నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది.
పెద్దవూర(నల్లగొండ): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డితోపాటు పెద్దవూర పీఏసీఎస్ చైర్మన్ తుమ్మలపల్లి శ్రీకర్‌రెడ్డి, 11 మంది సర్పంచిలు, 8మంది ఎంపీటీసీ సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో వీరందరికీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.