పెద్దవూర : మేమంతా నిరు పేదలం .. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ ఎందుకు మంజూరు చేయడం లేదంటూ సోమవా రం జిల్లాలో వృద్ధులు, వికలాంగులు, విత ంతువులు ఆందోళనకు దిగారు. సూర్యాపేటలో నిరాహార దిక్షలు చేయగా, జిల్లా కేం ద్రంలో కలెక్టరేట్‌లో బైఠాంచారు. పెద్దవూరలో ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పిం ఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయం టూ టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగి చివరకు కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగా రు.
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్పాటి కొమరయ్య, జిల్లా నాయకుడు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకంలో అధికారులు అనర్హులకు పింఛన్లు మం జూ రు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కాంగ్రెస్ ఏజెంట్‌లాగా పనిచేస్తున్నాడని ఆరోపించారు. అనర్హులను తొల గిం చటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిం చారు.ప్రభుత్వ బృహత్తర కార్యక్రమం అరు లకు కాకుండా అనర్హులకు అందుతున్నాయని ఎంపీడీఓను కలవటానికి వస్తే మీకు మాట్లాడరాదని చెప్పడం దురహం కారానికి నిదర్శనమని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యాలయం అని బోర్డు పెట్టుకుంటే ప్రజలు, ఇతర పా ర్టీల నాయకులు ఎవరూ రారని ఎద్దేవా చేశారు.
అనర్హుల జాబితా తీసుకుని వస్తే ఎంపీడీఓ సరైన సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లమంటూ కులం పేరుతో దూషించాడని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు చేరేందుకు మాత్రమే కార్యాలయానికి తాళం వేసి ఎంపీడీఓ, సిబ్బందిని బయటకు పంపి ంచాము తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని నినదించారు. కులంపేరుతో దూషించిన ఎంపీడీవోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు నడ్డి లింగయ్యయాదవ్, చిలుముల సులోచన, తేరా శ్రీకాంత్‌రెడ్డి, సుంకిరెడ్డి సంజీవరెడ్డి, నడ్డి లక్ష్మ య్య, నడ్డి సత్యం, రమావత్ రవినాయక్, జానపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎంపీడీఓపై అట్రాసిటీ కేసు
కులం పేరుతో దూషించాడనే అభియోగంతో పెద్దవూర ఎంపీడీఓ పి.మహేందర్‌రెడ్డిపై సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఇండ్ల వెంకటయ్య తెలిపారు. ఆసరా పథకంలో పింఛన్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై అడగటానికి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన టీఆర్‌ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి తెల్పాటి కొమరయ్యను ఎంపీడీఓ దూషించాడని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వివరించారు.
ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి
రాంనగర్: ‘మేమంతా నిరు పేదలం .. కొంత మంది వంద శాతం వైకల్యం కలిగినవారు ఉన్నారు .. మూడు నాలుగు సార్లు పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నాం .. ఇంకా ఎన్ని సార్లు దరఖాస్తులు చేసుకోవాలి’ అని పలువురు వికలాం గులు, వృద్ధులు కల్టెరేట్‌లోని సమావేశ మందిరం వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నలడవలేని వాళ్లం ఎన్ని సార్లు అధికారుల చుట్టూ ఎలా తిరగాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌ఓ నిరంజన్ అక్కడికి వచ్చి చెప్పగానే తీవ్రంగా స్పందించారు. తాము ఇంకా ఎన్ని సార్లు దరఖాస్తులు చేసుకోవా లి, ఇక్కడ సమాధానం చెప్పేవారు కూడాలేరు, పింఛన్ రాకుంటే తాము ఎలా బతకాలి అని ప్రశ్నించారు. దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేసి నిరసన తెలి పారు. అర్హులైన వారికి తప్పకుండా పింఛన్‌లు ఇస్తామని డీఆర్‌డీఏ అధికారులు హా మీ ఇవ్వడంతో ఆందోళనను విరమిం చారు. కార్యక్రమంలో చింతల సైదులు, వెంకన్న, ఎల్లయ్య, శ్రీను, పుల్లయ్య, సైద మ్మ తదితరులు పాల్గొన్నారు.
పింఛన్లు ఇవ్వాలని నిరాహార దీక్ష
చివ్వెంల: అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు ఇవ్వాలని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఎంపీడీఓ ఎం.సాంబశివరా వు, తహసీల్దార్ జి.గణేష్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మా ట్లాడే క్రమంలో వాగ్వాదం జరిగింది. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామ ని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి రమేష్, వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ యూత్ మండల అధ్యక్షుడు ఎండీ రఫీ,విద్యార్థి సంఘాల నాయకులు రాము, సిరపంగి నాగరాజుమద్దతు తెలిపారు.
పింఛన్ కోసం ఆందోళనలు
Published Tue, Dec 23 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement