
బండను లాగుతున్న ఎద్దు
సాక్షి,పెద్దవూర : ప్రముఖ హీరో పవన్‌కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాలో ఉన్న ఎద్దు పందేలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాశివరాత్రి సందర్భంగా దున్న ఇద్దాస్ ఆరాధనోత్సవాలలో భాగంగా తెలుగు రాష్ట్రాల ఎద్దుల పందేలను గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. చివరిరోజైన సోమవారం నిర్వహించిన సీనియర్ సైజు విభాగంలో కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన నవనీతకృష్ణ ఎద్దులు పాల్గొన్నాయి. చివరికి ఆ ఎద్దులు 3200 అడుగుల దూరం లాగి చతుర్థ బహుమతిని గెల్చుకున్నాయి.