ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌! | BJP Full Focus On MLC By Election In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!

Published Wed, May 15 2024 11:06 AM | Last Updated on Wed, May 15 2024 12:16 PM

BJP Full Focus On MLC By Election In Telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవ‍ర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. 

కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం చేపట్టనున్నారు. ఇక, ఇన్‌చార్జ్‌లను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్‌. దీంతో, ఇన్‌చార్జ్‌లు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమందర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌ రెడ్డి పోటీలో నిలిచారు. ఇక, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. 

రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement