ప్రార్థనకు రాలేదని కాల్చి చంపారు.. | ISIS jihadist group has reportedly beheaded a teenage boy for listening to pop music | Sakshi
Sakshi News home page

ప్రార్థనకు రాలేదని కాల్చి చంపారు..

Published Fri, Feb 19 2016 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

ప్రార్థనకు రాలేదని కాల్చి చంపారు..

ప్రార్థనకు రాలేదని కాల్చి చంపారు..

మోసుల్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అఘాయిత్యాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. వారు నరరూప రాక్షసులని మరోసారి నిరూపించుకున్నారు. పాప్ గీతాలు విన్నాడని ఓ యువకుడి తల నరికిన ఉగ్రవాదులు తాజాగా మరో ఇద్దరిని కాల్చి చంపేశారు. అయితే, వీరు మసీదులో ప్రార్థనకు హాజరుకాకోపోవడమే అందుకు కారణమట. ఇది కూడా యువకుడి తల నరికిన మోసుల్లోనే చోటుచేసుకుంది. కుర్దీష్కు చెందిన మీడియా సంస్థ ఆ వివరాలను వెల్లడించింది.

ఆ వివరాల ప్రకారం మోసూల్ లోని ఓ మసీదు ప్రార్థనలకు హాజరుకాలేదని ఇద్దరు యువకులను ఉగ్రవాదులు బంధించారు. అనంతరం వారిని అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ తన్నుతూ చివరకు పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి దారుణంగా కాల్చిచంపేశారు. అంతకుముందు ఇదే మోసుల్లో అయాం హుస్సేన్ (15) అనే బాలుడు తన తండ్రి చౌక ధరల దుకాణంలో పాటలు వినుకుంటూ కూర్చుండగా అదే సమయంలో ఆ వైపు పెట్రోలింగ్ కోసం వచ్చిన ఉగ్రవాదులు అతడిని పట్టుకొని బహిరంగంగా తల నరికేశారు. అనంతరం అతడి దేహాన్ని సాయంత్రపూట తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement