pop music
-
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్ -
టాప్ టెన్ మోస్ట్ పాపులర్ కె-పాప్ గ్రూప్స్ (ఫోటోలు)
-
Radha Priya Gupta: రాధాప్రియా గుప్తా సక్సెస్‌కు కారణం అదే!
ముంబైకి చెందిన రాధాప్రియ గుప్తా కెనడాలోని నింబస్ స్కూల్ ఆఫ్ రికార్డింగ్ అండ్ మీడియాలో చదువుకుంటున్న కాలంలో మ్యూజిక్ ప్రొడక్షన్‌కు సంబంధించిన విషయాలను నేర్చుకోవడంతో పాటు, ఖాళీ సమయంలో కలం పట్టేది. తన ఊహలకు అక్షరాలు అనే రెక్కలు ఇచ్చేది. అవి పాటల పక్షులై ఎగిరేవి. తన డెబ్యూ ఇపీ ‘నొని–పాప్’కు మంచి పేరు వచ్చింది. ‘క్లోజర్ టూ యూ’ పాటలోని వాక్యాలు మనల్ని ఎక్కడికో తీసుకువెళతాయి. మన శూన్యసమయాలను గుర్తు తెస్తాయి. ‘అప్పుడు ఎందుకు అలా?’ అంటూ పునరాలోచనలోకి తీసుకువెళతాయి. దిల్లీలోని ‘ట్యాంక్‌బండ్ మ్యూజిక్ ట్రూప్’లో ఒకరైన రాధాప్రియాకు పాట అంటే సాహిత్య, సంగీతాల సమతూకం. మనలోకి, ప్రకృతిలోకి తీసుకువెళ్లే మధురమైన ప్రయాణం. సింగర్, సాంగ్‌రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, ఇన్స్ట్ర్మెంటలిస్ట్గా తమ ప్రతిభ చాటుకున్నారు. ఏకే పాల్(లండన్)గా ప్రసిద్ధుడైన అనూప్ కుమార్ పాల్, జైపాల్‌గా ప్రసిద్ధుడైన జైరాజ్పాల్. వీరు మ్యూజిక్‌లో తన రోల్‌మోడల్స్. ఈ పాటను వాళ్లు అయితే ఎలా రాస్తారు? వాళ్లు అయితే ఎలా ట్యూన్ చేస్తారు?....ఇలా అనేక కోణాలలో వారిని మదిలోకి తీసుకొని మ్యూజిక్ డిజైన్ చేస్తుంది రాధాప్రియా గుప్తా. చదవండి: Ananya Sritam Nanda: ఏదో ఒకరోజు సింగర్ అనన్య నంద సైంటిస్ట్ కావడం ఖాయం! -
మ్యారేజ్ కోసం లైసెన్స్!
పాప్ మ్యూజిక్ రాక్‌స్టార్ పాప్‌ను ప్లే చేయకుండా పెళ్ళి బజంత్రీలు మోగించేందుకు సిద్ధం అయ్యాడట. తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ హెయిలీ బాల్డ్విన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు జస్టిన్ బీబర్. దానికోసం మ్యారేజ్ లైసెన్స్ తీసుకున్నారు ఇద్దరూ. డ్రైవింగ్ లైసెన్స్‌లా ఈ మ్యారేజ్ లైసెన్స్ ఏంటీ అనుకుంటున్నారా?.. ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ చర్చ్ లేదా ఆ దేశానికి సంబంధించిన స్టేట్ అథారిటీ ఇచ్చే సర్టిఫికేట్. జూలై నెలలో ఈ జోడీ రింగులు మార్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ యువ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని బీబర్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రేమికుల సన్నిహితులు మాత్రం వచ్చే వారంలోనే పెళ్లి ఉండొచ్చంటూ హింట్స్ ఇస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. మ్యారేజ్ లైసెన్స్ కేవలం 60 రోజులే వర్తిస్తుంది కాబట్టి ఈ రెండు నెలల్లో కచ్చితంగా పెళ్ళి భాజాలు వినొచ్చన్నమాట. ∙జస్టిన్, హెయిలీ -
పాప్ సాంగ్ మ్యాజిక్
-
మ్యాజిక్ చేసిన పాప్ సాంగ్...
సంగీతానికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉందంటారు. ఆ మాట ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. 4 నెలలుగా కోమాలో ఉన్న ఓ అమ్మాయిని స్పృహలోకి వచ్చేలా చేసింది మాత్రం ఒక పాటే. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుచేసే..ఈ అరుదైన సంఘటన చైనాలో చోటుచేసుకుందని స్థానిక వార్తా పత్రిక పేర్కొంది. ఇంతకీ విషయమేమిటంటే.. చైనాకు చెందిన 24 ఏళ్ల యువతి గత నవంబర్‌లో కోమాలోకి వెళ్లింది. రక్తంలో ఆక్సీజన్ సరఫరా సరిగా లేనందున మెదడు పనిచేయకపోవడంతో ఆమెకు ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఓ నర్స్ సేవలు అందిస్తోంది. ఎలాగైనా ఆమెలో చలనం కలిగించాలనుకున్న నర్స్.. ప్రతీరోజూ జోకులు చెప్తూ ఆమెను నవ్వించడానికి ప్రయత్నించేది. అందులో భాగంగానే ఓ రోజు తనకెంతో ఇష్టమైన.. తైవాన్ పాప్‌స్టార్ జే చో ‘రోజీమేరీ’ పాటను ప్లే చేసింది. ఆ పాట వినగానే యువతి నెమ్మదిగా కళ్లు తెరిచింది. ఈ విషయాన్ని గమనించిన నర్స్.. డాక్టర్‌ను పిలుచుకొని వచ్చింది. నాలుగు నెలలుగా జీవచ్చవంలా పడి ఉన్న పేషెంట్ ఇలా స్పృహలోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆమెకు మెరుగైన చికిత్సను అందించి తిరిగి మామూలు మనిషయ్యేలా చేశారు. -
మద్యం మానేసి ఆరేళ్లయిందోచ్: గాయని
కొన్నేళ్ల కిందటి వరకు మద్యానికి, డ్రగ్స్ కు బానిస అయి.. జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రముఖ పాప్ గాయని సియా.. ఇప్పుడు వాటికి దూరంగా ఉంటూ ఆనందభరితమైన జీవితాన్ని గడుపుతున్నట్టు తెలిపింది. తను మద్యం తాగడం మానేసి ఆరేళ్లయిందని, కుటుంబసభ్యులు, స్నేహితుల మద్దతుతోనే తాను ఈ విషయంలో ఆత్మనిగ్రహంతో నిష్ఠగా ఉంటున్నట్టు 40 ఏళ్ల ఈ అమ్మడు తాజాగా ట్విట్టర్ లో వెల్లడించింది. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఆస్ట్రేలియా గాయని అయిన సియా 2014లో విడుదల చేసిన 'షాండిలియర్' పాప్ సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ ఏడాది 'చీప్ థ్రిల్స్' పాటతో అభిమానుల్ని పలుకరించిన ఈ అమ్మడు.. పాప్ సింగర్ గా అంతగా వెలుగులోకి రాకముందు నుంచే తను మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస అయినట్టు వెల్లడించింది. 'నేను పది, పదిహేను ఏళ్లుగా సింగర్ గా ఉన్నాను. సక్సెస్ రాకముందే నేను బాగా మద్యం తాగేదాన్ని. డ్రగ్స్ కు బానిస అయ్యాను. ఇక ఆర్టిస్టుగా ఉండకూడదని మద్యం, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. చిన్నచిన్నగా పేరుప్రఖ్యాతలు వస్తున్న సమయంలోనే జీవితంలో ఇలా అస్థిరతకు లోనయ్యాను. అయినా, ఆ సమయంలో పాప్ మ్యూజిక్ నుంచి ఎందుకు బయటకిరాలేదంటే అది మిస్టరీయే అనుకుంటా' అని ఆమె ఇటీవల ఓ టీవీషోలో వెల్లడించింది. 'షాండిలియర్' పాటలోని దృశ్యం -
ప్రార్థనకు రాలేదని కాల్చి చంపారు..
మోసుల్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అఘాయిత్యాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. వారు నరరూప రాక్షసులని మరోసారి నిరూపించుకున్నారు. పాప్ గీతాలు విన్నాడని ఓ యువకుడి తల నరికిన ఉగ్రవాదులు తాజాగా మరో ఇద్దరిని కాల్చి చంపేశారు. అయితే, వీరు మసీదులో ప్రార్థనకు హాజరుకాకోపోవడమే అందుకు కారణమట. ఇది కూడా యువకుడి తల నరికిన మోసుల్‌లోనే చోటుచేసుకుంది. కుర్దీష్కు చెందిన మీడియా సంస్థ ఆ వివరాలను వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం మోసూల్ లోని ఓ మసీదు ప్రార్థనలకు హాజరుకాలేదని ఇద్దరు యువకులను ఉగ్రవాదులు బంధించారు. అనంతరం వారిని అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ తన్నుతూ చివరకు పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి దారుణంగా కాల్చిచంపేశారు. అంతకుముందు ఇదే మోసుల్‌లో అయాం హుస్సేన్ (15) అనే బాలుడు తన తండ్రి చౌక ధరల దుకాణంలో పాటలు వినుకుంటూ కూర్చుండగా అదే సమయంలో ఆ వైపు పెట్రోలింగ్ కోసం వచ్చిన ఉగ్రవాదులు అతడిని పట్టుకొని బహిరంగంగా తల నరికేశారు. అనంతరం అతడి దేహాన్ని సాయంత్రపూట తల్లిదండ్రులకు అప్పగించారు. -
నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు
‘నాక్కొంచెం తిక్కుంది... అయితే... దానికో లెక్కుంది’ అని ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ అన్నట్లు... ‘నాక్కొంచెం పొగరెక్కువ. అందుకని నేను గర్విష్టిని మాత్రం కాను’ అని మీడియా ముందు అదిరిపోయే స్టైల్లో చెప్పేశారు ప్రియాంక చోప్రా. ఇటీవల ఓ చానల్ రియాలిటీ షోలో అతిథిగా పాల్గొన్న ప్రియాంక... తన గురించి పలు అసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘‘నా జీవితమే ఒక విచిత్రం. ఎందుకంటే... నా లైఫ్‌లో నేను దేని గురించీ పోరాడింది లేదు. అసలు నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు. అయితే... కోరుకున్న దానికంటే ఎక్కువ నాకు దక్కింది. ఇంజినీరింగ్ కానీ, క్రిమినల్ సైకాలజీ కానీ చదవాలనేది నా యాంబిషన్. అదే లక్ష్యంగా స్కూల్‌కి వెళ్లేదాన్ని. స్కూల్ చదువు పూర్తయింది. మిస్ వరల్డ్ కిరీటం తలపైకొచ్చింది. ఎక్కడ లేని కీర్తి ప్రతిష్టలు చుట్టుముట్టాయి. ప్రపంచ స్థాయి మీడియా నా ముందుకొచ్చి నిలబడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సెలబ్రిటీ అయిపోయాను. అయితే... ఎంత ఎదిగినా నా కళ్లు మాత్రం నెత్తిపైకి ఎక్కవు. ఎందుకంటే... నా తిక్కను దించడానికి పక్కనే మా అమ్మ సిద్ధంగా ఉంటుంది’’ అని చెప్పారు ప్రియాంక. ‘‘కెరీర్లో నేను అనుకున్నదేం జరగ్గపోయినా... ఒక విషయంలో మాత్రం పోరాడాలని నిశ్చయించుకున్నా. అదే ‘మ్యూజిక్’. గతంలో కొన్ని పాప్ ఆల్బమ్స్ పాడాను. అనుకోకుండా పాడినా... మంచి పేరొచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో నటిగా ఉండి పాప్ మ్యూజిక్ పాడింది జెన్నిఫర్ లోపెజ్ తర్వాత నేను మాత్రమే. భవిష్యత్తులో పాప్ మ్యూజిక్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉంది’’ అని ప్రియాంక ఆశాభావం వెలిబుచ్చారు. -
ఆదాయంలో మిన్న.. మడోన్నా
యాభై ఏళ్లు దాటిపోయినా.. బిజీ బిజీగా టూర్లు తిరిగేస్తూ, పాప్ సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న మెటీరియల్ గర్ల్ మడోన్నా.. నిరంతరం వివాదాలతో డోన్ట్ కేర్ అన్నట్లుగా కనిపించినా డబ్బు, పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. అందుకే మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఎదిగింది. ఆల్బమ్స్, బిజినెస్ వెంచర్స్, రియల్ ఎస్టేట్, తన పేరిట అమ్ముడయ్యే వస్తువులు, ప్రకటనలు.. ఇలాంటివన్నీ ఇందుకు తోడ్పడ్డాయి. తెలివైన పెట్టుబడి నిర్ణయాలూ సహకరించాయి. కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాకుండా... దానితో ముడిపడి ఉన్న ఇతరత్రా సాధనాలన్నింటి నుంచి ఆదాయాన్ని ఆర్జించడం.. డబ్బు విషయంలో మడోన్నాకి ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. తన పేరు, పాటలకు ఉన్న పాపులారిటీని బాగానే క్యాష్ చేసుకుంటుంది మడోన్నా. అందుకే మెటీరియల్ గర్ల్ పేరిట దుస్తులు, పాదరక్షల కలెక్షన్‌ని ప్రవేశపెట్టింది. వీటి నుంచి ఏడాదికి సగటున 1 కోటి డాలర్ల పైగా ఆదాయం వస్తోంది. అలాగే, ట్రూత్ ఆర్ డేర్ పేరుతో విడుదల చేసిన పెర్ఫ్యూమ్ అమ్మకాలతో ఏకంగా ఆరు కోట్ల డాలర్లు వస్తున్నాయి. అటు స్మిర్నాఫ్ వోడ్కా, హార్డ్ క్యాండీ జిమ్ సెంటర్స్‌తో ఒప్పందాలూ ఇతోధికంగా ఆర్జించి పెట్టాయి. పాప్ మ్యూజిక్ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ .. తనకు రావాల్సినది రాబట్టుకునే విషయంలో మడోన్నా అస్సలు రాజీ పడదు. తన పేరును వాడుకునేందుకు లెసైన్స్ ఇవ్వడం, ఆల్బమ్స్‌ను విక్రయించడం, పాప్ షోలను నిర్వహించడం తదితర అంశాలన్నీ చూసుకునే కంపెనీ నుంచి అత్యంత కష్టతరమైన పరిస్థితులలో కూడా 12 కోట్ల డాలర్లు రాబట్టింది. వీటా కోకో అనే హెల్త్ డ్రింక్ కంపెనీలో ఆమె 10 లక్షల పౌండ్లు పెట్టుబడి పెట్టగా అది కొన్నాళ్లలోనే 70 లక్షల పౌండ్లు తెచ్చిపెట్టింది. ఈ రకంగా మొత్తం మీద వంద కోట్ల డాలర్ల (సుమారు రూ. 6 వేల కోట్లు) సంపదను సాధించింది. ఇలా 54 ఏళ్ల వయస్సులోనూ యువ ఆర్టిస్టులను ఎదుర్కొంటూ, పాపులారిటీ తగ్గకుండా చూసుకుంటూ.. కోట్లు ఆర్జిస్తూ.. సంపాదనను కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోతోంది మడోన్నా.