తిరుమలాయపాలెం : బదిలీపై వచ్చిన ఎంపీడీఓకు చుక్కెదురైంది. ఆంధ్రకు చెందిన అధికారి ఇక్కడ పనిచేయడానికి వీల్లేదంటూ ఎంపీపీ సహా సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటన తిరుమలాయపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన సన్యాసయ్య ఖమ్మం జిల్లా గుండాలలో గతంలో ఎంపీడీఓగా పనిచేశారు.
ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా కేసముద్రానికి బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం ఎక్కడి వారిని అక్కడికి తిరిగి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యం కారణంగా సన్యాసయ్య కేసుముద్రం నుంచి రిలీవ్ కాలేదు. ఈ క్రమంలో సన్యాసయ్యను తిరుమలాయపాలెం ఎంపీడీఓగా నియమిస్తూ జిల్లా పరిషత్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన సన్యాసయ్యను ఎంపీపీ అశోక్ అడ్డుకున్నారు. ఆంధ్రకు చెందిన వ్యక్తి ఇక్కడ ఎలా పనిచేస్తారని నిలదీశారు.
స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్ అనుమతి లేకుండా ఎలా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇన్‌చార్జ్ ఎంపీడీఓ జాఫర్ ఖాన్ కూడా బాధ్యతలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఉదయ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ తతంగం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాలతో బదిలీపై వచ్చిన ఎంపీడిఓకి భాద్యతలు అప్పగించ ని వైనమిది. బాద్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఎంపీడిఓ గంటల తరబడి కార్యలయంలో వేచి చూసి బాధ్యతలు అప్పగించేందుకు ఇన్‌చార్జీ ఎంపీడిఓ ముందుకు రాకపోవడంతో జిల్లా అధికారులతో సంప్రదించి ఎంపీడిఓగా సన్యాసయ్య అజ్యూమ్డ్ చార్జీ తీసుకుని బాద్యతలు తీసుకుని ఎంపీడిఓ సీటులో ఆశీనులయ్యారు.
ఈ పరిణామం ప్రాంతీయ వివాదాలు కారణం అయ్యింది. తన అనుమతి లేకుండా ఎంపీడిఓ ఎలా జాయిన్ అవుతారని ఎంపిపి అసహనం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంతో పాటు కొందరు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆంద్రా ప్రాంతానికి చెందిన అధికారి తమకు వద్దంటు ఎంపీడిఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. అజ్యూమ్డ్ చార్జ్‌తో సన్యాసయ్య ఎంపీడీఓగా స్వతహాగా బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరి పోయారు.
ఈ పరిణామాలను ఎంపీపీ జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు. ప్రజాప్రతినిధుల మాటను లెక్క చేయకుండా బాధ్యతలు తీసుకోవడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సన్యాసయ్య విధుల్లో చే రొద్దంటూ సీపీఐ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిగిం ది. సన్యాసయ్యకు బాధ్యతలు అప్పగించొద్దం టూ ఇన్‌చార్జ్ ఎంపీడీఓ జాఫర్ ఖాన్‌కు ఆ పా ర్టీల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సన్యాసయ్య ఎంపీడీఓ హోదాలో తహశీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
ఆంధ్ర అధికారి మాకొద్దు..
Published Wed, Sep 3 2014 5:33 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement
Advertisement