Tirumalayapalem
-
అర్ధరాత్రి నకిలీ టాస్క్‌ఫోర్స్..
సాక్షి, తిరుమలాయపాలెం: మండల పరిధిలోని బచ్చోడు నుంచి ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ఇదే అదునుగా బియ్యం తరలిస్తున్న ముఠాలోని వ్యక్తే, మరికొందరు కలిసి నకిలీ పోలీసుల అవతారమెత్తాడు. బియ్యం వ్యాపారిని రూ. 80 వేలు డిమాండ్ చేశారు. చివరకు ఖమ్మం టాస్క్‌ఫోర్స్(ఒరిజినల్)కు పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... బచ్చోడు కేంద్రంగా ఓ ముఠా కొద్ది రోజులుగా రేషన్ బియాన్ని అక్రమంగా తరలిస్తోంది. వైరా ప్రాంతానికి చెందిన ఎక్కిరాల కృష్ణ అనే వ్యాపారి ఇక్కడ కొందరు ఏజెంట్లను నియమించుకుని ఈ దందాకు పాల్పడుతున్నాడు. బంధంపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్ వ్యాపారికి సహకరిస్తుంటాడు. కొంతకాలం నుంచి నమ్మకంగా పనిచేస్తున్న నరేష్‌కు.. వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూళ్లు చేయాలనే తలంపు వచ్చింది. ఆదివారం రాత్రి బచ్చోడులో 11 క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్‌లో లోడ్ చేసుకుని వస్తున్నారు. నరేష్ కూడా అదే వ్యాన్లోనే ఉన్నాడు. ఇదే అదనుగా భావించి తన గ్రామానికే చెందిన నాగరాజు అనే వ్యక్తి సమాచారం ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి వ్యాన్ని నిలిపివేసి డబ్బులు డిమాండ్ చేయాలని చెప్పాడు. దీంతో నాగరాజు, బీరోలు గ్రామానికి చెందిన చిలకబత్తిని రవి, సురేష్, దామళ్ల నవీన్, గుడివాడ సాయిలను సంప్రదించి తమ ప్లాన్ చెప్పాడు. అందరూ కలిసి వెళ్లి ఏలువారిగూడెం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద వ్యాన్ని నిలిపివేశారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ రూ. 80 వేలు డిమాండ్ చేశారు. దీంతో వ్యాన్ డ్రైవర్ ఓనర్ కృష్ణకు విషయం వివరించడంతో.. ఆయన వచ్చి రూ.3 వేలు ఇవ్వజూపి బేరమాడసాగాడు. మరోవైపు అసలు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఖమ్మం టాస్క్‌ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బోడ నరేష్, నాగరాజు, చిలకబత్తిని రవి, సురేష్లను అదుపులోకి తీసుకున్నారు. దామళ్ల నవీన్, గుడివాడ సాయి అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. కాగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యాన్‌తో పాటు నలుగురు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. బియ్యం వ్యాపారి ఎక్కిరాల కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బియ్యం తరలిస్తున్న వ్యాపారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ýసోమవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం బయల్దేరి వెళతారు. ముందుగా ఆయన ఖమ్మం నగరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రెండో రోజు మంగళవారం రోడ్డు మార్గంలో కేసీఆర్ ముదిగొండ చేరుకుని అక్కడ నుంచి ముత్తారం గ్రామంలోని రామాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి బహరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం టేకులపల్లి మండలం రోళ్లపాడులో శ్రీరామ నీటి పథకానికి శంకుస్థాపన చేసి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు రోళ్లపాడు నుంచి కేసీఆర్ హైదరాబాద్ పయనం అవుతారు. -
పోలీస్‌స్టేషన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి - తల్లిదండ్రుల మరణంతో అనాథగా చిన్నారి గోల్‌తండా (తిరుమలాయపాలెం) : పోలీస్‌స్టేషన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓవ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన తిరుమలాయపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నారుు. మండలంలోని గోల్తండాకు చెందిన గుగులోత్ సురేశ్ (25).. తన భార్య స్వరూప(20) హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 18న తిరుమలాయపాలెంలోని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయూడు. ఇదే కేసులో సురేశ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లొంగిపోయిన సురేశ్‌ను ఓ గదిలో ఉంచడంతో అక్కడే ఓ తాడు చూసుకుని ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి సురేశ్ పెట్టుకున్న ఉరిని తొలగించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ సురేశ్ సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉండడంతో మెరుగైన చికిత్స కోసం పోలీసులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. భార్య మరణించిన కొద్దిరోజుల్లోనే భర్త కూడా మృతిచెండటంతో వారి ఏడాది వయసున్న పాట ధనలక్ష్మి అనాథగా మారింది. స్వరూపకు వివాహం కాని ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారే ఆ పాపను చూసుకుంటున్నారు. కాగా పోలీస్‌స్టేషన్‌లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. -
శవమై తేలిన అదృశ్యమైన విద్యార్థిని
ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం ఎస్సీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే బానోత్ శిల్ప అనే విద్యార్థిని ఎస్సీ బాలికల హాస్టల్లో చదువుతోంది. గత కొద్దిరోజుల క్రితం శిల్ప హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె మృతదేహం హాస్టల్ లభ్యమైంది. దీంతో శిల్ప మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆంధ్ర అధికారి మాకొద్దు..
తిరుమలాయపాలెం : బదిలీపై వచ్చిన ఎంపీడీఓకు చుక్కెదురైంది. ఆంధ్రకు చెందిన అధికారి ఇక్కడ పనిచేయడానికి వీల్లేదంటూ ఎంపీపీ సహా సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటన తిరుమలాయపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన సన్యాసయ్య ఖమ్మం జిల్లా గుండాలలో గతంలో ఎంపీడీఓగా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా కేసముద్రానికి బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం ఎక్కడి వారిని అక్కడికి తిరిగి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యం కారణంగా సన్యాసయ్య కేసుముద్రం నుంచి రిలీవ్ కాలేదు. ఈ క్రమంలో సన్యాసయ్యను తిరుమలాయపాలెం ఎంపీడీఓగా నియమిస్తూ జిల్లా పరిషత్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన సన్యాసయ్యను ఎంపీపీ అశోక్ అడ్డుకున్నారు. ఆంధ్రకు చెందిన వ్యక్తి ఇక్కడ ఎలా పనిచేస్తారని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ అనుమతి లేకుండా ఎలా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇన్చార్జ్ ఎంపీడీఓ జాఫర్ ఖాన్ కూడా బాధ్యతలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఉదయ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ తతంగం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల ఆదేశాలతో బదిలీపై వచ్చిన ఎంపీడిఓకి భాద్యతలు అప్పగించ ని వైనమిది. బాద్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఎంపీడిఓ గంటల తరబడి కార్యలయంలో వేచి చూసి బాధ్యతలు అప్పగించేందుకు ఇన్చార్జీ ఎంపీడిఓ ముందుకు రాకపోవడంతో జిల్లా అధికారులతో సంప్రదించి ఎంపీడిఓగా సన్యాసయ్య అజ్యూమ్డ్ చార్జీ తీసుకుని బాద్యతలు తీసుకుని ఎంపీడిఓ సీటులో ఆశీనులయ్యారు. ఈ పరిణామం ప్రాంతీయ వివాదాలు కారణం అయ్యింది. తన అనుమతి లేకుండా ఎంపీడిఓ ఎలా జాయిన్ అవుతారని ఎంపిపి అసహనం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంతో పాటు కొందరు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆంద్రా ప్రాంతానికి చెందిన అధికారి తమకు వద్దంటు ఎంపీడిఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. అజ్యూమ్డ్ చార్జ్‌తో సన్యాసయ్య ఎంపీడీఓగా స్వతహాగా బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరి పోయారు. ఈ పరిణామాలను ఎంపీపీ జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు. ప్రజాప్రతినిధుల మాటను లెక్క చేయకుండా బాధ్యతలు తీసుకోవడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సన్యాసయ్య విధుల్లో చే రొద్దంటూ సీపీఐ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా జరిగిం ది. సన్యాసయ్యకు బాధ్యతలు అప్పగించొద్దం టూ ఇన్చార్జ్ ఎంపీడీఓ జాఫర్ ఖాన్‌కు ఆ పా ర్టీల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సన్యాసయ్య ఎంపీడీఓ హోదాలో తహశీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. -
క‘న్నీటి’ కష్టం..
తిరుమలాయపాలెం : వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, కారుమబ్బులు కమ్ముకోవడంతో ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేసిన అన్నదాతలు ప్రస్తుతం కన్నీరు పెడుతున్నారు. వర్షాలు కురవకపోవడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొలకెత్తిన కొద్దిపాటి విత్తనాలు కూడా ఎండిపోతున్నాయి. కళ్లెదుటే మొక్కలు ఎండిపోతుండడంతో తట్టుకోలేక అన్నదాతలు వాటిని రక్షించేందుకు తీవ్రపాట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి వాటిని బతికించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి నిత్యం కరువుకి గురయ్యే తిరుమలాయపాలెం మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు. ఈ ఏడాది ఖరీఫ్ పంట వర్షాభావంతో ఇప్పటికే నెల రోజులు ఆలస్యం అయ్యింది. అదును దాటిపోతోందని... మండలంలోని రైతులు ప్రధానంగా పత్తి సాగు చేస్తుంటారు. సుమారు ఆరువేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తుంటారు. ఈ క్రమంలో అదును దాటిపోతోందని ఇప్పటికే వేలాది ఎకరాల్లో రైతులు విత్తనాలు నాటారు. కానీ గత 15 రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. మండలంలోని కొక్కిరేణి, తిరుమలాయపాలెం, ఎర్రగడ్డ, తెట్టెలపాడు, వెదుళ్లచెరువు దమ్మాయిగూడెం, పాతర్లపాడు, హైదర్‌సాయిపేట, తిప్పారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఇప్పటికే రైతులు రెండుసార్లు పత్తి విత్తనాలు నాటి నష్టపోయారు. దీంతో మండలంలోని రైతులు ఆర్థికంగా నష్టపోయారు. మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల మేర అన్నదాతలు నస్టపోయారు. మండలంలోని మేడిదపల్లి, బీరోలు, సుబ్లేడు, రాజారం, పైనంపల్లి, బచ్చోడు, ఇస్లావత్‌తండా తదితర గ్రామాల్లో ప్రతి ఏడాది అధికంగా పెసర పంటను సాగుచేస్తున్నప్పటికి ఈ ఏడాది వర్షాలు లేక రైతులు ఆ పంట సాగు విరమించుకున్నారు. మండలంలో ఇంతటి వర్షాభావ పరిస్థితులు ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాలలో మొలకలు వచ్చిన పత్తి మండుతున్న ఎండలతో ఎండిపోతుండడంతో తట్టుకోలేక వరుణ దేవుడు కరుణించకపోతాడా అనే ఆశతో రైతన్నలు సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెస్తూ పత్తి పాదులకు పోస్తూ కాపాడుతున్నారు. ఒకవైపు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అన్నదాతలు విత్తనాల కోసం ప్రైవేట్‌గా అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.