టేకులపల్లి (ఖమ్మం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పోడు భూముల రక్షణ కోసం ఈనెల 25వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని పార్టీ కార్యాలయంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఊక్లా, హర్జ్య, తోటకూరి వెంకటేశ్వర్లు, కల్తి వెంకటేశ్వర్లు, నోముల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.