న్యూడెమోక్రసీ దళ కమాండర్ అరెస్టు
న్యూడెమోక్రసీ దళ కమాండర్ అరెస్టు
Published Sat, Oct 29 2016 12:30 PM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
టేకులపల్లి: న్యూడెమోక్రసీ(రాయల) అజ్ఞాత దళ కమాండర్ ఆజాద్ అలియాస్ మధు(45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ శనివారం టేకులపల్లి సీఐ కార్యాలయంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన మధు ఇరవయ్యేళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడని తెలిపారు. శనివారం ఉదయం ఆళ్లపల్లి మండలం బాటన్ననగర్‌లోని ఓ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నాయని, ఈ మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement