మామిడి తోట దగ్ధం | Burnt mango garden | Sakshi
Sakshi News home page

మామిడి తోట దగ్ధం

Published Sat, Aug 20 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

మామిడి తోట దగ్ధం

మామిడి తోట దగ్ధం

పెద్దవూర: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మామిడి తోట దగ్ధమైన సంఘటన శనివారం మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వంగాల నారాయణరెడ్డి 12 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు తోటకు నిప్పంటుకుంది. దీంతో తోటలలోని నాలుగు సంవత్సరాల వయస్సున్న 700 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. అలాగే డ్రిప్‌లు, పైపులు కాలిపోయాయి. హాలియా ఫైర్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసినా కలువకపోవడంతో అక్కడ ఉన్న రైతులు బైక్‌పై వెళ్లి ఊట్లపల్లి పుష్కరఘాట్‌లో ఫైరింజన్‌ను తీసుకువచ్చి మంటలను ఆర్పేలోపే తోట అంతటికి మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు రూ.3 లక్షల నష్టం సంభవించినట్లు బాధిత రైతు వాపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement