sorcery
-
చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు..
భువనేశ్వర్: పెళ్లికాని యువతి శరీర మాంసం తింటే అతీత శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో చితిలో సగం కాలిన శవాన్ని బయటకు లాగి తింటూ పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు. అంత్యక్రియలు నిర్వహించిన మృతురాలి బంధువులు చూస్తుండగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడటంతో అక్కడే వారిద్దరినీ కట్టేసి దేహశుద్ధి చేశారు. ఒడిశా గిరిజన ప్రాంతమైన మయూర్ భంజ్ జిల్లాలో అనాగరిక సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువతి అంత్యక్రియలను పూర్తి చేసే క్రమంలో ఆమె చితికి నిప్పు పెట్టి చితి కాలుతుండగా వారు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు.. అంతలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు చితిలో కాలుతున్న శవాన్ని బయటకు లాగారు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా వారేమీ సమాధానమివ్వకుండా సగం కాలిన శవాన్ని మూడు ముక్కలు చేసి రెండు ముక్కలను తిరిగి చితిలో వేశారు. మూడో భాగాన్ని మాత్రం వారిద్దరూ పీక్కుని తింటూ మద్యం మత్తులో డాన్సులు చేశారు. అది చూసి కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. స్థానికుల సాయంతో ఇద్దరు నరమాంసాన్ని భక్షకులను స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. విషయం తెలుసుకుని బందసాహి పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సుందర్ మోహన్ సింగ్(53), నరేంద్ర సింగ్(25) ఇద్దరూ దగ్గర్లోని దంతుని గ్రామానికి చెందిన వారని, వీరిలో సుందర్ చేతబడులు చేస్తుంటాడని అదే మూఢ నమ్మకంతో పెళ్లికాని యువతి మాంసం తింటే అతీత శక్తులు వస్తాయని మత్తు ప్రభావంలో సగం కాలిన శవాన్ని తినే పనికి పాల్పడ్డాడరని తెలిపారు. ఇది కూడా చదవండి: లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి.. -
దాడి చేసిన ఎనిమిది మంది రిమాండ్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): బాణామతి, చేతబడి చేశారంటూ చెట్టుకు వేలాడదీసి దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది నేరస్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సంగారెడ్డి డీఎస్పీ రవీంద్ర రెడ్డి తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ నవీన్ కుమార్ వెల్లడించారు. చేతబడి నెపంతో దాయాదులు తమపై దాడి చేశారని ముత్తంగి అమృత భర్త యాదయ్య ఈ నెల 17న ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా కొల్కూరు గ్రామానికి చెందిన ఎనిమిది మంది దాయాదులు ముత్తంగి అమృత, వారి భర్త యాదయ్యతో పాటుగా ఫిర్యాదురాలి అక్క కోవూరి శ్యామమ్మపై దాడి చేసినట్లు తెలిసింది. విచారణ చేపట్టగా గ్రామానికి చెందిన కోహీర్ లక్ష్మణ్(ఏ1), గడ్డం పెంటయ్య(ఏ2), ముత్తంగి బాగయ్య(ఏ3), సర్గల్ల శివయ్య(ఏ4), కోవూరు శివకుమార్(ఏ5), బేగరి శివ కుమార్(ఏ6), గడ్డం శ్యామల(ఏ7), గడ్డం ఆగమ్మ (ఏ8) వారు చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో సదాశివపేట పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా వారికీ రిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగలక్ష్మి, సుదర్శన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మేకలాగా అతని తల నరికారు
తిక్రీత్: ఇరాక్‌లో ఇస్లామ్ రాజ్యం పేరిట భీతావ హం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల రాక్షసకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తిక్రీత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు తాజాగా తాంత్రిక పూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ నడి వయస్కుడిని నడిబజారులో తల నరికి చంపేశారు. ఆ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించడం బాధాకరంకాగా, ఆ దృశ్యాలను ఫొటోలు తీసి సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘డీ గెర్రీ అబూ బకర్ అల్ బ్రిటాని’గా చెప్పుకుంటున్న ఓ ఉగ్రవాది పోస్టు చేసిన రెండు ఫొటోల్లో ఒకదానిలో నడివయస్కుడు జంతువులను హలాల్చేసే మొద్దు మీద తల పెట్టి ఉండగా, నల్ల దుస్తులు ధరించిన ఉగ్రవాది 18 అంగులాల కత్తి పెకైత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు. రెండో ఫొటోలో రక్తం ఓడుతున్న ఆ వ్యక్తి మొండెం, దాని వెనకే తెగిపడిన తలకాయ కనిపిస్తోంది. చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కూడా ఎంతో మందికి సున్నీ ఉగ్రవాదులు ఇలాంటి దారుణ శిక్షలు విధిస్తున్నారు. 2003లో అమెరికా దురాక్రమణకు ముందు సద్దాం హుస్సేన్ సైన్యంలో పనిచేసిన అనేక మంది కమాండర్లు ఇప్పుడు ఇరాక్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్నారు.