మేకలాగా అతని తల నరికారు | ISIS executioner decapitates man accused of sorcery in latest act of barbarity | Sakshi
Sakshi News home page

మేకలాగా అతని తల నరికారు

Published Wed, Apr 8 2015 5:27 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

మేకలాగా అతని తల నరికారు

మేకలాగా అతని తల నరికారు

తిక్రీత్: ఇరాక్‌లో ఇస్లామ్ రాజ్యం పేరిట భీతావ హం సృష్టిస్తున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల రాక్షసకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తిక్రీత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు తాజాగా తాంత్రిక పూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ నడి వయస్కుడిని నడిబజారులో తల నరికి చంపేశారు. ఆ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించడం బాధాకరంకాగా, ఆ దృశ్యాలను ఫొటోలు తీసి సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘డీ గెర్రీ అబూ బకర్ అల్ బ్రిటాని’గా చెప్పుకుంటున్న ఓ ఉగ్రవాది పోస్టు చేసిన రెండు ఫొటోల్లో ఒకదానిలో నడివయస్కుడు జంతువులను హలాల్‌చేసే మొద్దు మీద తల పెట్టి ఉండగా, నల్ల దుస్తులు ధరించిన ఉగ్రవాది 18 అంగులాల కత్తి పెకైత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు. రెండో ఫొటోలో రక్తం ఓడుతున్న ఆ వ్యక్తి మొండెం, దాని వెనకే తెగిపడిన తలకాయ కనిపిస్తోంది.

చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కూడా ఎంతో మందికి సున్నీ ఉగ్రవాదులు ఇలాంటి దారుణ శిక్షలు విధిస్తున్నారు. 2003లో అమెరికా దురాక్రమణకు ముందు సద్దాం హుస్సేన్ సైన్యంలో పనిచేసిన అనేక మంది కమాండర్లు ఇప్పుడు ఇరాక్‌లోని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement