121 పోలింగ్ కేంద్రాలు
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్ సూచించారు.
- గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆర్డీఓ
- రాజకీయ పార్టీల నేతలు, పీఓలు, పోలీసులతో సమావేశం
కర్నూలు సీక్యాంప్: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్ సూచించారు. ఇందుకు సంబంధించి ఆయన గురువారం తన కార్యాలయంలో పోలింగ్ ఆఫీసర్లతోపాటు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల9న జిల్లా వ్యాప్తంగా 121 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. ఇందులో కర్నూలు డివిజన్‌లో దాదాపు 40 కేంద్రాలున్నాయన్నారు. డివిజన్ నుంచి దాదాపు 40మంది పోలింగ్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయా పార్టీల నాయకులను కోరారు.