ప్రేమ పెళ్లి, గల్ఫ్‌ వెళ్లి ఏడాది కిందట వచ్చాడు.. ఏమైందో గానీ | Love Marriage: Husband Assassinated Wife Srikakulam | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి, గల్ఫ్‌ వెళ్లి ఏడాది కిందట వచ్చాడు.. ఏమైందో గానీ

Published Sat, Sep 24 2022 11:43 AM | Last Updated on Sat, Sep 24 2022 11:58 AM

Love Marriage: Husband Assassinated Wife Srikakulam - Sakshi

ఇచ్ఛాపురం రూరల్‌(శ్రీకాకుళం): ఇద్దరూ ప్రేమించుకున్నా రు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  కానీ ఏమైందో ఏమో కలకాలం తోడుంటాడని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె ప్రాణం తీ శాడు. ఏ చేత్తో తాళి కట్టాడో అదే చేతితో భార్య ను హతమార్చాడు. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికు లు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 

ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామం కుమ్మరి వీధికి చెందిన నర్సింగ బెహరా మూడేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన భవానీ బెహరా(25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత గల్ఫ్‌ వెళ్లిన నర్సింగ ఏడాది కిందట మళ్లీ స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఒక గుడిసెలో కాపురం ఉంటున్నారు. ప్రేమ వివాహమే అయినా నర్సింగ తరచూ భార్యతో గొడవపడేవాడు. అత్తామామలతోనూ సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నర్సింగ సహనం కోల్పోయి ఇంటిలో ఉన్న డ్రిల్లింగ్‌ మిషన్‌ ఆన్‌ చేసి కర్కశంగా దాడి చేశాడు.

దీంతో ఆమె ముఖమంతా నుజ్జునుజ్జైపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను హుటాహుటిన ఇచ్ఛాపురం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అక్కడి నుంచి బరంపురం రిఫర్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవానీ మృతి చెందింది. ఈ విష యం తెలుసుకున్న భర్త ఇంటి వద్ద బ్లేడ్‌తో గంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రుడిని 108లో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసు గల ఓ కుమారుడు ఉన్నాడు. సీఐ డీవీవీ సతీష్‌బాబు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర!


   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement