ముంబైకి చెందిన రాధాప్రియ గుప్తా కెనడాలోని నింబస్ స్కూల్ ఆఫ్ రికార్డింగ్ అండ్ మీడియాలో చదువుకుంటున్న కాలంలో మ్యూజిక్ ప్రొడక్షన్‌కు సంబంధించిన విషయాలను నేర్చుకోవడంతో పాటు, ఖాళీ సమయంలో కలం పట్టేది. తన ఊహలకు అక్షరాలు అనే రెక్కలు ఇచ్చేది. అవి పాటల పక్షులై ఎగిరేవి. తన డెబ్యూ ఇపీ ‘నొని–పాప్’కు మంచి పేరు వచ్చింది.
‘క్లోజర్ టూ యూ’ పాటలోని వాక్యాలు మనల్ని ఎక్కడికో తీసుకువెళతాయి. మన శూన్యసమయాలను గుర్తు తెస్తాయి. ‘అప్పుడు ఎందుకు అలా?’ అంటూ పునరాలోచనలోకి తీసుకువెళతాయి. దిల్లీలోని ‘ట్యాంక్‌బండ్ మ్యూజిక్ ట్రూప్’లో ఒకరైన రాధాప్రియాకు పాట అంటే సాహిత్య, సంగీతాల సమతూకం.
మనలోకి, ప్రకృతిలోకి తీసుకువెళ్లే మధురమైన ప్రయాణం. సింగర్, సాంగ్‌రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, ఇన్‌స్ట్ర్‌మెంటలిస్ట్‌గా తమ ప్రతిభ చాటుకున్నారు. ఏకే పాల్(లండన్)గా ప్రసిద్ధుడైన అనూప్ కుమార్ పాల్, జైపాల్‌గా ప్రసిద్ధుడైన జైరాజ్‌పాల్. వీరు మ్యూజిక్‌లో తన రోల్‌మోడల్స్.
ఈ పాటను వాళ్లు అయితే ఎలా రాస్తారు? వాళ్లు అయితే ఎలా ట్యూన్ చేస్తారు?....ఇలా అనేక కోణాలలో వారిని మదిలోకి తీసుకొని మ్యూజిక్ డిజైన్ చేస్తుంది రాధాప్రియా గుప్తా.
చదవండి: Ananya Sritam Nanda: ఏదో ఒకరోజు సింగర్ అనన్య నంద సైంటిస్ట్ కావడం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment