
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సియోని జిలాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: రోడ్డుపై గోనె సంచి కదిలింది.. ఏంటాని చూస్తే!..
Comments
Please login to add a commentAdd a comment