Published
Sat, Aug 6 2016 6:01 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
ఊట్లపల్లి(పెద్దవూర): కృష్ణా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఊట్లపల్లి పుష్కరఘాట్‌ను పరిశీలించి మాట్లాడారు. పుష్కరఘాట్‌లలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసి పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చాలని సూచించారు. ఇప్పటి వరకు 95 శాతం పనులు పూరై్తనట్లు మరో రెండు రోజుల్లో మిగిలి ఉన్న పనులను పూర్తి చేస్తామని అన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రఫిఖున్నీసా, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సీసీ శివశంకర్, కార్యదర్శి విజయ్‌కుమార్, గుత్తేదారులు మేరెడ్డి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.