ఆర్మూర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు విడతల్లో చేపట్టిన భూపంపిణీపై శ్వేతపత్రం విడుదల చేయాలని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్ శ ర్మ డిమాండ్ చేశారు. భూపంపిణీ చేసిన వివరా లు, కబ్జాలు, వ్యవసాయం చేస్తున్న వారి వివరాలు ఆ శ్వేత పత్రంలో పొందుపర్చాలన్నారు. బుధవారం పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గల కుమార్ నారాయణ సమావేశపు గదిలో భూ పంపిణీపై ఆ ర్మూర్ డివిజన్ కార్యదర్శి వి.ప్రభాకర్ అధ్యక్షత న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూముల కు కబ్జా చూపించాలని, కబ్జాలో ఉన్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్లపై నిర్వహించిన ఈ సమావేశంలో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నా యకులు మాట్లాడారు. భూ పోరాటాల్లో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా గోపాల్ శర్మ మా ట్లాడుతూ.. తెలంగాణ పల్లె ప్రజలు విద్య లేని కారణంగా కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని కోరారు. విలీనమే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 40 ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను దోచుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అనే సమయంలో స్పందించని తెలంగాణ ప్రాంత మంత్రులను ఆయన విమర్శించారు. తెలంగాణ మంత్రుల అలసత్వం, బానిసత్వం కారణంగా సీమాంధ్ర నాయకుల తొత్తులుగా మా రుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలతో త్వరలో సమావేశం నిర్వహించి జిల్లాలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
శాస్త్రీయ వైఖరి లేని కారణంగానే..
దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే పార్టీలకు శాస్త్రీయ వైఖరి లేని కారణంగానే భూ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామిక దేశంలో సాగు, ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలు క్షమించరు. అధికారుల నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా భూ సమస్యలు రావణకాష్టంలా మారుతున్నాయి. సెజ్‌ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు కట్టబెట్టడం మంచిదికాదు. అర్హులైన వారికి భూములు కేటాయించి సమష్టి వ్యవసాయం చేసేటట్లు ఏర్పాటు చేయాలి. - ఏఎస్ పోశెట్టి, టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు
చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి..
ప్రభుత్వాలు భూ సంస్కరణలు చేస్తున్నామంటూ గొప్పలకు పోయినా అనేక చట్టాలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అర్హులైన పేదలకు సాగుభూమిని ఇవ్వాలన్న కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలి. ఆర్మూర్ మండలం పెర్కిట్-కొటార్మూర్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలి.
-కర్నాటి యాదగిరి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి
శ్వేత పత్రం విడుదల చేయాలి
Published Thu, Oct 31 2013 3:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement