న్యూడెమోక్రసీ దళంపై దాడికి పోలీసుల యత్నం
జంగాలపల్లిలో పంచాయితీ నిర్వహిస్తుండగా ఘటన
గంగారం(ములుగు): మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లిలో గురువారం త్రుటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. గ్రామంలోని ఓ రహస్య ప్రాంతంలో న్యూడెమోక్రసీ నక్సల్స్ పంచాయితీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడికి వెళ్లారు. క్షణాల వ్యవధిలో సమాచారం అందుకున్న దళ సభ్యులు చాకచ క్యంగా అక్కడి నుంచి పారిపోవడంతో ప్రాణనష్టం తప్పిం ది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్యాం దళం సభ్యులు గురువారం ఉదయం మండలంలోని జంగాలపల్లిలో ఓ పంచాయితీ చేయడానికి వచ్చారు.
ఏడుగురు దళ సభ్యులు ఇరుపక్షాల వారితో పంచాయితీ నిర్వహిస్తుండగా, పోలీ సులకు సమాచారం అందింది. దీంతో ఎస్సైలు సతీశ్, బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు. గ్రామానికి చెం దిన వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న దళ సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు, దళ సభ్యులు ఎదురుపడితే కాల్పులు, ప్రాణ నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పంచాయితీ జరిగిన ఇంట్లో సోదాలు చేయగా 8 కిట్ బ్యాగులు, టార్పాలిన్ కవర్, ఓ సెల్‌ఫోన్, పాదరక్షలు లభించినట్లు సీఐ రమేశ్‌నాయక్ వెల్లడించారు.
దళ సభ్యులకు సహకరిస్తే కఠిన చర్యలు
దళ సభ్యులకు ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరిం చారు. పంచాయితీల పేరుతో దళ సభ్యులను సంప్రదిం చడం మానుకోవాలని హితవు పలికారు. పలువురు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.
త్రుటిలో తప్పిన ఎన్‌కౌంటర్
Published Fri, Jul 21 2017 12:03 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement
Advertisement