రూ.35వేలు పలికిన గణేష్‌ లడ్డూ | ganesh laddu rate is 35 thounsands | Sakshi
Sakshi News home page

రూ.35వేలు పలికిన గణేష్‌ లడ్డూ

Published Sat, Sep 10 2016 8:27 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

రూ.35వేలు పలికిన గణేష్‌ లడ్డూ - Sakshi

రూ.35వేలు పలికిన గణేష్‌ లడ్డూ

పెద్దవూర: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకుంటున్న గణనాథుల లడ్డూలు వేలంలో అధిక రేటు పలుకుతున్నాయి. మండలంలోని తుంగతూర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతపల్లి తండాలో పూజలందుకున్న వినాయక లడ్డూను వేలంలో తండాకు చెందిన జటావత్‌ సోమాలీరమణి రూ.35వేలకు దక్కించుకుంది. అనంతరం తండాలో ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో లడ్డూను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. మండల కేంద్రంలోని న్యూకిడ్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గణేష్‌ విగ్రహ నిమజ్జనంగా  సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేస్తు, బాణ సంచా కాల్చుతూ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జటావత్‌ రవినాయక్, ఎంపీటీసీ శాంతి, బాలాజీనాయక్, హేమానాయక్, శ్రీను, భగవాన్, రాజు, మాన్యా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement