సులభంగా ఓటరు వివరాలు
త్వరలో జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది.
– ‘ఎమ్మెల్సీ ఓట్ ఫైండర్’ పేరుతో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం సరికొత్త మొబైల్ యాప్ ఆవిష్కరణ
అనంతపురం : త్వరలో జరిగే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. అధికారులు ఈ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచినా వాటిని వెతుక్కోవడం సమస్యతో కూడుకుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ‘ఎమ్మెల్సీ ఓట్ ఫైండర్’ పేరుతో సరికొత్త మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఓటరు పూర్తి వివరాలు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఐటీ విభాగం సభ్యుడు వి. చిరంజీవిరెడ్డి ఈ యాప్‌ను తయారు చేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి ఈ మొబైల్ యాప్‌ను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐటీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బెంగళూరు ఐటీ విభాగం సభ్యులు ముకుందాపురం ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
యాప్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఆన్‌డ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ (యాపిల్)లోకి వెళ్లాలి. Mlcvotefinder’ (పదాల మధ్య స్పేస్ ఉండకూడదు) అని టైప్ చేసి సర్చ్ చేయాలి. యాప్ డిస్‌ప్లే అవుతుంది. దాన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఓటరు వివరాలు తెలుసుకోవాలంటే...
మొబైల్ యాప్ ఓపెన్ చేశాక కింది భాగంలో ‘చెక్ యువర్ ఓట్’ అని ఉంటుంది. అక్కడ నొక్కితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వారి వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ కనెక్ట్ అవుతుంది. అక్కడ...జిల్లా అనే చోట ఏ జిల్లా ఓటరు అయితే అ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎమ్మెల్సీ నియోజకవర్గం టైప్ అని ఉంటుంది అక్కడ టీచర్స్ అయితే టీచరు, గ్రాడ్యుయేట్ ఓటరు అయితే గ్రాడ్యుయేట్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంటినంబరు ఎంటర్ చేయాలి. (ఉదాహరణ 15–37,15/37 రెండు విధాలా చూడండి) లేదా పేరు నమోదు చేసి సర్చ్ అనే బటన్ నొక్కాలి. అంతే మనకు కావాల్సిన ఓటరు వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఓటరు పేరు, చిరునామా, సీరియల్ నంబరు, పోలింగ్‌స్టేషన్ నంబర్, పోలింగ్ బూతు ఎక్కడుందనే వివరాలు ఇట్టే కనిపిస్తాయి.