
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న 11 ఏళ్ల బాలిక తల తెగి మృతి చెందింది. కిటికీలోంచి తల బయట పెట్టడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తమన్నా తన కుటుంబసభ్యులతో కలిసి వివాహ వేడుకకు హాజరు కావడానికి బార్వాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. కాగా ఖాండ్వా-ఇండోర్ హైవేలోని రోషియా ఫాటా గ్రామ సమీపంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలోతమన్నాకు వికారంగా ఉండడంతో ఆకస్మాత్తుగా వాంతి చేసుకొనేందుకు కిటికీలోంచి తన తలను బయట పెట్టింది.
అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్ దూసుకెళ్లడంతో బాలిక తల తెగిపడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందడంతో, కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కళ్ల ముందు కూతురు మరణించడంతో తల్లి వేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ట్రక్ డ్రైవర్‌కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: బాలికను కిడ్నాప్ చేసి బిక్షాటన, మాట వినకపోవడంతో