ప్రచారంలో మాట్లాడుతున్న కుందూరు జానారెడ్డి
సాక్షి, పెద్దవూర : నియంతలా వ్యహరిస్తున్న కేసీఆర్‌ను చిత్తుగా ఓడించాలని సీఎల్‌పీ మాజీ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చలకుర్తి, సంగారం, ముసలమ్మచెట్టు, బట్టుగూడెం, పెద్దవూర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మాటల గారడీతో నాడు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు డబ్బుల మూటలతో మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్ ప్రజలను బాగుపెట్టడానికి కాదని తన కుటుంబాన్ని స్వర్ణయుగం చేసుకోవడానికే అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అవస్థల పాలైంది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. గత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే టీఆర్‌ఎస్ పేర్లు మార్చి ఏదో గొప్ప చేశామని జబ్బలు చర్చుకుంటుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ చర్యలు విపరీతంగా ఉంటాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజలను రక్షించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడి హద్దుమీరిన అహంకార పూరితుడై నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపడానికే ఉత్తర, దక్షిణాలుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రజాకూటమిగా ఏర్పాడినట్లు తెలిపారు. జానారెడ్డి అంటే అన్ని కులాలు, మతాల వాడని అన్నారు.
ఓట్ల కోసం కులాల పేరుతో రెచ్చగొట్టి ఊర్ల పేర్లు, బజార్లు తెలియని వారు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, రూ.3వేల నిరుద్యోగ భృతి, ఉచితంగా 7 కిలోల సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కడారి అంజయ్యయాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, జానా తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రమావత్ శంకర్‌నాయక్, అబ్బిడి కృష్ణారెడ్డి, కూరాకుల అంతయ్య, గడ్డంపల్లి వినయ్‌రెడ్డి, కర్న దామోదర్‌రెడ్డి, పబ్బు యాదగిరిగౌడ్, కర్నాటి పద్మారెడ్డి, నర్సింహారెడ్డి, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ కత్తి రమణమ్మవెంకట్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వెంకటయ్య, టీడీపీ నాయకులు దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, బాబురావునాయక్ పాల్గొన్నారు.
జానా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక:
మండలంలోని చలకుర్తి, నీమానాయక్‌తండా, కుంకుడుచెట్టుతండా, మల్లేవానికుంటతండా, రామ్మూర్తికాలనీ, బట్టుగూడెం, సంగారం గ్రామాలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నుంచి సీఎల్‌పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీలో చేరిన వారిలో తుమ్మలపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గోదాసు నారాయణరెడ్డి, సర్థార్‌నాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment