
ఇజ్రాయెల్: తెగిపోయిన బాలుడి తలను తిరిగి అతికించి అద్భుతం సృష్టించారు ఇజ్రాయెల్ డాక్టర్లు. సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టడంతో 12 ఏళ్ల బాలుడి తల మెడ నుండి దాదాపుగా తెగిపోయింది. సుదీర్ఘంగా సాగిన సర్జరీ విజయవంతమైనా డాక్టర్లు ఆ బాలుడు డిస్చార్జి అయ్యేంత వరకు విషయం బయటకు చెప్పలేదు.
12 ఏళ్ల సులేమాన్ హాసన్ సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడి తలభాగం మెడ నుండి వేరయింది. వెన్ను భాగానికి పుర్రె వేలాడుతూ ఉంది. వెంటనే బాలుడిని హదస్స త్ మెడికల్ సెంటరుకు తరలించగా అక్కడి డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ప్రారంభించారు.
హదస్స త్ మెడికల్ సెంటరులోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒహాడ్ ఎయినావ్ తెలిపిన వివరాల ప్రకారం బాలుడు అడ్మిట్ అయ్యే సమయానికి అతడి తల మొండెం దాదాపుగా వేరయ్యాయి.. బ్రతికే అవకాశం కూడా 50% మాత్రమే. దీన్ని బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్ లోకేషన్ గా పిలుస్తుంటాం. బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితుల్లోనే మేము సర్జరీ ప్రారంభించాము.
బాలుడుని బ్రతికించడానికి మా బృందం ఆపరేషన్ థియేటర్లో చాలా గంటలపాటు శ్రమించాము. చివరికి తలను యధాతధంగా అతికించగలిగామని తెలిపారు. బాలుడు ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటున్నాడు. అంతటి మేజర్ సర్జరీ అయినా కూడా ఎవ్వరి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలూ, శరీర భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పారు.
ఈ సంఘటన గత నెలలో జరగగా బాలుడు పూర్తిగా కోలుకున్నాక గాని ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ఉద్దేశ్యంతోనే గుప్తంగా ఉంచామన్నారు ఆసుపత్రి సిబ్బంది. బాలుడిని డిశ్చార్జి చేసే రోజున డాక్టర్లు ఆ బాలుడితో ఫోటో తీసుకుని విషయాన్ని వివరించారు.
ఇది కూడా చదవండి: Pakistan Crisis : ఆర్ధిక సంక్షోభంతో ఆస్తులను అమ్ముకుంటున్న పాకిస్తాన్..
Comments
Please login to add a commentAdd a comment