వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ :
ఏటూరునాగారం మండలంలోని చెల్పాక, ఎలిశెట్టిపల్లి గ్రామాల్లో సంచరిస్తున్న నలుగురు నక్సల్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సీపీఐ(ఎంఎల్) పేరిట వీరు చందాలు వసూలు చేయడానికి వచ్చినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందడంతో పక్కాప్లాన్‌తో వీరిని పట్టుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ నెల 5న చెల్పాక గ్రామంలో పోలీసులు పాగా వేసి ఉండగా ఓ ఇంట్లో భోజనం చేయడానికి వచ్చిన ఇద్దరు నక్సల్స్ వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా మరో ఇద్దరు నక్సల్స్ తమతో ఉన్నారని, మీ రాకను పసిగట్టి పారిపోయారని వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ఆ ఇద్దరి కోసం మూడు రోజులు గా వెతకగా గురువారం ఉదయం వారు చిక్కినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ నలుగురు నక్సల్స్ ఎలిశెట్టిపల్లి చెరువుకుంటలో నాలుగు తుపాకులను దాచి ఉంచినట్లు విచారణలో వెల్లడైంది. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచా రం. పోలీసుల అదుపులో ఏటూర్‌నాగారం మండలం సింగారం గ్రామానికి చెందిన నర్సింగరావు, ఖమ్మం జిల్లా గుండాల మండలం చీమలగూడెం కు చెందిన పాయం సమ్మయ్యతోపాటు మరొకరు, హసన్‌పర్తి మండలానికి చెందిన విముక్తి ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నక్సల్స్ అరెస్ట్ విషయమై పోలీసులను వివరణ కోరగా తాము ఎవరిని తీసుకురాలేదని చెప్పడం గమనార్హం.
ఎన్డీ దళం నుంచి పరారై వచ్చి.. పట్టుబడి..
పోలీసులకు పట్టుబడిన ఆ నలుగురు గతంలో సీపీఐ(ఎంఎల్) ప్రతిఘటనలో పనిచేసినట్లు తెలిసింది. కొన్నాళ్ల క్రితం ప్రతిఘటన దళాలు కొన్ని పోలీసులకు లొంగిపోవ డం, మరికొందరు ఎన్‌కౌంటర్లలో చనిపోవడంతో ఆ గ్రూప్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సదరు వ్యక్తులు ఐదు నెలల క్రితం ఖమ్మం జిల్లాలోని న్యూడెమోక్రసీ మధు దళాన్ని సంప్రదించినట్లు తెలిసింది. తాము దళంలో పనిచేస్తామని చెప్పడంతో సభ్యులుగా చేర్చుకుని కొన్నాళ్లు ఆయుధాలు చేతికి ఇవ్వకుండా వెంట తిప్పుకున్నట్లు సమాచారం. వారిపై ఎలాంటి అనుమానం లేకపోవడంతో దళంలో పూర్తిస్థాయి సభ్యులుగా తీసుకున్నట్లు తెలిసింది. నమ్మకమై న వ్యక్తులుగా మెదిలిన వారు అక్టోబర్ చివరి వారంలో నాలుగు ఆయుధాలతో సహా పరారయ్యారు. వారి ఆచూకీ కోసం న్యూడెమోక్రసీ నేతలు ఆరా తీస్తుండగానే ఏటూరునాగారం ఏజెన్సీలోకి వచ్చిన సదరు నక్సల్స్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో నలుగురు నక్సల్స్?
Published Fri, Nov 8 2013 3:14 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement
Advertisement