decapitate
-
ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు..
ఇజ్రాయెల్: తెగిపోయిన బాలుడి తలను తిరిగి అతికించి అద్భుతం సృష్టించారు ఇజ్రాయెల్ డాక్టర్లు. సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టడంతో 12 ఏళ్ల బాలుడి తల మెడ నుండి దాదాపుగా తెగిపోయింది. సుదీర్ఘంగా సాగిన సర్జరీ విజయవంతమైనా డాక్టర్లు ఆ బాలుడు డిస్చార్జి అయ్యేంత వరకు విషయం బయటకు చెప్పలేదు. 12 ఏళ్ల సులేమాన్ హాసన్ సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడి తలభాగం మెడ నుండి వేరయింది. వెన్ను భాగానికి పుర్రె వేలాడుతూ ఉంది. వెంటనే బాలుడిని హదస్స త్ మెడికల్ సెంటరుకు తరలించగా అక్కడి డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ప్రారంభించారు. హదస్స త్ మెడికల్ సెంటరులోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒహాడ్ ఎయినావ్ తెలిపిన వివరాల ప్రకారం బాలుడు అడ్మిట్ అయ్యే సమయానికి అతడి తల మొండెం దాదాపుగా వేరయ్యాయి.. బ్రతికే అవకాశం కూడా 50% మాత్రమే. దీన్ని బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్ లోకేషన్ గా పిలుస్తుంటాం. బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే మేము సర్జరీ ప్రారంభించాము. బాలుడుని బ్రతికించడానికి మా బృందం ఆపరేషన్ థియేటర్లో చాలా గంటలపాటు శ్రమించాము. చివరికి తలను యధాతధంగా అతికించగలిగామని తెలిపారు. బాలుడు ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటున్నాడు. అంతటి మేజర్ సర్జరీ అయినా కూడా ఎవ్వరి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలూ, శరీర భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సంఘటన గత నెలలో జరగగా బాలుడు పూర్తిగా కోలుకున్నాక గాని ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ఉద్దేశ్యంతోనే గుప్తంగా ఉంచామన్నారు ఆసుపత్రి సిబ్బంది. బాలుడిని డిశ్చార్జి చేసే రోజున డాక్టర్లు ఆ బాలుడితో ఫోటో తీసుకుని విషయాన్ని వివరించారు. ఇది కూడా చదవండి: Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్.. -
వాంతి వస్తోందని తల బయటపెట్టడంతో...!
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న 11 ఏళ్ల బాలిక తల తెగి మృతి చెందింది. కిటికీలోంచి తల బయట పెట్టడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తమన్నా తన కుటుంబసభ్యులతో కలిసి వివాహ వేడుకకు హాజరు కావడానికి బార్వాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. కాగా ఖాండ్వా-ఇండోర్ హైవేలోని రోషియా ఫాటా గ్రామ సమీపంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలోతమన్నాకు వికారంగా ఉండడంతో ఆకస్మాత్తుగా వాంతి చేసుకొనేందుకు కిటికీలోంచి తన తలను బయట పెట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్ దూసుకెళ్లడంతో బాలిక తల తెగిపడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందడంతో, కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కళ్ల ముందు కూతురు మరణించడంతో తల్లి వేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ట్రక్ డ్రైవర్‌కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: బాలికను కిడ్నాప్ చేసి బిక్షాటన, మాట వినకపోవడంతో -
ఘోరం: కిటికీలోంచి వాంతులు.. తెగిపడిన తల
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ఘటన జరిగింది. వాంతులు రావడంతో బస్సు కిటికీలో తల పెట్టగా అటు వైపు నుంచి ట్రక్కు దూసుకొచ్చింది. దీంతో ఆ పాప తల మొండెం తెగిపడింది. ఈ హఠాత్పరిణామానికి బస్సులో ఉన్న ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందు కుమార్తె మృతదేహం చూసీ ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్ వద్ద ఇండోర్-ఇచ్చాపూర్ రహదారి మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తన తల్లి, సోదరితో కలిసి బాలిక (13) ఇండోర్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మంగళవారం 9.30 సమయంలో రోషియా ఫేట్‌కు చేరుకోగానే వాంతులు వచ్చాయి. దీంతో తల్లి వెంటనే బాలికను బస్సు కిటికీలో తల పెట్టించింది. అయితే ఈలోపు అవతలి వైపు నుంచి దూసుకుంటూ వచ్చిన టక్కు పాప తలను వేగంగా ఢీకొట్టింది. దీంతో పాప మొండెం, తల వేరుపడింది. బంతి మాదిరిగా ఎగిరిపడడంతో ఈ ఘటన చూసిన వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. బస్సులో కూర్చున్న తల్లి, సోదరి నిర్ఘాంతపోయి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని లబోదిబోమని రోదించారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే పోలీసులు వచ్చి బాలిక తల, బాడీని ఒక్కచోటకు చేర్చి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తల తెగిపడినా.. బతికేవుంది..!!
రాట్చ్బురి, థాయ్‌లాండ్ : తల తెగిపడినా ఓ కోడి పెట్ట ఇంకా బతికేవుండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారం రోజులుగా ఇలా ప్రాణాల కోసం పోరాడుతున్న ఆ కోడిని వెటర్నరీ సర్జన్ దత్తత తీసుకున్నారు. మెడ ద్వారా డ్రాప్స్ రూపంలో కోడికి ఆహారం అందిస్తున్నారు. అంతేకాకుండా మరే ఇతర వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు యాంటీ బయాటిక్స్‌ను ఎక్కిస్తున్నారు. తన అందిస్తున్న చికిత్సకు కోడి బాగా స్పందిస్తున్నట్లు సర్జన్ తెలిపారు. బతకాలనే సంకల్పం కోడిలో ఉందని, అందుకే తల తెగిపడినా అది మనగలుగుతోందని అన్నారు. జంతువు దాడిలో కోడి మెడను కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, తల తెగిన కోడి ఫొటోలను నెట్టింట్లో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. -
తలకు తల ప్రతీకారం.. ఎనిమిది మందిని నరికేశారు
-
తలకు తల ప్రతీకారం.. 8 మందిని నరికేశారు
కాబూల్: అఫ్ఘానిస్తాన్ సైన్యం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తరహాలో ప్రతీకారం తీర్చుకుంది. గత శనివారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నలుగురు సైనికుల తలలను నరికివేయగా, అదో రోజు అఫ్ఘాన్ సైన్యం నలుగురు ఐఎస్ ఉగ్రవాదులను తలలను నరికివేసి ప్రతీకారం తీర్చుకుంది. అప్ఘాన్‌లోని నంగార్మర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఎనిమిది మంది ఐఎస్, అఫ్ఘాన్ సైన్యం మధ్య పరస్పర దాడుల్లో బందీలుగా చిక్కారు. ఐఎస్ ఉగ్రవాదులకు నలుగురు సైనికులు బందీలుగా దొరకగా, అఫ్ఘాన్ సైనికులకు నలుగురు ఐఎస్ ఉగ్రవాదులను బందించింది. ఐఎస్ ఉగ్రవాదులు సైనికుల తలలను నరికివేశారని తెలియగానే, అప్ఘాన్ సైన్యం అదే తరహాలో ప్రతీకారం తీర్చుకుంది. నంగార్మర్ ప్రావిన్స్‌లో అచిన్ జిల్లా గవర్నర్ గలిబ్ ముజాహిబ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అఫ్ఘాన్ సైన్యం నరికివేసిన ఐఎస్ ఉగ్రవాదుల తలలను ఓ ప్రధాన రోడ్డు పక్కన ఉంచింది. రోడ్డు పక్కన రాళ్లను ఒకదానిపై మరొకటి ఉంచి స్తంభాల్లో పేర్చి.. వాటిపై ఉగ్రవాదుల తలలను ప్రదర్శించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమారుస్తామని, అఫ్ఘాన్ సైనికులు తుపాకీలు పైకెత్తి నినాదాలు చేశారు. -
మేకలాగా అతని తల నరికారు
తిక్రీత్: ఇరాక్‌లో ఇస్లామ్ రాజ్యం పేరిట భీతావ హం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల రాక్షసకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తిక్రీత్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు తాజాగా తాంత్రిక పూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ నడి వయస్కుడిని నడిబజారులో తల నరికి చంపేశారు. ఆ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించడం బాధాకరంకాగా, ఆ దృశ్యాలను ఫొటోలు తీసి సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘డీ గెర్రీ అబూ బకర్ అల్ బ్రిటాని’గా చెప్పుకుంటున్న ఓ ఉగ్రవాది పోస్టు చేసిన రెండు ఫొటోల్లో ఒకదానిలో నడివయస్కుడు జంతువులను హలాల్చేసే మొద్దు మీద తల పెట్టి ఉండగా, నల్ల దుస్తులు ధరించిన ఉగ్రవాది 18 అంగులాల కత్తి పెకైత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు. రెండో ఫొటోలో రక్తం ఓడుతున్న ఆ వ్యక్తి మొండెం, దాని వెనకే తెగిపడిన తలకాయ కనిపిస్తోంది. చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కూడా ఎంతో మందికి సున్నీ ఉగ్రవాదులు ఇలాంటి దారుణ శిక్షలు విధిస్తున్నారు. 2003లో అమెరికా దురాక్రమణకు ముందు సద్దాం హుస్సేన్ సైన్యంలో పనిచేసిన అనేక మంది కమాండర్లు ఇప్పుడు ఇరాక్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్నారు.