు వర్షాకాలంలోనే ఈ వాగులో నీరు ప్రవహించేది. ప్రాజెక్టు నిర్మాణంతో కాలువల ద్యారా ఎప్పటికప్పుడు చెరువులను నింపుతుండటం, జంటనగరాలకు కృష్ణాజలాలలను అందించే వాటర్ ప్లాంటును పదిహేను రోజుల కొకసారి కడుగుతుంటుండంతో నిత్యం నీళ్లు ప్రవహిస్తుంటాయి. దీంతో ఎప్పుడు నీరు ప్రవహిస్తుండంతో వాగు సమీపంలో భూములు ఉన్న రైతులు వాగులో విద్యుత్ మోటార్లు వేసుకుని పైపులైన్లు తీసుకుని సాగుచేసుకుంటున్నారు. మండలంలోని పెద్దవూర, ఈదులగూడెం, పిన్నవూర, బట్టుగూడెం, కొత్తగూడెం, తెప్పలమడుగు, లింగంపల్లి, పెద్దగూడెం, చిన్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు వాగువెంట వరినాట్లు వేశారు. వాగును నమ్ముకుని వాగుకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములకు పైపులైన్లు వేసుకుని బత్తాయి తోటలు, పత్తి పంటను సాగుచేస్తున్నారు. వాగు ఎండిపోవడంతో వాగును నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని వాగు వెంట కొందరు వరి నాట్లు వేయగా, మరొకొంత మంది నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. గత నెల రోజులుగా సరైన వర్షాలు పడకపోవడంతో వరి, పత్తి, బత్తాయి తోటలను కాపాడుకోవటానికి నీరు సరిపోవడం లేదు. నీరు రాకపోవడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాగులో ఊరే నీళ్లు విద్యుత్ రాగానే అంతా ఒకేసారి మోటార్లు పెట్టుతుండటంతో చుక్క నీరు ఉండటం లేదు. కేవలం పెద్ద పెద్ద గుంతలు తీసుకుని మోటార్లు వేసుకున్న రైతులకు మాత్రమే అంతోకొంత నీరు అందుతుంది. పాలకులు, అధికారులు స్పందించి ఏఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల రైతులు వేడుకుంటున్నారు. వాగును నమ్ముకుని సాగుచేస్తున్నాం– పబ్బు యాదగిరి, రైతు పెద్దవూర వాగులో నిత్యం నీళ్లు వస్తుండటంతో వాగును నమ్ముకుని బత్తాయి తోటను సాగుచేస్తున్నాను. సరైన వర్షం పడకపోవడంతో ఈ సంవత్సరం వాగులో ఒక్కసారి కూడా నీళ్లు పారలేదు. వాటర్ ప్లాంటును శుభ్రం చేయగా వచ్చే వృథానీరు పదిహేను రోజులకు ఒకసారి వస్తాయి. ఈ నీటితోనే ఇన్ని రోజులు నెట్టుకొస్తున్నాము. వాగువెంట మోటార్లు ఎక్కువ సంఖ్యలో వేయటంతో వాగు ఎగువ భాగంలో ఉన్న రైతులకే ఆ నీళ్లు సరిపోతలేవు. బత్తాయి చెట్లు ఎండిపోయే పరిస్థితి ఉంది. -
మామిడి తోట దగ్ధం
పెద్దవూర: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మామిడి తోట దగ్ధమైన సంఘటన శనివారం మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వంగాల నారాయణరెడ్డి 12 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు తోటకు నిప్పంటుకుంది. దీంతో తోటలలోని నాలుగు సంవత్సరాల వయస్సున్న 700 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. అలాగే డ్రిప్‌లు, పైపులు కాలిపోయాయి. హాలియా ఫైర్‌స్టేషన్‌కు ఫోన్ చేసినా కలువకపోవడంతో అక్కడ ఉన్న రైతులు బైక్‌పై వెళ్లి ఊట్లపల్లి పుష్కరఘాట్‌లో ఫైరింజన్‌ను తీసుకువచ్చి మంటలను ఆర్పేలోపే తోట అంతటికి మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు రూ.3 లక్షల నష్టం సంభవించినట్లు బాధిత రైతు వాపోయాడు. -
రోడ్డుకు మరమ్మతులు కరువు
పెద్దవూర : మండలంలోని ఊట్లపల్లి ఘాట్‌కు పుష్కర స్నానాలకు వెళ్లేందుకు గాను భక్తుల సౌకర్యార్థం పోతునూరు–పులిచర్ల రోడ్డు వెంట పెరిగిన కంపచెట్లను తొలగించి మట్టిపోశారు. కానీ రోలింగ్ మరిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వాస్తవానికి ఈ రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం పుష్కర నిధులు మంజూరు చేయలేదు. మండల కేంద్రంతోపాటు చాలా గ్రామాల ప్రజలకు ఊట్లపల్లి ఘాట్‌కు పోవటానికి పోతునూరు–పులిచర్ల రోడ్డు అనువైనది. దీంతో అధికారులు 14 ఫైనాన్స్ నిధుల నుంచి కంపచెట్లను తొలగించి రోడ్డును మరమ్మతులు చేయించాలని సర్పంచ్‌లను ఆదేశించారు. దీంతో పులిచర్ల, పోతునూరు సర్పంచ్‌లు రోడ్డుకు ఇరువైపులా మట్టిని పోశారు. కాని మట్టిని రోలింగ్ చేయటం మరిచిపోయారు. అసలే సింగిల్ రోడ్డు. ఆపై ఎదురుగా వాహనం వస్తే తప్పనిసరిగా రోడ్డు వాహనం కిందికి దిగాల్సిందే. మట్టిని పోసి రోలింగ్ చేయకపోవడం వలన రోడ్డు దిగితే టైర్లు స్లిప్ అయ్యి కింద పడిపోతున్నాయి. వర్షాలు వస్తే ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు నరకం కనిపించటం ఖాయం. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు వెంట పోసిన మట్టిని రోలింగ్ చేయించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. -
స్ప్రేయర్లను భద్రపర్చండి ఇలా..
పెద్దవూర : జిల్లాలో అడపాదడపా వర్షాలు పడుతుండడంతో రైతులు పంట చేల ఎదుగుదల కోసం కాంప్లెక్స్(అడుగు మందులు) ఎరువులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో పంటచేలకు సోకే చీడ పీడల నివారణ కోసం క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలి. క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటానికి గాను రైతులు రకరకాల స్ప్రేయర్లను ఉపయోగిస్తుంటారు. పంటకాలంలో వాటితో పని ముగియగానే అలాగే వదిలేస్తారు. తర్వాత పంట కాలం అవసరం రాగానే స్ప్రేయర్లను మళ్లీ వాడుకలోకి తేవటం పరిపాటిగా మారింది. అప్పుడు స్ప్రేయర్లు పనిచేయక మెకానిక్‌ల వద్దకు పరిగెత్తడం సర్వసాధారణం. డబ్బులు వెచ్చించి రిపేరు చేయడం కన్నా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వృథా ఖర్చులు తగ్గిపోవడంతో పాటు స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెబుతున్నారు మండల వ్యవసాయ అధికారిణి, మూడ్ పార్వతిచౌహాన్. చేతి (హ్యాండ్) స్ప్రేయర్ల విషయంలో.. మందుల పిచికారీ పూర్తి కాగానే శుభ్రమైన నాలుగు లీటర్ల మంచినీటిని ట్యాంకులో పోసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తర్వాత స్ప్రేయర్ గొట్టం (ఇత్తడి) తీసి దానికి ఇంజిన్ ఆయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్‌లు, రాడ్ల వద్ద ఇంజిన్ ఆయిల్ పూయడం వలన తుప్పు రాకుండా ఉంటుంది. ఏడాది తర్వాత తీసి వాడినా బాగా పనిచేస్తుంది. పవర్ స్ప్రేయర్.. మందుల పిచికారీ సమయం ముగియగానే పవర్ స్ప్రేయర్‌ను మంచినీటితో శుభ్రం చేయాలి. ట్యాంకులో పెట్రోల్ లేకుండా చూసుకోవాలి. టర్బోరేటర్ గిన్నెలోనూ పెట్రోలు లేకుండా చేయాలి. ప్లగ్ తీసి శుభ్రంగా పెట్రోలుతో కడగాలి. పిస్టన్‌పై 5, 6 చుక్కల ఇంజిన్ ఆయిల్ వేసి ప్లగ్‌ను బిగించాలి. ఇలా చేస్తే పిస్టన్ పాడైపోకుండా ఉంటుంది. మళ్లీ అవసరం ఉన్నప్పుడు పంప్ మొరాయించకుండా వెంటనే స్టార్టవుతుంది. తైవాన్ స్ప్రేయర్లు.. తైవాన్ స్ప్రేయర్ ట్యాంకులో ఐదు లీటర్ల మంచినీరు పోయాలి. ఇంజిన్ స్టార్ట్ చేసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. ఇలా చేయడం వలన పైపుతోపాటు నాజిల్ మలినాలు లేకుండా శుభ్రం అవుతుంది. ట్యాంకులో పెట్రోలు లేకుండా తీయాలి. ప్లగ్‌ను తీసి పిస్టన్‌పై ఐదు చుక్కల ఇంజిన్ ఆయిల్ వేసి ప్లగ్ బిగించాలి. పంపు భాగాలన్నింటిని శుభ్రంగా తుడిచి భద్రపర్చాలి. హైటెక్ స్పేయర్లు.. ట్యాంకులో మూడు లీటర్ల నీటిని పోసి శుభ్రంగా నాజిల్ ద్వారా బయటకు పంపి శుభ్ర పర్చాలి. పంపును తలకిందులుగా ఉంచి బుష్‌లు ఉన్నచోట గొట్టం వద్ద ఇంజిన్ ఆయిల్ చుక్కలు వేసి పూయాలి. రీచార్జబుల్ స్పేయర్లు.. పనులు పూర్తయిన వెంటనే మూడు లీటర్ల నీటిని ట్యాంకులో పోసి బయటకు పంపాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి గంటపాటు చార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వలన బ్యాటరీ డీచార్జ్ కాకుండా ఉంటుంది. మరుసటì యేడాది సైతం మెకానిక్ అవసరం లేకుండా పనిచేస్తుంది. అన్నదాతలు ఈ విషయాలను పాటించి తమ పంపు స్ప్రేయర్లను భద్రపర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. -
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
ఊట్లపల్లి(పెద్దవూర): కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఊట్లపల్లి పుష్కరఘాట్‌ను పరిశీలించి మాట్లాడారు. పుష్కరఘాట్లలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చాలని సూచించారు. ఇప్పటి వరకు 95 శాతం పనులు పూరై్తనట్లు మరో రెండు రోజుల్లో మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తామని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రఫిఖున్నీసా, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సీసీ శివశంకర్, కార్యదర్శి విజయ్‌కుమార్, గుత్తేదారులు మేరెడ్డి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
పుష్కరఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్
ఊట్లపల్లి(పెద్దవూర): మండలంలోని ఊట్లపల్లి పుష్కరఘాట్‌ను బుధవారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. పుష్కరఘాట్ నిర్మాణ పనులను జూలై 25 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంకా పూర్తి చేయకపోవడం పట్ల గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా పనుల వారిగా విభజించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఘాట్‌కు వచ్చే భక్తులకు బావి నుంచి కాకుండా 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న నది బ్యాక్ వాటర్ నుంచి పైపుల ద్వారా నీటిని తీసుకువచ్చి షవర్ బాత్కు అనుసందానించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేవిధంగా చూడాలని సంబంధిత ఎస్ఈని ఫోన్లో ఆదేశించారు. విద్యుత్ దీపాలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. నాగార్జునసాగర్‌కు రద్దీ ఎక్కువైతే ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఊట్లపల్లి పుష్కరఘాట్‌కు పంపించే యోచనలో ఉన్నట్లు దీనికి అనుగుణంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ఘాట్ల వద్దనే ఉండి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరిత గతిన పూర్తి చేయటానికి కృషి చేయాలని అన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి, డిండి రిజర్వాయక్ డిప్యూటీ కలెక్టర్, ఘాట్ ప్రత్యేక అధికారి ప్రభాకర శ్రీనివాసన్, ఐబీ ఎస్ఈ ధర్మానాయక్, తహసీల్దార్ పాండునాయక్, ఎంపీడీఓ రఫిఖున్నీసా, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏపీఓ గోపాల్‌రెడ్డి, మేరెడ్డి జైపాల్‌రెడ్డి, గడ్డంపల్లి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో మావోల ప్రాభల్యం లేదు
పెద్దవూర : జిల్లాలో మావోయిస్టుల ప్రాభల్యం లేదని ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ అన్నారు. మంగళవారం ఆయన పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, క్రైం రేటు, సిబ్బంది వివరాలను తెలుసుకుని పోలీస్ స్టేషన్ భవనం, క్వార్టర్లను పరిశీలించారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండటానికి గాను గ్రామాల్లో జనమైత్రి పోలీస్‌లను నియమించినట్లు తెలిపారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. జిల్లాలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగరాదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే బెల్టు దుకాణాలు, సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సారా, అక్రమ మద్యం విక్రేతలను కనీసం రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేయాలన్న తలంపుతో ఉన్నట్లు పేర్కొన్నారు. యువతకు ఓరియంటేషన్ గ్రామాల్లోని యువతను సన్మార్గంలో నడిపించేందుకు కళాజాత కార్యాక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 150 మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు పోటీ పరీక్షలపై తనతోపాటు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, తహసీల్దార్లతో ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించినట్లు వివరించారు. సబ్ డివిజన్ స్థాయిలో ఈ తరగతులు ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు రూపొందించామని, హరితహారం కార్యక్రమం ముగియగానే మిర్యాలగూడెం సబ్ డివిజన్లో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించటానికి గ్రాడ్యుయేట్ల పేర్లను సైతం నమోదు చేసినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ, జనమైత్రి కార్యక్రమంలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సాహక బహుమతులతో పాటు రివార్డును అందిస్తామన్నారు. అలాగే పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రయోగాత్మకంగా షీ టీములు జిల్లాలో ప్రయోగాత్మకంగా రెండు షీ టీములు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రహస్యంగా 25 నుంచి 30 షీ టీములు పనిచేస్తున్నట్లు తెలిపారు. బాలికల కళాశాలలు, పాఠశాలకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తారని అన్నారు. సిబ్బంది కొరతతో పోలీసులకు వారాంతపు సెలవులు సమస్యగా మారాయని, ప్రణాళిక ప్రకారం విధులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని అన్నారు. ఆయన వెంట మిర్యాలగూడెం డీఎస్పీ గోనె సందీప్, హాలియా సీఐ కె.పార్థసారథి, ఎస్ఐ బి. ప్రసాదరావులు ఉన్నారు. -
పింఛన్ కోసం ఆందోళనలు
పెద్దవూర : మేమంతా నిరు పేదలం .. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ ఎందుకు మంజూరు చేయడం లేదంటూ సోమవా రం జిల్లాలో వృద్ధులు, వికలాంగులు, విత ంతువులు ఆందోళనకు దిగారు. సూర్యాపేటలో నిరాహార దిక్షలు చేయగా, జిల్లా కేం ద్రంలో కలెక్టరేట్లో బైఠాంచారు. పెద్దవూరలో ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పిం ఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయం టూ టీఆర్ఎస్ నాయకులు ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగి చివరకు కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగా రు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్పాటి కొమరయ్య, జిల్లా నాయకుడు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకంలో అధికారులు అనర్హులకు పింఛన్లు మం జూ రు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కాంగ్రెస్ ఏజెంట్‌లాగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. అనర్హులను తొల గిం చటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిం చారు.ప్రభుత్వ బృహత్తర కార్యక్రమం అరు లకు కాకుండా అనర్హులకు అందుతున్నాయని ఎంపీడీఓను కలవటానికి వస్తే మీకు మాట్లాడరాదని చెప్పడం దురహం కారానికి నిదర్శనమని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యాలయం అని బోర్డు పెట్టుకుంటే ప్రజలు, ఇతర పా ర్టీల నాయకులు ఎవరూ రారని ఎద్దేవా చేశారు. అనర్హుల జాబితా తీసుకుని వస్తే ఎంపీడీఓ సరైన సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లమంటూ కులం పేరుతో దూషించాడని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు చేరేందుకు మాత్రమే కార్యాలయానికి తాళం వేసి ఎంపీడీఓ, సిబ్బందిని బయటకు పంపి ంచాము తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని నినదించారు. కులంపేరుతో దూషించిన ఎంపీడీవోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నడ్డి లింగయ్యయాదవ్, చిలుముల సులోచన, తేరా శ్రీకాంత్‌రెడ్డి, సుంకిరెడ్డి సంజీవరెడ్డి, నడ్డి లక్ష్మ య్య, నడ్డి సత్యం, రమావత్ రవినాయక్, జానపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీడీఓపై అట్రాసిటీ కేసు కులం పేరుతో దూషించాడనే అభియోగంతో పెద్దవూర ఎంపీడీఓ పి.మహేందర్‌రెడ్డిపై సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఇండ్ల వెంకటయ్య తెలిపారు. ఆసరా పథకంలో పింఛన్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై అడగటానికి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి తెల్పాటి కొమరయ్యను ఎంపీడీఓ దూషించాడని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వివరించారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి రాంనగర్: ‘మేమంతా నిరు పేదలం .. కొంత మంది వంద శాతం వైకల్యం కలిగినవారు ఉన్నారు .. మూడు నాలుగు సార్లు పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నాం .. ఇంకా ఎన్ని సార్లు దరఖాస్తులు చేసుకోవాలి’ అని పలువురు వికలాం గులు, వృద్ధులు కల్టెరేట్‌లోని సమావేశ మందిరం వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలడవలేని వాళ్లం ఎన్ని సార్లు అధికారుల చుట్టూ ఎలా తిరగాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని డీఆర్ఓ నిరంజన్ అక్కడికి వచ్చి చెప్పగానే తీవ్రంగా స్పందించారు. తాము ఇంకా ఎన్ని సార్లు దరఖాస్తులు చేసుకోవా లి, ఇక్కడ సమాధానం చెప్పేవారు కూడాలేరు, పింఛన్ రాకుంటే తాము ఎలా బతకాలి అని ప్రశ్నించారు. దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేసి నిరసన తెలి పారు. అర్హులైన వారికి తప్పకుండా పింఛన్లు ఇస్తామని డీఆర్డీఏ అధికారులు హా మీ ఇవ్వడంతో ఆందోళనను విరమిం చారు. కార్యక్రమంలో చింతల సైదులు, వెంకన్న, ఎల్లయ్య, శ్రీను, పుల్లయ్య, సైద మ్మ తదితరులు పాల్గొన్నారు. పింఛన్లు ఇవ్వాలని నిరాహార దీక్ష చివ్వెంల: అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు ఇవ్వాలని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎంపీడీఓ ఎం.సాంబశివరా వు, తహసీల్దార్ జి.గణేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మా ట్లాడే క్రమంలో వాగ్వాదం జరిగింది. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామ ని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి రమేష్, వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ యూత్ మండల అధ్యక్షుడు ఎండీ రఫీ,విద్యార్థి సంఘాల నాయకులు రాము, సిరపంగి నాగరాజుమద్దతు తెలిపారు. -
పంచాయతీలుగా 239 తండాలు
పెద్దవూర మండలంలోనే ఎక్కువ తండాలు పంచాయతీలుగా మారనున్నాయి. ఈ మండలంలో సుమారు 45 గిరిజన తండాలు ఉండగా ప్రస్తుతం 23 తండాలు పంచాయతీలు కానున్నాయి. జిల్లాలో 38 మండలాల్లోనే తండాలు పంచాయతీలుగా మారే అవకాశం ఉంది. కొన్ని మండలాల్లో తండాలు లేకపోవడంతోపాటు మరికొన్నింటిలో ఒక్కొక్క తండా కూడా ఉన్నాయి. వేములపల్లి, నాంపల్లి, అర్వపల్లి, ఆలేరు, చౌటుప్పల్, మునగాల, నడిగూడెం మండలాల్లో ఒక్కొక్క తండా గ్రామపంచాయతీగా మారనుంది. అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేస్తామని గత పాలకులు ఇచ్చిన ఎన్నో హామీలు కాలంతో పాటే కరిగిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీ అర్హత గల తండాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని గ్రామీణ అభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ 2014 జూలై 23వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. దాంతో 500 జనాభా కలిగి ఉండి, పంచాయతీకి 2 నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న తండాలపై సమగ్ర సర్వే నిర్వహించిన జిల్లా యంత్రాంగం 239 తండాలను గుర్తించింది. కాగా ఈ నెల 15 తేదీ లోగా పంచాయతీల ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నప్పటికీ సమగ్ర కుటుంబ సర్వే కారణంగా ఆలస్యమైంది. దీంతో సోమవారం జిల్లా పంచాయతీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యారు. పెరగనున్న పంచాయతీలు.. 500 మంది జనాభాతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు గిరిజన తండాలను పంచాయతీలుగా గురిస్తే జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుతం జిల్లాలో 1176 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గుర్తించిన 239 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే వీటి సంఖ్య 1415 కానుంది. అదే విధంగా పంచాయతీలలో గిరిజన తండాల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. జిల్లాలో మొత్తం గిరిజన తండాలు 905. వీటిలో 324 తండాలు గతంలోనే పంచాయతీలుగా గుర్తించారు. కొత్తగా మరో 239 తండాలు పంచాయతీలుగా ఏర్పడితే జిల్లాలోని 1415 పంచాయతీలలో 563తండాలు పంచాయతీలుగా కానున్నాయి. సర్వేలో సేకరించిన వివరాలు గుర్తించిన గిరిజన తండా ఏ మండలం, ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గిరిజన తండాలోని జనాభా వివరాలు. గ్రామ పంచాయతీగా గుర్తించడానికి ప్రతిపాదించే తండాల సంఖ్య. పస్తుత గ్రామ పంచాయతీకి తండా ఎంత దూరంలో ఉంది. గిరిజన తండాకు ఏ గ్రామ పంచాయతీగా గుర్తించాలో పేరు ప్రతిపాదన. గ్రామ పంచాయతీ నుంచి తండాను తొలగించగా అక్కడ ఉన్న జనాభా వివరాలు.