ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటూ, వారిని రెచ్చగెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీమాంధ్ర ఉద్యమానికి ముఖ్యమంత్రే నాయకత్వం వహిస్తున్నట్లు ఉందని, ఆయనకు సీమాంధ్ర ఉద్యమంపై నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రామనర్సయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖల పక్షం సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు మద్దతు తెలిపి, విభజన సమయంలో వ్యతిరేకంగా మట్లాడడం సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజలు పార్టీల వైఖరిని అర్ధం చేసుకుని తెలంగాణకు సహకరించాలని కోరారు.
ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి..
ఎన్నో ఏళ్లుగా పోడుభూములు సేద్యం చేసుకుంటున్న ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుండా, సర్వేల పేరుతో కాలయాపన చేసి, అరకొర భూములు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీచేయడం దుర్మార్గమన్నారు. అటవీ అధికారులు గొత్తికోయల నివాసాలను ధ్వంసం చేస్తూ గుడిసెలు తగులబెడుతూ జంతువులకు తరిమినట్లు తరుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేద్యం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ 10 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వచ్చేనెల 2న వేలాది మందితో కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళణ, ఖమ్మం, పాల్వంచ డివిజన్లలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భద్రాచలం డివిజన్‌ను జిల్లాలో భాగంగా ఉంచాలని, ప్రజల అభిప్రాయం స్వీకరణకు రెఫరెండం జరపాలని డిమాండ్ చేస్తూ 4న భద్రాచలంలో రెడ్‌క్రాస్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు సదస్సు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వచ్చే నెల 3న ‘రూపాయి పతనం- ఆర్ధిక సంక్షోభం- ప్రజల జీవనంపై ప్రభావం’ అంశంపై ఎన్డీకార్యాలయంలోసదస్సు జరుగుతుందని చెప్పారు. కార్యాక్రమాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ఎన్డీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సురేష్‌లు ఉన్నారు.
సీఎం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు
Published Sat, Aug 31 2013 2:52 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement