en counter
-
యూపీలో మరో గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ల ఏరివేత కార్యక్రమంలో కొనసాగుతోంది. ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను కాల్చి చంపిన పోలీసులు.. అండర్ గ్రౌండ్లో ఉన్న మరికొంతమంది క్రిమినల్స్ పనిపడుతున్నారు. యూపీ పోలీసులు మరో క్రిమినల్‌ను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి బారాబంకీ ప్రాంతంలో స్పెషల్ టాస్స్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా మరణించాడు. అయితే తొలుత తీవ్రంగా గాయపడ్డ అతను.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు స్థానిక ఎస్పీ అరవింద్ చతుర్వేది వివరాలను వెల్లడించారు. టింకూ తలమీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, 20 ఏళ్లుగా నిషేదిత కార్యక్రమాలను పాల్పడున్నాడని పేర్కొన్నారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..) టింకూ టీంలోని మరికొంత మంది క్రిమినల్స్ కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. మాఫియాను ప్రోత్సహిస్తున్న వారి జాబితాను తయారుచేసి వెంటాడుతోంది. కాగా మూడు వారాల క్రితమే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను ఎన్కౌంటర్లో యూపీ పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు ఓ కమిటీని సైతం నియమించింది. -
వీర సైనికా నీకు వందనం
జైపూర్: ఆరున్నర సంవత్సరాలు కష్టపడి 13 సార్లు ప్రయత్నించి ఆర్మీలో చేరారు ఆయన. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేని ఆయన ఎట్టకేలకు ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరారు. భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆర్మీలో చేరిన తరువాత వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కల్నల్‌స్థాయికి చేరారు. ఆయన మరెవరో కాదు ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఉగ్రదాడిలో అమరులైన కల్నల్ ఆశుతోష్ శర్మ. ఆయన మృతదేహాన్నిస్వగ్రామమైన జైపూర్‌కు తీసుకురానున్నారు. సోమవారం సాయంత్రం కల్లా ఆయన శరీరాన్ని జైపూర్‌లో ఉంటున్న ఆయన తల్లిదండ్రులకు అందించనున్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు సైనికవందనంతో జరగనున్నాయి. (కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) కల్నల్ శర్మ భార్య పల్లవి, కూతురు తమన్నాతో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య పల్లవి మాట్లాడుతూ తన భర్త ఒక గొప్ప కారణంతో ప్రాణాలు త్యాగం చేశారని, అశుతోష్‌ని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఆయనని చూసి ఏడవనని తెలిపారు. చివరిగా కల్నల్‌తో మే 1 న మాట్లాడానని చెప్పారు. ఆయన కూతురు తమన్నా మాట్లాడుతూ ఆపరేషన్ ముగియగానే ఇంటికి తిరిగి వస్తానని చెప్పిన నాన్నకి ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యింది. అశుతోష్ తల్లి దండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. (హంద్వారా అమరులకు మహేష్ నివాళి) ఆయన సోదరుడు పీయూష్ శర్మ మాట్లాడుతూ ‘మా సోదరుడు చాలా ధైర్యవంతుడు, దేశభక్తి కలవాడు. నా సోదరుడి లాగానే నా కొడుకు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. ఆయన మా అందరికి ఆదర్శం’ అని తెలిపారు. కల్నల్ అశుతోష్ శర్మ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్ కాగా ఆయన అంత్యక్రియలు మాత్రం జైపూర్‌లో జరగనున్నట్లు ఆయన సోదరుడు తెలిపారు. ఆదివారం కశ్మీర్‌లోని హాంద్వారా ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకలు దొంగదెబ్బ తీయడంతో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసు ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. -
త్రుటిలో తప్పిన ఎన్కౌంటర్
న్యూడెమోక్రసీ దళంపై దాడికి పోలీసుల యత్నం జంగాలపల్లిలో పంచాయితీ నిర్వహిస్తుండగా ఘటన గంగారం(ములుగు): మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లిలో గురువారం త్రుటిలో భారీ ఎన్కౌంటర్ తప్పింది. గ్రామంలోని ఓ రహస్య ప్రాంతంలో న్యూడెమోక్రసీ నక్సల్స్ పంచాయితీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడికి వెళ్లారు. క్షణాల వ్యవధిలో సమాచారం అందుకున్న దళ సభ్యులు చాకచ క్యంగా అక్కడి నుంచి పారిపోవడంతో ప్రాణనష్టం తప్పిం ది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్యాం దళం సభ్యులు గురువారం ఉదయం మండలంలోని జంగాలపల్లిలో ఓ పంచాయితీ చేయడానికి వచ్చారు. ఏడుగురు దళ సభ్యులు ఇరుపక్షాల వారితో పంచాయితీ నిర్వహిస్తుండగా, పోలీ సులకు సమాచారం అందింది. దీంతో ఎస్సైలు సతీశ్, బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు. గ్రామానికి చెం దిన వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న దళ సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు, దళ సభ్యులు ఎదురుపడితే కాల్పులు, ప్రాణ నష్టం జరిగి ఉండేదని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పంచాయితీ జరిగిన ఇంట్లో సోదాలు చేయగా 8 కిట్ బ్యాగులు, టార్పాలిన్ కవర్, ఓ సెల్‌ఫోన్, పాదరక్షలు లభించినట్లు సీఐ రమేశ్‌నాయక్ వెల్లడించారు. దళ సభ్యులకు సహకరిస్తే కఠిన చర్యలు దళ సభ్యులకు ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరిం చారు. పంచాయితీల పేరుతో దళ సభ్యులను సంప్రదిం చడం మానుకోవాలని హితవు పలికారు. పలువురు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. -
ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్‌కు గాయాలు
వంగర: ఒడిశాలో జరిగి ఎన్కౌంటర్లో వంగర మండల పరిధి అరసాడ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ దొంతల సతీష్ గాయపడ్డాడు. మావోయిస్టులు–పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సతీష్ కాలులోకి బుల్లెట్ చొచ్చుకుపోయి గాయపడినట్టు ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్న అతని కుటుబం సభ్యులు, గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. సతీష్‌ను చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించినట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు దొంతల రామారావు, కళావతిలు పోలీసుల సహకారంతో అక్కడకు వెళ్లారు. నాలుగేళ్లు క్రితం సతీష్ పోలీసు ఉద్యోగంలో చేరారు. ఈయన తండ్రి రామారావు సిల్వర్ సామగ్రి విక్రయాలు చేస్తుంటారు. తల్లి ఇంటి వద్ద పనులు చూసుకుంటారు. ఇద్దరు చెల్లెళ్లు హేమలత, స్వాతిలు స్థానికంగా చదువుతున్నారు. వంగర ఎస్సై వై.మధుసూదనరావు, ఏఎస్ఐ హెచ్.కాంతారావు అరసాడ గ్రామానికి వచ్చి సతీష్ కుటుంబీకులతో మాట్లాడారు.