చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు..  | Odisha Cannibalism Duo Eats Half Burnt Human Flesh From Pyre | Sakshi
Sakshi News home page

చితిమంటలో కాలుతున్న శవాన్ని బయటకు లాగి, ముక్కలు చేసి.. అందరూ చూస్తుండగానే..

Published Thu, Jul 13 2023 9:06 PM | Last Updated on Fri, Jul 14 2023 9:03 AM

Odisha Cannibalism Duo Eats Half Burnt Human Flesh From Pyre - Sakshi

భువనేశ్వర్: పెళ్లికాని యువతి శరీర మాంసం తింటే అతీత శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో చితిలో సగం కాలిన శవాన్ని బయటకు లాగి తింటూ పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు. అంత్యక్రియలు నిర్వహించిన మృతురాలి బంధువులు చూస్తుండగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో అక్కడే వారిద్దరినీ కట్టేసి దేహశుద్ధి చేశారు. 

ఒడిశా గిరిజన ప్రాంతమైన మయూర్ భంజ్ జిల్లాలో అనాగరిక సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువతి అంత్యక్రియలను పూర్తి చేసే క్రమంలో ఆమె చితికి నిప్పు పెట్టి చితి కాలుతుండగా వారు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు.. అంతలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు చితిలో కాలుతున్న శవాన్ని బయటకు లాగారు. 

అది గమనించిన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా వారేమీ సమాధానమివ్వకుండా సగం కాలిన శవాన్ని మూడు ముక్కలు చేసి రెండు ముక్కలను తిరిగి చితిలో వేశారు. మూడో భాగాన్ని మాత్రం వారిద్దరూ పీక్కుని తింటూ మద్యం మత్తులో డాన్సులు చేశారు. అది చూసి కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. స్థానికుల సాయంతో ఇద్దరు నరమాంసాన్ని భక్షకులను స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. 

విషయం తెలుసుకుని బందసాహి పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సుందర్ మోహన్ సింగ్(53), నరేంద్ర సింగ్(25) ఇద్దరూ దగ్గర్లోని దంతుని గ్రామానికి చెందిన వారని, వీరిలో సుందర్  చేతబడులు చేస్తుంటాడని అదే మూఢ నమ్మకంతో పెళ్లికాని యువతి మాంసం తింటే అతీత శక్తులు వస్తాయని మత్తు ప్రభావంలో సగం కాలిన శవాన్ని తినే పనికి పాల్పడ్డాడరని తెలిపారు. 

ఇది కూడా చదవండి: లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement