భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర ఘటన జరిగింది. వాంతులు రావడంతో బస్సు కిటికీలో తల పెట్టగా అటు వైపు నుంచి ట్రక్కు దూసుకొచ్చింది. దీంతో ఆ పాప తల మొండెం తెగిపడింది. ఈ హఠాత్పరిణామానికి బస్సులో ఉన్న ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కళ్ల ముందు కుమార్తె మృతదేహం చూసీ ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఖంద్వా జిల్లాలోని రోషియా ఫేట్ వద్ద ఇండోర్-ఇచ్చాపూర్ రహదారి మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
తన తల్లి, సోదరితో కలిసి బాలిక (13) ఇండోర్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మంగళవారం 9.30 సమయంలో రోషియా ఫేట్‌కు చేరుకోగానే వాంతులు వచ్చాయి. దీంతో తల్లి వెంటనే బాలికను బస్సు కిటికీలో తల పెట్టించింది. అయితే ఈలోపు అవతలి వైపు నుంచి దూసుకుంటూ వచ్చిన టక్కు పాప తలను వేగంగా ఢీకొట్టింది. దీంతో పాప మొండెం, తల వేరుపడింది. బంతి మాదిరిగా ఎగిరిపడడంతో ఈ ఘటన చూసిన వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. బస్సులో కూర్చున్న తల్లి, సోదరి నిర్ఘాంతపోయి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని లబోదిబోమని రోదించారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే పోలీసులు వచ్చి బాలిక తల, బాడీని ఒక్కచోటకు చేర్చి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఘోరం: కిటికీలోంచి వాంతులు.. తెగిపడిన తల
Published Tue, Mar 30 2021 7:01 PM | Last Updated on Tue, Mar 30 2021 10:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment